Featured

Swetha Lakshmipathi : చనిపోయే ముందు నాన్న ఫోన్ చేసి… నా దగ్గర 1500 ఉన్నాయి… నాన్న చనిపోడానికి కారణం అదే…: శ్వేత లక్ష్మీపతి

Swetha Lakshmipathi : యాంకర్ గా అలాగే స్క్రిప్ట్ రైటర్ గా కమెడియన్ గా 70 కి పైగా సినిమాల్లో నటించిన లక్ష్మీపతి గారు చేసింది కొన్ని సినిమాలు అయినా తెలుగు ప్రేక్షకులు ఆయనని మర్చిపోలేరు. ఆంధ్రుడు, అల్లరి, కితకితలు, పెద్దబాబు వంటి సినిమాల్లో అయన కామెడీని ఎవరూ మర్చిపోలేరు. ఇక ఆయన విలన్ గా చేసిన ఏకైక సినిమా ఆయన తమ్ముడు శోభన్ దర్శకత్వం వహించిన మహేష్ బాబు సినిమా బాబీ. ఇక చూడాలని ఉంది సినిమాతో కమెడియన్ గా తెలుగులో బ్రేక్ తెచ్చుకున్న లక్ష్మీపతి గారు 2008 లో మరణించారు. అయన మరణం కంటే నెల రోజుల ముందు ఆయన తమ్ముడు డైరెక్టర్ శోభన్ గుండెపోటుతో మరణించారు. ఇక నెల వ్యవధిలో కుటుంబంలో ఇద్దరినీ కోల్పోవడం ఆ సమయంలో వారి ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేక పోవడంతో చాలా ఇబ్బందులు పడినట్లు లక్ష్మీపతి గారి కూతురు శ్వేత రెసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తన తండ్రి బాబాయ్ తో ఉన్న అనుబంధాన్ని పుస్తకాలు రూపంలో తెచ్చారు శ్వేత.

నాన్నా చనిపోడానికి కారణం…

రేడియో జాకీ గా వైజాగ్ లో పనిచేస్తున్న సమయంలో 2008 జనవరి 7 న బాబాయ్ శోభన్ మరణించారు. ఆయన మరణించిన నెల రోజులకు సరిగ్గా అదే రోజున తండ్రి లక్ష్మీపతి మరణించారు. శ్వేతగారు ఆ సమయంలో జాబ్ చేస్తున్నా ఖర్చులు పోను తన వద్ద 1500 మాత్రమే చేతిలో ఉన్నాయంటూ అసలు ఏం చేయాలో తెలియలేదంటూ తెలిపారు. తన తండ్రి మరణించే రోజు కూడా ఫోన్ చేసారంటూ చెప్పారు. శ్వేతా గారి అమ్మ, తమ్ముడు ఇద్దరూ శ్వేత గారిని చూడటానికి వైజాగ్ వెళ్లగా ఆరోజు తిరిగి హైదరాబాద్ వెళ్లారట. ఇంకా వాళ్ళు ఇంటికి రాలేదని లక్ష్మీపతి గారు కూతురికి ఫోన్ చేసి అడిగితే వస్తారు కాస్త ఎక్కడైనా ఆలస్యమైయుంటుంది అంటూ చెప్పి మామూలుగా మాట్లాడారట. తీరా మధ్యాహ్నం సమయంలో ఆయన అనారోగ్యాంగా ఉంది హాస్పిటల్ తెసుకెళ్ళమని ఫోన్ చేయగా తరచూ లక్ష్మీపతిగారు అనారోగ్యం పాలవుతూ ఉండటం వల్ల శ్వేత సీరియస్ గా తీసుకోలేదట.

అయితే మరో బాబాయ్ ఫోన్ చేసి త్వరగా రా అని చెప్పేసరికి ఏదో జరిగిందని అర్థమై ఫ్లైట్ పట్టుకుని వెళ్లగా ఒక్కసారిగా నాన్న మరణించాడని తెలిసి షాక్ అయ్యాను. సినిమాల్లోకి వచ్చాక తాగడం బాగా అలవాటైపోయింది దాంతో అయన ఆరోగ్యం పాడైంది. ఇక బాబాయ్ మరణంను అసలు తట్టుకోలేని నాన్న ఆ బాధతోనే మరణించారు అంటూ శ్వేత ఎమోషనల్ అయ్యారు. ఆయన అంత్యక్రియలకు మా వద్ద డబ్బులు లేక అందరూ ఆలోచిస్తుంటే ఇండస్ట్రీలో వాళ్ళే కొంతమంది సహాయం చేసారు అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago