Taapsi: రింగుల జుట్టుతో సొట్ట బుగ్గలు చిన్నది తాప్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా నటించిన ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా ఈమె హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్న తదుపరి తెలుగులో సినిమా అవకాశాలు అందుకున్నారు.
ఇలా ఈమె తెలుగులో నటించిన పలు చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఈ తరుణంలోనే బాలీవుడ్ అవకాశాలు రావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ వెళ్లిన తాప్సీ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే పాగా వేశారు. అక్కడ కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించింది కొన్ని సినిమాలు అయినప్పటికీ ఈమె గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరోతో కలిసి నటిస్తున్న సమయంలో ఈమె ఆ హీరోతో పీకల్లోకి ప్రేమలో మునిగిపోయిందని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని కానీ కొన్ని కారణాలవల్ల రాఖీ కట్టి బ్రేకప్ చెప్పారు అంటూ వార్తలు హల్చల్ చేశాయి. అయితే తన గురించి వచ్చిన ఈ వార్తలపై ఈమె ఒక ఇంటర్వ్యూ సందర్భంగా స్పందించి క్లారిటీ ఇచ్చారు.
మంచు మనోజ్..
ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ నేను మంచు మనోజ్ తో ప్రేమలో ఉన్నానని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ వార్తలలో ఏమాత్రం నిజం లేదు నాకు మంచు ఫ్యామిలీతో చాలా మంచి అనుబంధము ఏర్పడింది. నేను హైదరాబాద్ వస్తే ఎక్కడ ఉండాలి అని ఆలోచించను నేరుగా మంచు వారి ఇంటికి వెళ్తానని తెలిపారు. ఇక మేమిద్దరం ప్రేమించుకున్నామని వార్తలు వచ్చాయి అందులో నిజం లేదు మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదు. ఇక మీరు నమ్మకపోతే తనకు రాఖీ కట్టమన్నా కడతాను దానికి నేను వెనకాడను అంటూ క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…