Acharya Movie:మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా మంచి విజయం సాధించడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోని సినిమా హిట్ అయిన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం మెగాస్టార్ చిరంజీవి పలు విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా గురించి మాత్రమే కాకుండా ఆచార్య సినిమా గురించి కూడా మాట్లాడారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరూ కలిసి నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా ఫ్లాప్ అవడంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ విషయం గురించి ఎప్పుడు చిరంజీవి ప్రస్తావించిన కొరటాల ఖాతాలోకే వేసేవారు.తాజాగా గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఆచార్య సినిమా గురించి మాట్లాడుతూ ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నిర్మాతలకు 80% రెమ్యూనరేషన్ నేను చరణ్ తిరిగి వెనక్కి ఇచ్చామంటూ తెలియజేశారు.
మేము నటించిన ఏ సినిమా ఫ్లాప్ అయిన ఆ సినిమా బాధ్యత మేమే తీసుకుంటామని ఈ సందర్భంగా చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాని రామ్ చరణ్ తన సొంత బ్యానర్ లో నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఇక రామ్ చరణ్ తో పాటు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మించారు.ఇక ఈ సినిమా ఫ్లాప్ అయితే రామ్ చరణ్ 80% రిటర్న్ ఇచ్చినప్పటికీ కొరటాల ఈ సినిమా కోసం ఆస్తులను ఎందుకు అమ్ముకున్నారనే విషయంపై మరోసారి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…