Tag Archives: acharya movie

Acharya Movie: ఆచార్య సినిమా సెట్ లో భారీ అగ్నిప్రమాదం… మంటల్లో కాలిపోయిన ధర్మస్థలి సెట్!

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా కోసం చిత్ర బృందం 25 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అతిపెద్ద సెట్ నిర్మించారు. ఈ సినిమాలో పాదగట్టం అంటూ ఒక విలేజ్ సెట్ మొత్తం నిర్మించారు. ఇలా ఈ సెట్ కోసం నిర్మాతలు 25 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినప్పటికీ ఈసెట్ నిర్మాతలు తొలగించలేదు. ఇందులో ఇతర సినిమాలు కూడా షూటింగ్ జరుపుకుంటూ ఉన్నాయి. అయితే ఉన్నఫలంగా ఆచార్య సినిమా కోసం వేసినటువంటి ధర్మస్థలి సెట్టులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో భాగంగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

ఇక ఈ విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వెళ్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ధర్మస్థలి సెట్ మొత్తం కాలిపోయింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని ఆరా తీయగా సెట్ లో ఉన్న ఎవరో ప్రధాన ద్వారం వద్ద కూర్చుని సిగరెట్ తాగి అక్కడే పడేశారు.

Acharya Movie: సిగరెట్ కారణంగా వ్యాపించిన మంటలు…

ఈ విధంగా పడేసిన సిగరెట్ కారణంగా మంటలు వ్యాపించి ధర్మస్థలి సెట్ మొత్తం కాలిపోయిందని తెలుస్తోంది.ఇక మెగాస్టార్ ఆచార్య సినిమా తర్వాత గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది అదేవిధంగా వాల్తేరు వీరయ్య ద్వారా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.

Acharya Movie: ఆచార్య ఫ్లాప్.. సినిమా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న చరణ్ ,చిరు.. అసలు విషయం చెప్పిన మెగాస్టార్?

Acharya Movie:మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా మంచి విజయం సాధించడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోని సినిమా హిట్ అయిన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం మెగాస్టార్ చిరంజీవి పలు విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా గురించి మాత్రమే కాకుండా ఆచార్య సినిమా గురించి కూడా మాట్లాడారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరూ కలిసి నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా ఫ్లాప్ అవడంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ విషయం గురించి ఎప్పుడు చిరంజీవి ప్రస్తావించిన కొరటాల ఖాతాలోకే వేసేవారు.తాజాగా గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఆచార్య సినిమా గురించి మాట్లాడుతూ ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నిర్మాతలకు 80% రెమ్యూనరేషన్ నేను చరణ్ తిరిగి వెనక్కి ఇచ్చామంటూ తెలియజేశారు.

Acharya Movie: సినిమా బాధ్యత మొత్తం మాదే…

మేము నటించిన ఏ సినిమా ఫ్లాప్ అయిన ఆ సినిమా బాధ్యత మేమే తీసుకుంటామని ఈ సందర్భంగా చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాని రామ్ చరణ్ తన సొంత బ్యానర్ లో నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఇక రామ్ చరణ్ తో పాటు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మించారు.ఇక ఈ సినిమా ఫ్లాప్ అయితే రామ్ చరణ్ 80% రిటర్న్ ఇచ్చినప్పటికీ కొరటాల ఈ సినిమా కోసం ఆస్తులను ఎందుకు అమ్ముకున్నారనే విషయంపై మరోసారి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Chiranjeevi: నేను బాధితున్నే.. డైరెక్టర్లు హడావిడిగా సినిమాలు చేయకండి.. డైరెక్టర్లకు క్లాస్ పీకిన చిరు!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ విషయం గురించి పూర్తిగా ఆలోచించి ఆ మాటలను గొంతులో నుంచి కాకుండా గుండెల్లో నుంచి వస్తుందని అందరికీ తెలిసిందే. ఇలా తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి డైరెక్టర్లకు కాస్త చురకలాంటించారు. ఈ సందర్భంగా ఈయన ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరో హీరోయిన్లను దర్శక నిర్మాతలను ఉద్దేశిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ప్రేక్షకులు ఎప్పుడు కూడా కంటెంట్ ఉన్న సినిమాలనే ఆదరిస్తారు కంటెంట్ లేని సినిమాలను నిర్మొహమాటంగా తిరస్కరిస్తారని వెల్లడించారు.

ఇలా తాను నటించిన ఆచార్య సినిమా కూడా ఇదే కోవకి వస్తుందని ఈయన వెల్లడించారు. నేను కూడా బాధితుడేనని ఈ సందర్భంగా ఈయన ఆచార్య డిజాస్టర్ గురించి ప్రస్తావించారు. తాజాగా ఇండస్ట్రీలో విడుదలయ్యి హిట్ అందుకున్న బింబిసారా, సీతారామం, కార్తికేయ 2 సినిమాల విజయం గురించి ప్రస్తావించారు. ఇక డైరెక్టర్ల గురించి మాట్లాడుతూ దర్శకులు ఎప్పుడు కూడా సినిమా కంటెంట్ పై ఫోకస్ పెట్టాలి కానీ కాంబినేషన్ల మీద, సినిమా రిలీజ్ మీద కాదని సినిమాలో కంటెంట్ లేకపోతే కాంబినేషన్ ఉండి ఏ లాభం అంటూ ఈయన తెలిపారు.

Chiranjeevi: కొరటాలను ఉద్దేశించే మెగాస్టార్ మాట్లాడారా..

చిత్ర పరిశ్రమ బాగుపడాలంటే అంతా డైరెక్టర్ చేతిలోనే ఉందని ఈ సందర్భంగా చిరంజీవి డైరెక్టర్లకు తనదైన స్టైల్ లో క్లాస్ పీకారు.ఇలా చిరంజీవి డైరెక్టర్లను ఉద్దేశించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈయన కొరటాల శివని ఉద్దేశించి చేశారని పలువురు భావిస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతోనే మెగాస్టార్ ఈ విషయాలను ప్రస్తావించారని తెలుస్తోంది.

Acharya Movie: ఆచార్య ప్లాప్ కు కొరటాలకు సంబంధం లేదు.. అతనిది మామూలు అనుభవం కాదు!

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా గత నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి షో తోనే ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడి ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.ఇకపోతే ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆచార్య సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడానికి కొరటాల శివ కారణం కాదని, ఆయనకు సంబంధం లేదని వెల్లడించారు. కొరటాల శివకు ఇదో అనుభవం ఉంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన జనతాగ్యారేజ్ కూడా ఆచార్య కాన్సెప్ట్ తోనే వచ్చింది. అయితే ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది అంటూ యండమూరి వెల్లడించారు.మెగాస్టార్ చిరంజీవి నక్సలైట్ గా గతంలో తన దర్శకత్వంలో రక్తసింధూరం అనే చిత్రం తెరకెక్కిన ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఆయనకు ఎంతో అనుభవం ఉంది…


ఒక స్టార్ హీరో నక్సలైట్ గా చూపించడం ప్రేక్షకులు స్వీకరించలేకపోయారు. రక్తసింధూరం సినిమాలో నక్సలైట్ గా చిరంజీవిని చూపించి ఇన్స్ స్పెక్టర్ గా చిరంజీవిని చూపించడంతో సెట్ అవ్వలేదని మేము భావించాము. అయితే ఇన్స్పెక్టర్ స్థానంలో చిరంజీవి బదులు వేరే వారిని పెడితే చిరంజీవి పాత్ర చిన్నది అయిపోతుంది. ఆచార్య విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి నక్సలైట్ పాత్రల్లో కనిపించారు. అయితే నక్సలైట్ పాత్ర చిరంజీవికి అచ్చి రాలేదని కాదు కానీ కొన్నిసార్లు అలా జరుగుతుంటాయి. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కొరటాలకు ఏమాత్రం సంబంధం లేదని, ఆయనకు ఎంతో అనుభవం ఉందని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా యండమూరి తెలియజేశారు.

Acharya Movie: ఆచార్యకు షాక్ ఇచ్చిన అమెజాన్.. ఆచార్య పై ఇంట్రెస్ట్ చూపని అమెజాన్?

Acharya Movie: కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.ఎట్టకేలకు ఈ సినిమా సెప్టెంబర్ 29వ తేదీన విడుదలైన మొదటి షో తోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.

Acharya Movie: ఆచార్యకు షాక్ ఇచ్చిన అమెజాన్.. ఆచార్య పై ఇంట్రెస్ట్ చూపని అమెజాన్?

ఇప్పటివరకు పరాజయం అంటూ తెలియని కొరటాలకు ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇద్దరు స్టార్ హీరోలు నటించిన ఈ సినిమాకి దారుణమైన ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ఇక రంజాన్ పండుగ అయిన ఆచార్యకు కలిసి వస్తుందని భావించారు. రంజాన్ పండుగ కూడా తీవ్ర నిరాశ కలిగించింది.

Acharya Movie: ఆచార్యకు షాక్ ఇచ్చిన అమెజాన్.. ఆచార్య పై ఇంట్రెస్ట్ చూపని అమెజాన్?

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఓటీటీ పై మేకర్స్ ఆశలు లు పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఒక పెద్ద సినిమా విడుదలైన తర్వాత నాలుగు వారాల వరకు ఆ సినిమాని ఓటీటీ లో విడుదల చేయడానికి అనుమతి ఉంటుంది. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే రెండు వారాల్లో విడుదల చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తారు.

అమెజాన్ అయినా ఆచార్యను ఆదుకుంటుందా…

మెగా స్టార్, మెగా పవర్ స్టార్ నటించిన ఆర్య సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఇక ఒక సినిమా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేయడం కోసం ముందుగా అనుకున్న రేటు కంటే మేకర్స్ ఎక్కువగా డిమాండ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఆచార్య మేకర్స్ కూడా సినిమా ఫుల్ డిజిటల్ రైట్స్ ను ఎక్కువ ధరను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆచార్య మేకర్స్ డిమాండ్ చేసిన రేటుకు అమెజాన్ అంగీకరించలేదని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం పై చర్చలు జరుగుతున్నాయి. మరి అమెజాన్ అయిన ఆచార్య ఊరట కలిగిస్తుందా… లేక నిరాశపరుస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

Getup Srinu: కాజల్ తో పాటు గెటప్ శ్రీనుకి గట్టి షాక్ ఇచ్చిన ఆచార్య.. అసలేం జరిగిందంటే?

Getup Srinu:అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనే ప్రయత్నం చేసేవారికి ఒక స్టార్ హీరో సినిమాలో అవకాశం వస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అలాంటి అవకాశం వస్తే ఏ నటుడైనా ఎగిరి గంతులేస్తారు. స్టార్ హీరో సినిమాలో నటించడం వల్ల తమకంటూ ఓ గుర్తింపు వస్తుందని తమకు మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తారు.

Getup Srinu: కాజల్ తో పాటు గెటప్ శ్రీనుకి గట్టి షాక్ ఇచ్చిన ఆచార్య.. అసలేం జరిగిందంటే?

ఇలా స్టార్ హీరో సినిమాలో అవకాశం రావడంతో ఎగిరి గంతులు వేశాడు జబర్దస్త్ గెటప్ శ్రీను. ఈయన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో ఒక అద్భుతమైన పాత్రలో నటించారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి కోసం ఎక్కువ రోజుల పాటు సమయం కేటాయించిన గెటప్ శ్రీను సినిమా విడుదలైన తర్వాత చేదు అనుభవం మిగిలింది.

Getup Srinu: కాజల్ తో పాటు గెటప్ శ్రీనుకి గట్టి షాక్ ఇచ్చిన ఆచార్య.. అసలేం జరిగిందంటే?

నిరాశలో గెటప్ శ్రీను…

ఆచార్య సినిమా కోసం ఎక్కువ రోజులు పాటు కష్టపడిన ఏ ఫలితం లేకుండా పోవడంతో గెటప్ శ్రీను ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గెటప్ శ్రీను ఆచార్య సినిమాలో కాజల్ తో పాటు కలిసి చేసిన కామెడీ సన్నివేశాలన్నింటిని తొలగించారని సమాచారం. ఈ క్రమంలోనే ఈ సినిమాలో గెటప్ శ్రీను పాత్ర లేకపోవడంతో ఎంతో నిరాశకు గురయ్యారు. కాజల్ అగర్వాల్ తో కామెడీ సన్నివేశాలు ఉండటంతో తప్పనిసరి పరిస్థితులలో కాజల్ అగర్వాల్ తో పాటు గెటప్ శ్రీను సన్నివేశాలను కూడా తొలగించారు.ఈ సినిమా విడుదలైన తర్వాత తనకు ఎంతో మంచి పేరు వస్తుందని సినిమా గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న గెటప్ శీను ఆశలపై ఆచార్య గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి.

Pawan Kalyan : కొరటాల డైరెక్షన్ లో పవన్ సినిమా మాకొద్దు.. మరో ఆచార్యను మేము చూడలేము : పవన్ ఫ్యాన్స్

Pawan Kalyan: కొరటాల శివ విజయానికి మారుపేరుగా నిలిచినటువంటి ఈయన ఆచార్య సినిమాతో పరాజయం పాలయ్యారు.ఇప్పటివరకు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమాపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి షో తోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో వీఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ వాడటంతో చిరంజీవి లుక్ పూర్తిగా మార్చేశారని పెద్దఎత్తున మెగా అభిమానులు కొరటాల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కొరటాల శివ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తప్పనిసరిగా సినిమా వస్తుందని వెల్లడించారు.అయితే ఆచార్య సినిమా విడుదల అయి ఈ సినిమా ఫలితాన్ని చూసిన అనంతరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్దఎత్తున సోషల్ మీడియా వేదికగా కొరటాల పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా మాకొద్దు మహాప్రభో అంటూ మీమ్స్, పోస్టులు పెడుతున్నారు.

కొరటాల నుంచి ఊహించలేదు…

ఈ క్రమంలోనే వీటిపై మరికొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్పందిస్తూ… ఈ కాంబినేషన్లో సినిమా మాకొద్దు మేము మరో ఆచార్య సినిమాని చూడాలనుకోవడం లేదు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఏదిఏమైనా ఆచార్య సినిమా ఫై ఎన్నో అంచనాలు పెట్టుకున్న మెగా అభిమానులకు కొరటాల తీవ్ర నిరాశ కలిగించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్దఎత్తున సోషల్ మీడియా వేదికగా ఇలాంటి మీమ్స్ వైరల్ చేస్తున్నారు.

Acharya Movie: తెరవెనుక ఉండి ఆచార్య సినిమా పై దుష్ప్రచారం… ఆ వర్గమే ఇలాంటి చర్యలకు పాల్పడిందా?

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా మూడు సంవత్సరాల నుంచి వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమా విడుదలైన తర్వాత ఒక్కొక్కరు ఒక్కో విధంగా రివ్యూ ఇస్తూ వచ్చారు.

అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున దుష్ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా విడుదల కాకముందు నుంచి ఈ సినిమా పట్ల నెగిటివిటీ వస్తూనే ఉంది.అయితే సినిమా విడుదల కాకుండానే ఇలాంటి నెగిటివిటీ రావడంతో కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ కథను నడిపిస్తున్నారని అర్థమవుతోంది.

ఆచార్య సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకూలంగా ఉండటానికి ఓ వర్గం వారు ఏమాత్రం సహించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకి పెద్ద ఎత్తున నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు. ఇలా వీరి ప్రయత్నం కొంతమేర సక్సెస్ కూడా అయ్యింది.ఇక్కడ ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన విషయం ఏమిటంటే ఆ వర్గానికి చెందిన వారు కూడా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారే కావడం గమనార్హం.


రేటింగ్ బట్టి సినిమాలకు వెళ్లరు…

ఇలా ఈ సినిమాకి ముందు నుంచి దుష్ప్రచారం చేయడంతో కొంతమేర సినిమాకి నష్టం ఏర్పడిందా అంటే సోషల్ మీడియాలో వస్తున్న రేటింగ్స్ బట్టి జనాలు సినిమాకి వెళ్లారు.ఇలా సోషల్ మీడియాలో ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ అభిమానులు థియేటర్ కి వెళ్లి సినిమా చూసిన తరువాతే సినిమాకి రివ్యూ ఇస్తారు. అయినా మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఈ విధమైనటువంటి నెగిటివిటి రావడం కొత్తేమీ కాదు అయితే ఈసారి సరికొత్త విధానంలో ఈయన సినిమాకు నెగిటివిటీ ఏర్పడింది.

Acharya Movie: ఆచార్య సినిమా నాదే… నన్ను మోసం చేసి కథ కొట్టేసారు: రచయిత రాజేష్ మండూరి

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్ నిరంజన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Acharya Movie: ఆచార్య సినిమా నాదే… నన్ను మోసం చేసి కథ కొట్టేసారు: రచయిత రాజేష్ మండూరి

ఈ విధంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్న నేపథ్యంలో ఆచార్య సినిమా కథ కాపీ అంటూ రచయిత రాజేష్ మండూరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజేష్ ఈ విషయాన్ని తెలియజేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజేష్ సొంత గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ కథను సిద్ధం చేశానని వెల్లడించారు.

Acharya Movie: ఆచార్య సినిమా నాదే… నన్ను మోసం చేసి కథ కొట్టేసారు: రచయిత రాజేష్ మండూరి

ఇలా ఎంతో కష్టపడి ఈ సినిమాని క్రియేటివ్ గా కాకుండా నా జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించి మా నియోజకవర్గ ఎమ్మెల్యే సహాయంతో వారి సొంత బ్యానర్ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారికి సినిమా కథ వినిపించానని తెలిపారు. ఈ విధంగా మైత్రి మూవీ మేకర్స్ వారికి ఈ సినిమా కథను వినిపించగా నిజంగా కథ చాలా అద్భుతంగా ఉందని వారు నన్ను అప్రిషియేట్ చేశారు. ఇలా బ్రీఫ్ గా కథ విన్న మైత్రి మూవీ మేకర్స్ వారి బ్యానర్ కి సంబంధించిన చెర్రీ అనే వ్యక్తికి కథ మొత్తం పిన్ టు పిన్ వివరించాను.

ఇలా కథ చెబుతున్న సమయంలో చెర్రీ అనే వ్యక్తి ఫోన్ రికార్డర్ ఆన్ చేసి పెట్టారు. అయితే తనకు సంబంధించిన వాళ్ళు అక్కడ లేకపోవడంతో తరువాత వారు ఈ కథను వింటారనే ఉద్దేశంతోనే రికార్డర్ ఆన్ చేశారని నేను భావించాను ఇలా కథను మొత్తం వింటూ రికార్డ్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి సినిమా కొరటాల శివలాంటి వారు చేస్తే చాలా బాగుంటుంది అని నాతో అన్నారు.

ఇలా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారిపై పెద్ద మొత్తంలో బడ్జెట్ పెట్టడం కుదరదు అంటూ అప్పుడు మాట్లాడారు. ఇలా కథ మొత్తం విని ఏ విషయము తనకు తెలియ చేయకపోవడంతో తాను కూడా వారికి కథ నచ్చలేదేమో బడ్జెట్ ఎక్కువ అవుతుందని భావించారేమో అందుకే ఎలాంటి సమాచారం అందించలేదని మేము కూడా మా తదుపరి సినిమాల పై ఫోకస్ పెట్టాము.

దారుణంగా మోసం చేశారు..

ఇలా నా దగ్గర విని రికార్డ్ చేసుకున్న కథ చివరికి కొరటాల శివ దగ్గరకు వెళ్లిందని, నన్ను మోసం చేసి నా కథని కాపీ కొట్టారంటూ రాజేష్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసి అసోసియేషన్ కు ఫిర్యాదు చేయడం వారు నా కథను మొత్తం కొరటాలకు పంపిస్తే అతను నా కథకు తన కథకు సంబంధం లేదని చెప్పారు. నా కథను అతనికి పంపించినప్పుడు తను కూడా తన ఆచార్య సినిమా కథను నాకు పంపించాలి. కానీ 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కథను ఎలా ఇస్తాము అంటూ కొరటాల తన కథను ఇవ్వలేదంటూ రాజేష్ ఆవేదనచెందారు.ఇలా మోసం చేసి నా నుంచి ఆచార్య సినిమాని కాపీ కొట్టారంటూ ఈయన ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం రాజేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Anasuya Remuneration: ఆచార్య సినిమా కోసం అనసూయ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Anasuya Remuneration:బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి పేరు రావడంతో వరుస సినిమాలు చేస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.

Anasuya Remuneration: ఆచార్య సినిమా కోసం అనసూయ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటించిన అనసూయ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాలో కూడా నటించారు. ఇక ఆచార్య సినిమాలో అనసూయ పాత్ర ఎంతో కీలకంగా ఉందని తెలుస్తోంది.

Anasuya Remuneration: ఆచార్య సినిమా కోసం అనసూయ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఈ పాత్రకోసం అనసూయ పూర్తిగా తన లుక్ పరంగా చాలా మేకోవర్ అయ్యిందట. ఈ సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటించడం వల్ల ఈమెకు రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఇస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా కథని మొత్తం కీలక మలుపు తిప్పే పాత్రలో అనసూయ నటిస్తున్నారు.

భారీ రెమ్యూనరేషన్…

ఈ పాత్రలో చేయడం కోసం అనసూయకు ఏకంగా పాతిక లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ సమాచారం. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ ఈ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమాని ఏప్రిల్ నెలలోనే విడుదలకు సిద్ధమైంది.