Tag Archives: ameesha patel

Ameesha Patel: ఎన్టీఆర్ గురించి గొప్పగా ట్వీట్ చేసిన నటి… ట్రోల్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అసలేమైందంటే?

Ameesha Patel: బాలీవుడ్ నటి అమీషా పటేల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు తెలుగులో ఈమె బద్రి నాని నరసింహుడు వంటి సినిమాలలో నటించారు.ఈమె తెలుగులో నటించినది కొన్ని సినిమాలే అయినా ఈమెకు హిట్ ఇచ్చినది మాత్రం బద్రి సినిమా అని చెప్పాలి. ఇలా తెలుగులో నటించిన ఈమె అనంతరం తెలుగు తెరకు దూరమయ్యారు.

ఇకపోతే తాజాగా నటి అమీషా పటేల్ ఎన్టీఆర్ గురించి ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారు.2005 బి.గోపాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ అమీషా పటేల్ సమీరారెడ్డి కాంబినేషన్లు నరసింహుడు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ సొంతం చేసుకుంది.ఇకపోతే తాజాగా అమీషా పటేల్ ఈ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి ఉన్నటువంటి ఒక రొమాంటిక్ ఫోటో ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

ఇలా ఈ ఫోటోని షేర్ చేస్తూ ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఎన్టీఆర్ అప్పట్లో సూపర్ సార్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఈయన ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తారక్ లవ్లీ కో స్టార్… హార్డ్ వర్క్ స్టార్ అంటూ తన గురించి పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు.

Ameesha Patel: కొంచెం చూసుకోవాలి కదా మేడం…

ఈ విధంగా ఈమె ట్రీట్ చేస్తూ ఎన్టీఆర్ కు ట్యాగ్ చేయకుండా వేరే ఖాతాకు ట్యాగ్ చేశారు.ఇలా రెండుసార్లు ఈమె తప్పుగా ట్యాగ్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు ఈమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు అయితే ఒకసారి చూసుకోవాలి కదా ఎవరికీ ట్యాగ్ చేశారో అంటూ నటి అమీషా పటేల్ పై ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పిన చిన్న తప్పు వల్ల ట్రోలింగ్ కి గురయ్యారు.

Ameesha Patel : పబ్లిక్ గా పవన్ కళ్యాణ్ హీరోయిన్ కు ప్రపోజ్ చేసిన కాంగ్రెస్ నేత తనయుడు..

Ameesha Patel-Faisal Patel బద్రి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి కుర్రకారు మదిని దోచుకున్న బ్యూటీ అమీషా పటేల్. తను  అంతలా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ బద్రి సినిమా తరవాత మహేష్ తో నాని, ఎన్టీఆర్ తో నరసింహుడు లాంటి సినిమాలు చేసినా పెద్దగా టాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోయింది.

అటు బాలీవుడ్ లో కూడా పెద్దగా హిట్లు కూడా నమోదుకాలేదు. దీంతో కెరీర్ పరంగా అమీషా పటేల్ వెనకబడిపోయింది.  అయితే ఈ అమ్మడు మాత్రం తన ఘాటు ఫోటోలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. 45 ఏళ్ల వయసులో కూడా తన అందాలతో యువత మనసును దోచుకుంటుంది.

Ameesha Patel-Faisal Patel: పబ్లిక్ గా పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రపోజ్ చేసిన వ్యక్తి.. నన్ను పెళ్లి చేసుకుంటావా.. అంటూ పోస్ట్!

ఎప్పుడూ ఏదో ఓ ఫోటోతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తూ ఉంటుంది. ఇక పర్సనల్ లైఫ్ గురించి అమీషా పటేల్ ఎప్పుడూ సిక్రెట్ పాటిస్తుంది. ఇప్పటి వరకు లవ్, ఎఫైర్స్ వంటి వాటికి అమీషా పటేల్ దూరంగానే ఉంది.  ఇదిలా ఉంటే తాజాగా ఓ విషయం మాత్రం సంచలనంగా మారింది. అమీషా పటేల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కుతున్నారనే వార్త నెట్టింట్ల వైరల్ గా మారింది.

హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్.. ఐ లవ్ యు..

దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తనయుడు ఫైజల్ పటేల్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల డిసెంబర్ 30న ఫైజల్ పటేల్ పుట్టిన రోజు సందర్భంగా.. అమిషా పటేల్ ‘హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్.. ఐ లవ్ యు..‘‘ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. దీనికి ప్రతిగా ఫైజల్ సంచలన రిప్లే ఇచ్చాడు. ‘థాంక్యూ అమీషా.. నేను ఈ సందర్భంగా పబ్లిక్ గా ప్రపోజ్ చేస్తున్నా.. నన్ను పెళ్లి చేసుకుంటావా ?’ అని రిప్లై ఇచ్చాడు. అయితే వెంటనే పోస్ట్ ను డిలీట్ చేసినా.. అప్పటికే నెట్టింట ఇది వైరల్ గా మారింది. 

దీంతో రానున్న రోజుల్లో అమీషా పటేల్ పెళ్లి పీటలు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది.  ఇప్పటికే 45 ఏళ్లకు చేరిన అమీషా త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టెలా ఉంది. ఇదిలా ఉంటే ఫైజల్ అమీషా పటేల్ కన్నా మూడేళ్లు చిన్నవాడు. ఇప్పటికే ఫైజల్ పటేల్ కు వివాహం జరిగినా…  2016లో ఫైజల్ భార్య జైనాబ్ పటేల్ కార్డియాక్ సమస్యలతో మరణించారు. అయితే కొంత కాలంగా సింగిల్ గా ఉంటున్న ఫైజల్ పటేల్.. అమిషాతో ప్రేమలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.