General News

Syed Sohel: ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయిన బిగ్ బాస్ ఫేమ్ సోహైల్…. అసలేం జరిగిందంటే?

Syed Sohel: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఎంతో మంది సెలెబ్రిటీలుగా మారుతున్నారు.ముఖ్యంగా చాలామంది యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా వారికి సంబంధించిన ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఎంతో ఫేమస్ అయినటువంటి వారిని పలువురు సినీ సెలబ్రిటీలు సంప్రదించి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు.

యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో లోకల్ బాయ్ నాని ఒకరు. ఈయన వైజాగ్ లో ఉంటూ వైజాగ్ సముద్ర తీరాన సముద్రంలో ప్రయాణం చేస్తూ చేపలు పట్టడం ఎలా?ఏ చేపలను ఎలా వండాలి అనే విషయాల గురించి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఇలా అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకొని స్టార్ సెలబ్రిటీ హోదా సంపాదించుకున్న లోకల్ బాయ్ నానిని బిగ్ బాస్ ఫేమస్ సోహైల్ కలిశారు.

సోహైల్ నానితో కలిసి సముద్రంలో ప్రయాణం చేస్తూ ఎలా చేపలు పట్టాలి అనే విషయాలు గురించి సరదాగా ఒక వీడియో చేశారు. ఇక సోహైల్ బోటూ చివరన నిలబడి చేపలు పట్టే ప్రయత్నం చేయడంతో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా సముద్రంలోకి పడిపోయారు. ఇలా సోహైల్ సముద్రంలోకి పడిపోవడంతో అతనితో వచ్చిన వ్యక్తి పెద్ద ఎత్తున కేకలు వేయగ వెంటనే నాని సముద్రంలోకి దూకి సోహైల్ ను క్షేమంగా రక్షించారు.

Syed Sohel: పట్టు తప్పి సముద్రంలో పడిన సోహైల్

ఈ ప్రమాదంలో సోహైల్ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేకపోయినా తన కాళ్లకు కొద్దిపాటి గాయాలు తగిలాయి. ఇలా ఉన్నఫలంగా అనుకోని ప్రమాదం జరగడంతో బోటులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా కాస్త కంగారు వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోని లోకల్ బాయ్ నాని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago