Rocking Rakesh : ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ ప్రసారమవుతు ఇప్పటికీ ఏళ్లకు ఏళ్ళు గడిచిపోయినా ఆ షో ఇప్పటికీ జనాలను అలరిస్తోంది. ఒకరకంగా టెలివిజన్ హిస్టరీలో లాంగ్ రన్ లో సక్సెస్ఫుల్ గా ఇప్పటికీ మంచి రేటింగ్ తో నడుస్తోంది. అంతే కాకుండా ఈ షో నుండి ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి దొరికారు. జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ మంచి గుర్తింపు తో నేమ్ ఫేమ్ తో సినిమాల్లో కూడా అవకాశాలను అందుకుంటున్నారు. ఇక అలా జబర్దస్త్ లో అడుగుపెట్టి ప్రస్తుతం అందులో టీం లీడర్ గా ఉంటూ మరో వైపు సినిమాల్లో కూడా చేస్తున్న కమెడియన్ రాకింగ్ రాకేష్.
పెళ్లి వద్దని ఆధ్యాత్మికతలో…
రాకింగ్ రాకేష్ క్లీన్ కామెడితో కుటుంబం మొత్తం హ్యాపీగా తన స్కిట్స్ చూడొచ్చు అనేలా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్. తాను కమెడియన్ గా మొదలై ఇప్పుడు టీం లీడర్ గా మారి జబర్దస్త్ లో ఇప్పటికీ కొనసాగుతున్న తనకు కన్న తల్లి తరువాత జబర్దస్త్ మరో తల్లి అంటూ చెబుతున్న రాకేష్ తాను జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు. చుట్టూ ఉన్న చాలా మంది జీవితాలను చూసి జీవితంలో పెళ్లి అనే బంధం వద్దు అనుకున్నడట. ఇక రాళ్లపల్లి, శివ శంకర్ మాస్టర్ ఇలాంటి వాళ్లతో సన్నిహితంగా ఉన్న రాకేష్ వారి వల్ల ఆధ్యాత్మికత వైపు అడుగులేసాడట. స్మశానంలో పడుకోవడం, కాశీ కి ఎక్కువగా వెళ్లడం వల్ల తన జీవితమార్గం పెళ్లి సంసారం కాదు అనుకున్నాడట. అయితే తన జీవితంలోకి సుజాత రావడం, ఆమెతో పరిచయం ఏర్పడి సుజాతనే పెళ్లి చేసుకుందామని మొదట ప్రపోజ్ చేయడంతో ఆమె తన తల్లితోను చాలా చక్కగా ఉండటం ఇవన్నీ నచ్చి సుజాతతో ప్రేమలో పడిపోయాడట రాకేష్.
ఇక జోర్ధార్ వార్తలతో బాగా ఫేమస్ అయిన సుజాత న్యూస్ ఛానెల్ లో రిపోర్టర్ గా పనిచేస్తూ బిగ్ బాస్ లో కూడా వెళ్లి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మొదట రాకేష్ కు సుజాత ప్రపోజ్ చేయడం విశేషం కాగా రాకేష్ తల్లి మాట్లాడుతూ ఏకంగా సుజాత చిన్నపాపలాగా ఉంటుందంటూ చెప్పారు. ఒళ్ళో తల పెట్టి పడుకుంటు ఇంటికి వస్తే తన రెండో కొడుకు బిడ్డ నక్షత్ర తో పాటు అల్లరి చేస్తుందని వాళ్ళ ఇద్దరి అల్లరి భరించడం కష్టం అంటూ రాకేష్ తల్లి అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…