Ameesha Patel: బాలీవుడ్ నటి అమీషా పటేల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు తెలుగులో ఈమె బద్రి నాని నరసింహుడు వంటి సినిమాలలో నటించారు.ఈమె తెలుగులో నటించినది కొన్ని సినిమాలే అయినా ఈమెకు హిట్ ఇచ్చినది మాత్రం బద్రి సినిమా అని చెప్పాలి. ఇలా తెలుగులో నటించిన ఈమె అనంతరం తెలుగు తెరకు దూరమయ్యారు.
ఇకపోతే తాజాగా నటి అమీషా పటేల్ ఎన్టీఆర్ గురించి ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారు.2005 బి.గోపాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ అమీషా పటేల్ సమీరారెడ్డి కాంబినేషన్లు నరసింహుడు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ సొంతం చేసుకుంది.ఇకపోతే తాజాగా అమీషా పటేల్ ఈ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి ఉన్నటువంటి ఒక రొమాంటిక్ ఫోటో ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
ఇలా ఈ ఫోటోని షేర్ చేస్తూ ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఎన్టీఆర్ అప్పట్లో సూపర్ సార్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఈయన ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తారక్ లవ్లీ కో స్టార్… హార్డ్ వర్క్ స్టార్ అంటూ తన గురించి పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు.
ఈ విధంగా ఈమె ట్రీట్ చేస్తూ ఎన్టీఆర్ కు ట్యాగ్ చేయకుండా వేరే ఖాతాకు ట్యాగ్ చేశారు.ఇలా రెండుసార్లు ఈమె తప్పుగా ట్యాగ్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు ఈమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు అయితే ఒకసారి చూసుకోవాలి కదా ఎవరికీ ట్యాగ్ చేశారో అంటూ నటి అమీషా పటేల్ పై ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పిన చిన్న తప్పు వల్ల ట్రోలింగ్ కి గురయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…