Singer sunitha: టాలీవుడ్ ప్రేక్షకులకు సింగర్ సునీత గురించి పరిచయం అవసరం లేదు.ఈమె టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ గా ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈమె కేవలం సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. సునీత ఇండస్ట్రీలో దాదాపు 120 మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో అద్భుతమైన విజయాలను అందుకొని ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సునీత వ్యక్తిగత విషయంలో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందని చెప్పాలి.ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి వదిలేయడంతో తన పిల్లలతో కలిసి ఒంటరి జీవితాన్ని గడుపుతూ జీవితంలో ముందుకు కొనసాగుతోంది. ఇలా జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న ఈమె రెండవ వివాహం చేసుకొని ప్రస్తుతం తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న తన జీవితంలో ఒకానొక సమయంలో పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని ఆ సమయంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు తనని ఓదార్చి తనలో ధైర్యాన్ని నింపారని ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం గారిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.
ఆరోజు ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే తాను ముందుకు కొనసాగానని ఈ సందర్భంగా సునీత తెలిపారు.ఇక రెండవ పెళ్లి గురించి కూడా ఈమె ప్రస్తావిస్తూ ఎవరి జీవితం వారిది వారికి నచ్చినట్టు వారి జీవితాన్ని అనుభవిస్తారు. ఇతరుల వ్యక్తిగత జీవితాలలోకి తొంగి చూసి వారిని విమర్శించే హక్కు ఎవరికీ లేదని ఎలాంటి పని పాట లేని వాళ్లే ఇలాంటి పనులు చేస్తారంటూ తన గురించి ట్రోల్ చేసిన వారికి తనదైన స్టైల్ లో గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఈ విధంగా సునీత చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…