Tag Archives: andhra pradesh

కాకినాడలో దారుణం.. లాడ్జిలో వివాహిత దారుణ హత్య..

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం జరిగింది. కాకినాడ లాడ్జిలో వివాహిత అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. భర్త చేతిలో భార్య హత్యకు గురయింది. విషయం తెలుసుకున్న లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఈమెది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం కాకిపాడుకు చెందిన గుంపుల సుధారాణి (19)గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో సుధారాణి ఫస్టియర్ డిప్లమో ఇన్ అనస్తీషియా చదువుతుంది. కొన్నాళ్ల క్రితం పశ్చిమగోదారి జిల్లా పెదపాడు మండల యాళ్లగూడెంకు చెందిన 21 ఏళ్ల గంగరాజుతో పరిచయం ఏర్పరచుకుంది. తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది.

కొన్నాళ్లు ఇలా ఒకరికొకరు ఫోన్లో మాట్లాడుకుంటూ.. ప్రేమించుకున్నారు. తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో 10 నెలల క్రితం వీళ్లిద్దరికి ప్రేమ వివాహం జరిగింది. ఆమె హాస్టల్లో ఉంటూ కాలేజీకి వెళ్తుంది. అయితే ఓ రోజు కాకినాడ ద్వారకా లాడ్జిలో ఇద్దరూ దిగారు. వీరిద్దరి మధ్య నిన్న విపరీతంగా గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇది ఘర్షణకు దారితీయడంతో రాజుకు విపరీతంగా కోపం వచ్చింది.

అతడు క్షణికావేశంలో కత్తి తీసుకొని సుధారాణిని విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత రాజు ఏలూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు ఏంటనే కోణంలో వాచరణ చేపడతామని పోలీసులు తెలిపారు.

భార్యాభర్తల మధ్య గొడవలో తల దూర్చాడు.. పాపం చివరకు ఇలా అయ్యింది..

మనం చిన్నతనం నుంచి పెద్దలు ఓ మాట చెబుతూ ఉంటారు.. అదేంటంటే.. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి తలదూర్చకూడదని.. అలా చేస్తే.. చివరకు నష్టపోయేది మూడో వ్యక్తే. కానీ ఇక్కడ అతడికి ఈ విషయం తెలుసో.. లేక తెలిసే వాళ్లిద్దరి గొడవ మధ్యలో తల దూర్చాడో తెలియదు కానీ.. పాపం ప్రాణాలను కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

గుంటూరు జిల్లాలోని మంగళదాస్‌నగర్‌ లో 2వ లైను చెందిన గోగులపాటి బెన్ని తన భార్యను తాగి వచ్చి ఎప్పుడూ వేధిస్తుండేవాడు. తాగి వచ్చి తన భార్యను విపరీతంగా.. ఎక్కడ పడితే అక్కడ కొడుతుంటాడు. ఇలా ఓ రోజు తాగుడు బంద్ చేయండంటూ తన భార్య నిలదీసింది. దీంతో తీవ్రంగా కోపం తెచ్చుకున్న అతడు ఆమెను ఇంకా ఎక్కువగా కొట్టడం మొదలు పెట్టాడు.

ఆ గొడవ అతి పెద్దదిగా తయారైంది. దీంతో ఆ గొడవను సరిదిద్దేందుకు ఇంటి పక్కనే ఉన్న శ్యాంసన, పక్కనే ఉన్న ఏచూరి సత్యనారాయణ(48)లు అక్కడకు వెళ్లారు. బెన్నీకి ఒక కుమారుడు జాన ఉన్నాడు. ఈ గొడవ జరుగుతుండగా అతడు అక్కడే ఉండి చూస్తున్నాడు. దీంతో గొడవ మధ్యలోకి వచ్చిన వాళ్లిద్దరిని అతడు తీవ్రంగా దూషించాడు. మా కుంటుం గొడవలోకి మీరెందుకు వచ్చారంటూ.. వాళ్లను తిట్టాడు. తల్లిదండ్రులు కొట్టుకుంటుంటే.. బొమ్మలా నిలబడి చూస్తున్నావా అంటూ వాళ్లు అతడిని నిలదీశారు.

దీంతో అతడికి కోపం వచ్చింది. ఇంట్లోకి వెళ్లి.. కత్తి పట్టుకొని వచ్చి క్షణికావేశంలో సత్యనారాయణను అతికిరాతంగా పొడిచాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడు అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని జానను అదుపులోకి తీసుకున్నారు.

మోసం చేసి పెళ్లి చేశారు.. ఏడాది తర్వాత ఆమె జీవితం ఆగమ్యగోచరంగా మారింది..!

ఆమెకు చెప్పకూడని అబద్దాలు చెప్పి పెళ్లి చేశారు. వివాహం జరిగి ఏడాది పూర్తయింది. తర్వాత అనారోగ్యంతో భర్త మృతిచెందాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన ఊహా రెడ్డి అనే యువతికి నెల్లూరు నగరంలోని ధనలక్ష్మిపురంకు చెందిన విజయేంద్ర రెడ్డితో కొంతకాలం వివాహం జరిగింది.

తర్వాత అతడికి రెండు కిడ్నీలు చెడిపోయానని వైద్యులు తెలిపారు. ఈ విషయం అతడి తల్లిదండ్రులు ముందుగానే తెలుసు. కానీ ఆమెకు ఈ విషయం చెప్పలేదు. అయినప్పటికీ భర్తను ప్రేమగా చూసుకుంటూ ఉంది ఆ మహిళ. ఇదే కాకుండా కొన్నాళ్లకు అతడికి మళ్లీ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కాలు, చేయి చచ్చుబడిపోయాయి.

ఇలా మానసికంగా, శారీరకంగా ఎంత కాలం బాధపడుతూ.. కుటుంసభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశ్యంతో అతడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ మహిళ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఆమె అప్పటికే గర్భవతిగా ఉంది. ఓ రోజు తన అత్తమామల ఇంటికి తన ఆరు నెలల కొడుకుతో బయలుదేరి వెళ్లింది. కానీ వాళ్లు ఆ ఇంటికి స్వాగతించలేదు. ఇంటికి వచ్చిన ఆమెపై రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. దెబ్బలు తగిలి రక్తం కారుతున్నా ఊహమాత్రం అక్కడే బైఠాయించింది.

గతంలోనూ ఇదేవిధంగా జరిగితే పోలీసులను ఆశ్రయించిన ఊహారెడ్డికి నిరాశే ఎదురైంది. అబద్ధం చెప్పి తన జీవితాన్ని నాశనం చేయడంతో పాటు ఇప్పుడు తనకు, తన పాపకు అన్యాయం చేస్తున్నారని ఊహ వాపోతోంది. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటుంది.

నవ వధువు కిడ్నాప్.. టీడీపీ నేతపై ఆరోపణలు.. ఏం జరిగిందంటే..!

ఆ రోజే వారిద్దరికి పెళ్లైంది. అత్తగారింట్లో అడుగుపెట్టిన ఆ నవవధువు ఆరోజు రాత్రే కిడ్నాప్ కు గురైంది. ఎక్కడ జరిగింది.. ఏం జరిగిందో తెలియాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా విడవలూరుకు చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కత్తి ఉమామహేశ్వరి.. అన్నారెడ్డిపాళెం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నలబాయి హరి గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఇంట్లో వారి ప్రేమ విషయం చెప్పగా.. కత్తి ఉమామహేశ్వరి ఇంట్లో ఒప్పుకోలేదని సమాచారం. అయితే ఓ రోజు రాత్రి పక్కనే ఉన్న పెంచలకోనలోకి వెళ్లి వాళ్లు పెళ్లి చేసుకున్నారు. తర్వాత హరి ఇంటికి తన భార్యను తీసుకొని వచ్చాడు. అదే రోజు రాత్రి వధువు ఊరు అయిన విడవలూరుకు చెందిన టీడీపీ నేత సత్యవోలు సత్యంరెడ్డి హరి ఇంటికి వచ్చాడు.

దాదాపు 30 మందిని వెంట పెట్టుకొని ఆటోలో వచ్చారు. రాగానే అతడు హరి ఇంట్లోకి వెళ్లి ఉమాపహేశ్వరిని తీసుకొని భయటకు వచ్చాడు. ఆమెను బలవంతగా తీసుకొని వెళ్తుంటే.. హరి అడ్డుకున్నాడు. అతడిని కులం పేరుతో దూషించి.. పక్కకు నెట్టాడు. ఆమెను తీసుకొని బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లారు. దీంతో హరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నలబాయి హరి ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వధువు తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో.. వాళ్లు టీడీపీ నాయకుడిని కలిసి.. సహాయం కోరినట్లుగా సమాచారం. దీంతో అతడు ఆ వధువును కిడ్నాప్ చేశాడు. కానీ ఆమెను ఇంటికి మాత్రం తీసుకురాలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. వధువు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

75 ఏళ్ల వయస్సులో కూడా ఎన్నో పతకాలు.. ఇంతకు అతడి రహస్యం ఏంటి..?

‘ముసలోడే కానీ మహానుభావుడు’ అనే డైలాగ్ ను సినిమాలో బ్రహ్మానందం చెబుతారు. నిజ జీవితంలో ఆ డైలాగ్ కు అచ్చం అచ్చగుద్దినట్లు సరిపోతాడు ఈ 75 ఏళ్ల వృద్ధుడు. ఇంతకు అతడి గొప్పతనం ఏంటంటే.. 20 ఏళ్ల వయస్సు ఉన్న వాళ్లే ఒక కిలోమీటరు దూరం పరుగెత్తడానికి నానా తంటాలు పడుతుంటారు. అలాంటిది అతడు 75 ఏళ్ల వయస్సులో కూడా ఎన్ని కిలో మీటర్లు అయినా అవలీలగా పరుగెత్తి నేటి తరానికి తాను ఏ మాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నాడు ఈ విశాఖకి చెందిన ఈ పెద్దాయన.

ప్రహ్లాదపురం దరి విరాట్‌నగర్‌ ప్రాంతానికి చెందిన తాళాబత్తుల వెంకటరమణ(75) పరుగులో తన మార్క్ ను చూపిస్తున్నారు. అతడు పరుగులో చూపించిన ప్రతిభకు యవకులు ఎంతో ఆశ్చర్యపోతున్నారు.
అతడు ఐదేళ్ల వయస్సులోనే పరుగు పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలను సొంతం చేసుకున్నాడు. ఉదయం వ్యాయామం, నడక, ధ్యానం చేస్తుంటాడు. దీంతో రోజంతా ఉల్లాసంగా ఉండటమే కాకుండా.. ఏ పని చేయాలన్నా అలసట రాదని అతడు చెబుతున్నాడు.

అతడు పరుగుల వీరుడే కాదు.. నాటకాల్లో కూడా నటించే ధీరుడు కూడా. వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే పలు నాటకాల్లో అతడు ప్రదర్శించి మెప్పించాడు. ప్రస్తుతం కరోనా కారణంగా అవి జరగడం లేదని.. మళ్లీ మొదలైతే అందులో కూడా పాల్గొంటానని చెబుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన అథ్లెటిక్స్‌లో పాల్గొని ఎన్నో పతకాలను కైవసం చేసుకున్నాడు.

75 ఏళ్ల వయస్సు వచ్చినా అతడిలో ఉత్సాహం తగ్గలేదు. అంతేకాకుండా అతడిని చూసి చాలా మంది స్పూర్తిగా తీసుకుంటున్నారు. ఎన్ని పనులు ఉన్నా వ్యాయామం చేయడం అనేది మనిషికి ఎంతో అవసరం అని అతడు చెబుతున్నారు. రోగాలు దరిచేరకుండా ఉండటమే కాదు.. చేసే పనిలో కూడా ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొన్నాడు. మంచి అలవాట్లతో జీవిస్తే నిత్యం ఉల్లాసంగా ఉండవచ్చని చెప్పారు. అతడు కేవలం శాఖాహారం మాత్రమే తీసుకుంటానన్నాడు.

వింత ఆచారం…తేళ్లతో దేవునికి పూజలు..ఎక్కడంటే..?

కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలు, నమ్మకాలు ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. టెక్నాలజీ ఎంత దూసుకుపోతున్నా కొన్ని ప్రాంతాల వారు మాత్రం మూఢనమ్మకాలను నమ్ముతూ వాటినే ఆచరిస్తుంటారు. అయితే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే.. పాములను, తేళ్లను చూస్తే వాటికి దూరంగా పోని మనిషి అంటూ ఉండడు.

ఎందుకంటే వాటికి విషం ఉంటుంది కాబట్టి. మహిళలు అయితే బొద్దింకలు, జెర్రులను చూసినా కేకలు వేస్తూ కంగారు పడిపోతుంటారు. ఇక తేళ్లను చూస్తే.. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఉండరు. కానీ ఇక్కడ ఆచారంలో భాగంగా..తమ దేవుడిని దర్శించుకోవాలంటే తేళ్లను తీసుకెళ్లి దర్శించుకుంటారు. అందేంటి అనుకుంటున్నారా.. అయితే వివరంగా తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కోడుమూరులో తేళ్లను పట్టుకుంటూ పండగ జరుపుకుంటారు. తేళ్లనే చేతితో పట్టుకొని దేవుడికి హారంగా వేసి పూజిస్తారు. అవి అక్కడ ఉన్న వారికి ఎలాంటి హానీ చేయవంట. ఒకవేళ ఆ తేళ్లు కుట్టినా కూడా.. గుడి చుట్టు మూడు ప్రదక్షిణలు చేస్తే నొప్పి కూడా ఉండదని అక్కడ ప్రజల నమ్మకం. శ్రావణమాసం మూడో సోమవారం ఇక్కడ కొండలరాయుడి స్వామి శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా భక్తులు కొలుస్తారు.

ఆకొండపై ఉన్న ఏ రాయిని కదిపినా తేళ్లే కనిపిస్తాయి. అక్కడ తేళ్లను పట్టుకొని దేవుడిని పూజిస్తారు. వాటిని పట్టుకొని విచిత్రమైన విన్యాసాలు చేసినా ఏమి కాదనేది వారి నమ్మకం. కానీ ఇదంతా మూఢ నమ్మకమని.. వాటి వల్ల ప్రమాదం ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ ఆచారం కాస్త విచిత్రంగా ఉంది కదు..

టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తాడా.. వస్తే వాళ్లు రానిస్తారా..?

సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు అతడి అల్లుడు నారాచంద్రబాబు నాయుడు లీడ్ చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వ్యక్తి ఎన్టీఆర్ కావడం విశేషం. అయితే ఇలా సినిమా ఇండస్ట్రీలో సినీ నటులకు రాజకీయాలకు చాలా దగ్గరి సంబంధం ఉంటుందనే చెప్పాలి. ఎప్పుడో ఒక సందర్భంలో సెలబ్రిటీలు అటువైపు అడుగులు వేయకుండా ఉండలేరు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సెలబ్రెటీలు కూడా ఏదో ఒక సందర్భంలో రాజకీయాల్లోకి వెళ్లక తప్పదు.

ఇదివరకు జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగు దేశం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ ముఖ్యమైన పట్టణాల్లో అతడు పార్టీ గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన సంగతి కూడా తెలిసిందే. ఆ సమయంలోనే ఖమ్మం జిల్లా దగ్గర రోడ్డు యాక్సిడెంట్ కావడంతో చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ ను కేవలం ప్రచారం కోసమే వాడుకోవడం అభిమానులకు నచ్చలేదు. ప్రస్తుతం ఏపీ మరియు తెలంగాణలో టీడీపీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో అయితే టీడీపీ మొత్తం కనుమరుగైపోయిందనే చెప్పాలి.

ఇలాంటి కష్ట సమయంలో పార్టీని ఆదుకునే నాయకుడు కావాలని ఓ వర్గం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ ఒక్కరే ఇప్పుడు పార్టీని కాపాడగలడనే ఆశాభావం అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కానీ పార్టీ క్యాడర్ లో చాలా మంది అందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లో ఇప్పుడే వెళ్లే పరిస్థితి లేదని ఓ ఇంటర్వ్యూలో కూడా అన్నాడు.

పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటానని మాత్రం చెప్పలేదు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో పాన్ ఇండియా లెవల్ లోకి అతడి మార్కెట్ వెళ్తోంది. ఇటువంటి సమయంలో అటు వైపు ఆలోచించడం కరెక్ట్ కాదని ఆలోచిస్తున్నాడట. ఒకవేళ టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ లీడ్ చేస్తే మాత్రం పెను మార్పులు సంభవించే అవకాశం ఉందని అతడి అభిమానులు అంటున్నారు.

చేపల చెరువులో బయటపడ్డ పురాతన విగ్రహాలు.. ఎక్కడంటే..

అప్పుడప్పడు మనం వార్తల్లో వింటూ ఉంటాం.. ఆ ఊరిలో పొలాలు దున్నుతుండగా.. ఇంటికి పునాదులు తవ్వుతుండగా.. మైనింగ్ చేస్తున్నప్పుడు పురాతన విగ్రహాలు , సంపద బయటపడుతుంటాయని. వీటిలో ఎక్కువగా దేవతల విగ్రహాలే బయటపడుతుంటాయి. కానీ ఓ చేపల చెరువులో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి.

దీంతో జనాలు ఆశ్చర్యపోయారు. ఇలాంటి వాటి కోసం కొందరు ఆలయాల్లోనూ, చారిత్రక ప్రదేశాల్లోనూ తవ్వకాలు జరుపుతుంటారు. అలా కాకుండా ఓ చేపల చెరువులో పురాతన విగ్రహాలు బయటపడటంతో జనం ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు విష్ణుమూర్తి, శివలింగం ఒకేచోట లభ్యం కావడంతో అద్భుతమంటున్నారు. ఈ అరుదైన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా, పాకాల మండలం పెదగోల్పాడు గ్రామంలోని బావి రాగన్న చెరువులో చేపల కోసం మోటర్ తో నీటిని తోడుతుండగా విగ్రహాలు కనిపించాయి.

ఒకే చోట ఇలా విష్ణుమూర్తి, శివలింగం విగ్రహాలు బయటపడ్డాయి. దీంతో స్థానికులు కాస్త ఆశ్చర్యానికి లోనయ్యారు. తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇవి బంగారంతో చేసిన విగ్రహాలు కాదు.. కంచుతో చేసినవి. మూడు అడుగుల విఘ్ణమూర్తి, శివలింగాన్ని సమీపంలోని ఆలయానికి తరలించారు.

విగ్రహాలు స్వతహాగా చెరువులో బయటపడ్డాయా లేక ఎవరైనా దొంగిలించి చెరువులో పడేశారా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ మండల ఎమ్మార్వో సమక్షంలో వివరాలను నమోదు చేశారు పోలీసులు. అనంతరం పరావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించి.. విగ్రహాలను ట్రెజరీకి తరలించారు.

మద్యం తాగి.. నడిరోడ్డుపై తన్నుకున్న మహిళలు..

‘మందు బాబులం.. మేము మందుబాబులం మందు కొడితే.. మాకు మేమే మహారాజులం’ అని సినిమాలో పాట లాగానే ఇక్కడ మందు కొట్టి నానా హంగామా చేశారు మహిళలు. హహారాజులం కాకుండా హహారాణులం అన్నట్లు వ్యవహరించారు. మందు తాగి రొడ్డుపైకి వచ్చి ఒకరినొకరు తిట్టుకొని.. కొట్టుకొని పిచ్చి పిచ్చిగా వ్యవహరించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. మందు నోట్లోకి వెళ్తే ఎవరైనా సరే ఎదుటి వాళ్లకు చుక్కులు చూపిస్తుంటారు.

సాధారణంగా పురుషులు ఇలా మందేసి చిందులు వేసిన ఘటనలు ఉన్నాయి కానీ.. మహిళలు మద్యం తాగడం ఈ మధ్య కామనే అయినా.. పెద్దగా వివాదాలు, గొడవలు జరగవు. సాఫ్ట్ వేర్, కొన్ని కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే యువతులు, పేజ్-3 వర్గానికి చెందిన వారు తాగడం చూస్తుంటాం.

కానీ మందేసిన మహిళలు రోడ్డుపై గొడవపడటం, తన్నుకోవడం చాలా అరుదైన దృశ్యమనే చెప్పాలి. అలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి సోమసుందరపాలెం సమీపంలో జరిగింది. ఇద్దరు మహిళలు మద్యం సేవించి ఒకరిపైఒకరు దాడి చేసుకున్నారు. వీరిద్దరు మంచి స్నేహితులు. అందులో ఒకరిది మూల్పూరు గ్రామం.. మరొకరిది తెనాలికి చెందినవారు.

ఇద్దరు సరదాకా మద్యం సేవించి ఇంటికి వెళ్తుండగా.. మాటా మాటా పెరిగి గొడవ పెద్దది అయింది. ఇందులో మూల్పూరుకు చెందిన మహిళ బలంగా కొట్టడంతో తెనాలికి చెందిన మహిళ కుప్పకూలిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానికులు 108 కి కాల్ చేశారు. గాయపడిని మహిళలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బీటెక్ స్టూడెంట్ హత్య కేసులో మరో మలుపు.. విచారణలో సంచలన విషయాలు..!

బీటెక్ స్టూడెంట్ రమ్య హత్య కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. సీసీటీవీ ఫుటేజీ లో రమ్యను హత్య చేసే వీడియో ఇప్పటికే వైరల్ కాగా.. తాజాగా ఆ నిందితుడు ఆమెను చంపేందుకు పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. హత్యకు ముందు రోజు అతడు రెక్కీ నిర్వహించి.. పకడ్బందీగా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. విచారణలో పోలీసులు అతడిని ఆ కోణంలో విచారణ చేపడుతున్నారు. ఏ విధంగా అమలు చేశాడు అనేదానిపై ప్రశ్నించగా కీలక అంశాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. రమ్య అతడికి 2021, జనవరిలో ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయమైందని.. తర్వాత ఇష్టాఇష్టాలు పంచుకున్నారు.

కొన్నిరోజుల తర్వాత ఆమెకు అతడు ప్రపోజ్ చేశాడు. తనను ప్రేమించాలని కోరినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. దీంతో రమ్య అతడి ప్రపోజల్ తిరస్కరించింది. నిందితుడు శశికృష్ణ వేధింపులు ఎక్కువకావడంతో అతడి ఇన్ స్టాగ్రామ్ తో పాటు ఫోన్ నంబర్లను కూడా ఆమె బ్లాక్ చేసింది. దీంతో శశికృష్ణ.. రమ్య స్వగ్రామానికి వెళ్లి మరీ ఆమెను ఇబ్బందులకు గురిచేశాడు.

హత్యకు పన్నాంగం ఎలా పన్నాడంటే.. తనను ప్రేమించకపోవడంతో శశికృష్ణ ఆమెపై కక్ష కట్టాడు. ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. రమ్య కాలేజీకి వస్తుందా.. రావడం లేదా అనేది తెలుసుకున్నాడు. ఈ నెల 14న బుడంపాడులో రెక్కీ నిర్వహించి.. తన ఫ్రెండ్ తో కలిసి బైక్ పై కాలేజీ వద్దకు వెళ్లాడు. అక్కడ ఆమె శశికృష్ణను చూసి కాలేజీలోకి పరుగు పెట్టింది. ఆ రోజే అతడు సాయంత్రం మరోసారి కాలేజీకి వెళ్లాడు. ఐతే అప్పటికే రమ్య ఇంటికి వెళ్లిపోవడంతో తన ఫ్రెండ్ దగ్గర కత్తితీసుకోని ఇంటికి వెళ్లిపోయాడు. ఈ రాత్రంతా ఆమెను చంపాలనే ఆలోచనతోనే ఉన్నాడు.

మరునాడు ఉదయం కాకాని రోడ్డులో రమ్య కోసం మాటు వేశాడు. అదే సమయంలో టిఫిన్ తీసుకెళ్లేందుకు వచ్చిన రమ్యతో వాగ్వాదానికి దిగాడు. తనను ప్రేమించమంటూ.. ఇబ్బంది పెట్టాడు. ఆమె ఫోన్ కూడా లాక్కున్నాడు. టిఫిన్ ఇంట్లో ఇచ్చి ఫోన్ కోసం వచ్చిన రమ్యను బైక్ ఎక్కాలని బలవంతం చేశాడు. ఈ సమయంలోనే అతడి దగ్గర ఉన్న ఫోన్ లాక్కొని ఇంటికి వెళ్తున్న రమ్యను అడ్డగించి కత్తితో పొడిచి హత్య చేశాడు. హత్య చేసిన వెంటనే నిందితుడు అక్కడ నుంచి పారిపోయి పొలాల్లో దాక్కున్నాడు. అతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులను కూడా అతడు బెదిరించాడు. దగ్గరకు వస్తే కత్తితో చేతిపై కోసుకుంటానని.. గాట్లు కూడా పెట్టుకున్నాడు. ఎట్టకేలకు పోలీసులు అతడిని పట్టుకొని అరెస్టు చేశారు.