Movie News

Taapsee: మరో వివాదంలో నటి తాప్సీ… కేసు నమోదు చేసిన పోలీసులు… ఏం జరిగిందంటే?

Taapsee: ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి నటి తాప్సీ పలు తెలుగు సినిమాలలో నటించి పూర్తిగా తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉండటమే కాకుండా, నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు.

ఈ విధంగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి తాప్సి ఈ మధ్యకాలంలో వరుస వివాదాలలో చిక్కుకుంటున్నారు.ఈమె నటించిన గత రెండు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఫోటోగ్రాఫర్లపై తీవ్రస్థాయిలో మండిపడుతూ వివాదాలలో చిక్కుకున్నారు.అయితే తాజాగా ఈమె మరో వివాదంలో చిక్కుకున్నారు ఈసారి ఏకంగా ఈమెపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

మార్చి 12వ తేదీ ముంబైలో జరిగిన లాక్ మి ఫ్యాషన్ వీక్ 2023 షోలో తాప్సీ ర్యాంప్ వాక్ చేసింది. ఆ షోలో తాప్సీ తన మెడలో హిందువుల ఆరాధించే లక్ష్మీదేవి లాకెట్ ధరించారు అయితే ఇదే విషయమే పెద్ద ఎత్తున వివాదంగా మారింది. అయితే ఈ ఫ్యాషన్ షోలో పాల్గొన్నటువంటి తాప్సి వేసుకున్న డ్రెస్ కారణంగా పెద్ద ఎత్తున ట్రోలింగుకు గురయ్యారు.

ఈమె లో దుస్తులు ధరించకుండా ఏద అందాలను ఆరబోస్తూ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేశారు. ఇలా ఈమె అభ్యంతర కరమైన దుస్తులను ధరించి లక్ష్మీ లాకెట్ ఉన్నటువంటి దండ వేసుకోవడంతో పలువురు హిందువులు తమ మనోభావాలను దెబ్బతీసేలా తమని కించపరిచే విధంగా ఈమె ఈ హారం ధరించారు అంటూ మండిపడుతున్నారు.


Taapsee: హిందూ మనోభావాలను దెబ్బతీశారు…

ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఛత్రిపుర పోలీస్ స్టేషన్ లో తాప్సీపై కేసు నమోదు చేశారు. ఇలాంటి దుస్తులు ధరించి లక్ష్మి హారం వేసుకోవడంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈమెపై ఇండోర్ లోని హింద్ రక్షక్ సంగతన్ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే మాలిని తనయుడు ఏకలవ్య గౌర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి ఈ విషయంపై తాప్సి ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

8 minutes ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

23 minutes ago

“పాక్ అణు కేంద్రంపై భారత్ దాడి?.. రక్షణ నిపుణుడి వ్యాఖ్యలతో అంతర్జాతీయ కలకలం”

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్‌’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…

33 minutes ago

సింధ్ ఒప్పందం హక్కులతో భారత్ దూకుడు.. పాక్‌కు వెళ్లే నీటిపై చెక్..

భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…

50 minutes ago

అంబాజీ ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల విరాళం.. ఐదేళ్లు భక్తులకు ఉచిత భోజనం!

భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…

1 hour ago

ప్రభాస్ – ప్రశాంత్ వర్మ మూవీ ఫిక్స్.. భారీ బడ్జెట్‌తో రంగంలోకి హోంబలే!

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన కాంబినేషన్ ఇదే. రెబల్ స్టార్ Prabhas, ‘హనుమాన్’తో సంచలనం సృష్టించిన దర్శకుడు…

1 hour ago