Manchu Vishnu: టాలీవుడ్ నటుడు మా అధ్యక్షుడు మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయి సంవత్సరం పూర్తి కావడంతో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఈయన మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో ఎంతో అలజడి వాతావరణం నెలకొందని ఈయన గుర్తు చేసుకున్నారు. ఇకపోతే మా ఎన్నికలు ఏకంగా సాధారణ ఎన్నికలను తలపించాయని విష్ణు తెలిపారు.మా అధ్యక్షుడిగా తన కేవలం అసోసియేషన్ బాధ్యత మాత్రమే కాకుండా ప్రేక్షకులకు కూడా జవాబుదారీ అంటూ తెలిపారు.
ఇకపోతే అసోసియేషన్ లో ఎవరైనా సభ్యత్వం పొందాలి అనుకుంటే కనీసం వారు రెండు సినిమాలలో నటించి ఆ సినిమాలు విడుదలై ఉండాలని అలాగే సినిమాలలో కనీసం ఒక ఐదు నిమిషాలు పాటు అయినా డైలాగులు చెప్పి ఉండాలని తెలిపారు. ప్రస్తుతం అసోసియేషన్ లో 20 మంది నటులు కానీ వారు సభ్యత్వం పొంది ఉన్నారని ఈయన పేర్కొన్నారు.
ఇకపోతే అసోసియేషన్ కి ఎవరైనా వ్యతిరేకంగా ధర్నాలు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.మా ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలలో 90% ఇప్పటికే పూర్తి చేసామని త్వరలోనే మా బిల్డింగు కూడా పూర్తి అవుతుందని విష్ణు వెల్లడించారు.మా బిల్డింగ్ విషయంలో అసోసియేషన్ సభ్యుల ముందు తాను రెండు ప్రతిపాదనలు ఉంచానని తెలిపారు.
ఒకటి ఫిలింనగర్ కి అరగంట ప్రయాణం దూరంలో బిల్డింగ్ నిర్మించాలని సూచించాము అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి బిల్డింగ్ పడగొట్టి అదే స్థానంలో నూతన నిర్మాణం చేపడతామని అందుకు అయ్యే ఖర్చులను మొత్తం తానే భరిస్తాననే ప్రతిపాదనలను అసోసియేషన్ సభ్యుల ముందు ఉంచామని విష్ణు తెలిపారు.అయితే చాలామంది రెండవ ప్రతిపాదనకే ఇష్టత చూపుతున్నారని తెలిపిన ఈయన త్వరలోనే ఈ బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తి చేస్తామని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…