Taapsee: ఇటీవల కాలంలో సినిమా సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లికి సిద్ధమయ్యారు. ఇటీవల నటి రకుల్ ప్రీత్ సింగ్ ఎంతో ఘనంగా నటుడు జాకీ భగ్నానిను గోవాలో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరి వివాహం జరిగిన వెంటనే మరొక సెలబ్రిటీ కూడా పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో తాప్సీ ఒకరు అయితే ఈమె కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. మరి ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు అతని బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే..
తాప్సీ దాదాపు పదేళ్లుగా డెన్మార్క్ బ్యాడ్మింటన్ కోచ్ మథియాస్ బోయ్‌తో ప్రేమలో ఉంది. ఇన్నాళ్లు చాలా సైలెంట్‌గా తన లవ్ ట్రాక్‌ని నడిపించింది. ఇటీవలే ఆమె ప్రేమ విషయం బయటకు వచ్చింది. ఇలా పది సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ ఇటీవల పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే వీరి వివాహం మార్చి నెలలో జరగబోతుందని సమాచారం.
మార్చిలోనే వివాహం..
తాప్సీ మథియాస్ వివాహం ఉదయపూర్ లోని ఓ పురాతన ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నారని తెలుస్తుంది. వీరి వివాహం సిక్కు క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతులలో జరగబోతుందని తెలుస్తోంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…