Star Actress: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీల గురించి ఏదో ఒక విషయం గురించి తరచూ వార్తలలో నిలబడమే కాకుండా పెద్ద ఎత్తున నేటిజన్ల నుంచి ఎన్నో రకాల ట్రోలింగ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్ది రోజుల నుంచి బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తుంది. ఇలా ఒక వైపు సినిమాలను బాయ్ కాట్ చేయడమే కాకుండా మరోవైపు నెపోటిజంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఓ విషయం గురించి ఇప్పుడు చర్చలు మొదలవడమే కాకుండా ఈ విషయం గురించి పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2020 జనవరి ఢిల్లీలోని జేఎన్యూ యూనివర్శిటీలో కొందరు విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులపై కొందరు వ్యక్తులు మాస్క్ వేసుకొని దాడి చేయగా ఈ దాడిలో 50 మంది వరకు గాయపడ్డారు.
ఈ దాడి విషయంపై యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో వీరిని బాలీవుడ్ నటి దీపికా పదుకొనే పరామర్శించారు. ఈ విధంగా నటి విద్యార్థులను పరామర్శించడానికి జేఎన్యూకి వెళ్ళగా అప్పట్లో ఈ విషయం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. అదేవిధంగా కేవలం రెండు నిమిషాల పాటు యూనివర్సిటీలో ఉండడానికి కూడా సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు డబ్బు తీసుకుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.
ఈ క్రమంలోనే ఈ విషయంపై తాజాగా నటి స్వరా భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రెండు నిమిషాల పాటు తాను యూనివర్సిటీలో ఉన్నందుకు ఐదు కోట్లు ఇచ్చారా అసలు సినిమా వాళ్ళంటే ఎలా కనపడుతున్నారు ఇంత చులకనగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటూ నటి స్వరా భాస్కర్ నెటిజన్ల పై మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…