Okkadu Movie Artist: చిత్ర పరిశ్రమలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులుగాను నటీనటులుగాను కొనసాగుతూ ఉంటారు. అయితే కొంతమంది హీరో హీరోయిన్లకు చెల్లెళ్లు తమ్ముడి పాత్రలలో నటించి అనంతరం కనుమరుగవుతూ ఉంటారు. ఇలా పలు సినిమాలలో నటించిన నటీనటులు చాలా కాలం తర్వాత వారికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటోలను చూసి ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు.
ఈ క్రమంలోనే మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు సినిమాలో మహేష్ బాబు చెల్లెలుగా నటించిన నటి బేబీ నిహారిక అందరికీ సుపరిచితమే. తన అల్లరితో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్న బేబీ నిహారిక ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తుందనే విషయానికి వస్తే…
ఒక్కడు సినిమాలో మహేష్ బాబును తన తల్లిదండ్రుల వద్ద ఇరికించి తిరిగి సహాయం చేస్తే చెల్లెలి పాత్రలలో నటించి మెప్పించారు నిహారిక. అయితే ఈమె ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమాలలో కనిపించలేదు. ఇక నిహారిక 10 సంవత్సరాల క్రితం రాజకీయాలకు సంబంధించిన ఒక రాజకీయ నేత కుమారుడిని వివాహం చేసుకొని సినిమాలకు స్వస్తి పలికారు.
ఈ విధంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన నిహారిక ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు. ఇలా ఈమె తన ఫ్యామిలీతో కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇక పొలిటీషియన్ ఇంటికి కోడలు కావడంతో సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఈమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…