Chammak Chandra: చమ్మక్ చంద్ర పై మరోసారి ఆరోపణలు చేసిన స్వాతి నాయుడు.. అవకాశాల పేరుతో వాడుకున్నాడంటూ ఆవేదన!
Chammak Chandra: చమ్మక్ చంద్ర ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.ఒకానొక సమయంలో జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చమ్మక్ చంద్ర ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరమయ్యారు. ఇకపోతే చమ్మక్ చంద్ర గురించి గతంలో యూట్యూబ్ శృంగార తారగా పేరు సంపాదించుకున్న స్వాతి నాయుడు తనపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి మనకు తెలిసిందే.
చమక్ చంద్ర తనని మోసం చేశారని ఆమె పెద్ద ఎత్తున అతనిపై ఆరోపణలు చేస్తూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇలా గతంలో చమ్మక్ చంద్ర గురించి స్వాతి నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలా ఆరు సంవత్సరాల క్రితం చమ్మక్ చంద్ర గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ఇక ఈ విషయం ఇంతటితో ముగిసిపోయింది అనుకునేసరికి తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ పాల్గొన్న స్వాతి నాయుడు మరోసారి చమ్మక్ చంద్ర గురించి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన కుటుంబంతో కలిసి జబర్దస్త్ కార్యక్రమాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు చమ్మక్ చంద్ర తనంతట తానే పరిచయం చేసుకున్నారని వెల్లడించారు. అలా తరచు తనకి ఫోన్ కాల్ చేయడం కలవడం చేస్తూ దగ్గరయ్యాడని స్వాతి వెల్లడించింది.
ఈ విధంగా తనని కలుస్తూ తనకు అవకాశాలు ఇప్పిస్తానని, చమ్మక్ చంద్ర దారుణంగా తనని మోసం చేసినట్లు వెల్లడించారు. అప్పటికింకా జబర్దస్త్ కార్యక్రమంలో ఫిమేల్ క్యారెక్టర్ కూడా మగవారే చేయడంతో తన తమ్ముడికి అవకాశం ఇప్పించమని అడిగాను. ఆ సాకుతో తనని దారుణంగా వాడుకున్నాడని, వాడు పెద్ద ఎదవ అని మొదట్లోనే తెలిసిపోయిందంటూ స్వాతి నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక డబ్బుకోసమే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అంటే జబర్దస్త్ లో చాలామంది ఉన్నారు. కానీ ఆయనపై మాత్రమే ఎందుకు ఆరోపణలు చేస్తాను అంటూ స్వాతి నాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…