Tag Archives: Arrest

Shanmukh Jaswanth: షణ్ముఖ్ అరెస్టుపై స్పందించిన రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్ సిరి హనుమంత్.. అస్సలుహించలేదంటూ?

Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ పరిచయం అవసరం లేని పేరు అయితే ఇటీవల ఈయన గంజాయిని సేవిస్తూ ఉండటంతో పోలీసులు తనని అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే. తన ఇంట్లోనే ఈయన గంజాయి సేవిస్తూ పోలీసులకు దొరికిపోయారు అంతేకాకుండా ఇతను దగ్గర నుంచి మరికొంత మొత్తంలో గంజాయిని పోలీసులు సేకరించారు.

ఈ విధంగా షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడటంతో ఆయన డిప్రెషన్ కారణంగానే తాను గంజాయి తీసుకున్నానని ఆత్మహత్య కూడా చేసుకోవాలని భావించాను అంటూ కారణాలను కూడా తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఈయన బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ విధంగా షణ్ముఖ్ గంజాయి తీసుకోవడానికి కారణం దీప్తి సునయనతో తనకు బ్రేకప్ అవ్వడమేనని, బ్రేకప్ కారణంగా ఆయన డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే షణ్ముఖ్ అరెస్ట్ కావడం గురించి తన రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్ సిరి హనుమంత్ స్పందించారు. వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో చాలా చనువుగా ఉండడంతోనే దీప్తి సునయన తనకు బ్రేకప్ చెప్పింది అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి అయితే బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరూ కలిసి కనిపించిన సందర్భాలు లేవు అలాగే కెరియర్ పరంగా ఎవరికి వారు బిజీ అయ్యారు.

తనని కలవడం కరెక్ట్ కాదు…

ఇకపోతే తాజాగా సిరి షణ్ముఖ్ అరెస్టు గురించి స్పందిస్తూ.. అతని పర్సనల్ లైఫ్ ఇలా అవుతుందని నేను అసలు ఊహించలేదని ఈమె తెలిపారు. ఇక తనని కలవక పోవడానికి కారణం లేదని తనకు బ్రేకప్ అయిన తర్వాత తిరిగి తనతో కలవడం కరెక్ట్ కాదనిపించి తనకు దూరంగా ఉన్నాను అంటూ ఈ సందర్భంగా సిరి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Pallavi prashanth: మొదటిసారి అరెస్టుపై స్పందించిన పల్లవి ప్రశాంత్.. చచ్చిపోవాలనిపించింది అంటూ కామెంట్స్?

Pallavi prashanth: పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా బిగ్ బాస్ కార్యక్రమంలో అందరికీ పరిచయమయ్యారు. అంతకుముందు యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉన్నటువంటి ప్రశాంత్ బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంట్రీ ఇచ్చినటువంటి ఈయన కప్పు గెలుచుకొని సెలబ్రిటీ అయ్యారు.

ఇక హౌస్ లో ఉన్నప్పుడు ఈయనకు అమర్ తో జరిగిన గొడవ కారణంగా గ్రాండ్ ఫినాలే రోజు ఈయన అభిమానులు అమర్ కారు పై దాడి చేశారు. ఈ దాడిలో భాగంగా పలువురు సెలబ్రిటీల కార్లు ధ్వంసం కావడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వం కావడంతో పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఇలా రెండు రోజులపాటు జైలులో ఉన్నటువంటి ప్రశాంత్ అనంతరం బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇలా విడుదలైనటువంటి ఈయన పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే బిబి ఉత్సవ్ కార్యక్రమంలో కూడా పల్లవి ప్రశాంత్ పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మొదటిసారి తన అరెస్టు గురించి స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.

నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్న…

నేను బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని ఎలాగైనా కప్పు గెలుచుకుని తన తండ్రి కళ్ళల్లో ఆనందం చూడాలని అనుకున్నాను కానీ జైలుకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. అయితే నేను జైలులో ఉన్నప్పుడు నాన్న కోర్టు దగ్గర పడుకున్న వీడియోలు చూసి ఆ క్షణం నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానా అనిపించింది అంటూ ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Bigg Boss: పల్లవి ప్రశాంత్ అరెస్ట్… షాకింగ్ డెసిషన్ తీసుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు?

Bigg Boss : బుల్లితెర రియాలిటీ షోగా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి. ఈ షో అన్ని భాషల్లో ప్రసారమవుతున్న సంగతి తెలిసినదే. ఇక ఈ షో తెలుగులో 7 సీజన్లను పూర్తి చేసుకుంది. ఏడవ సీజన్లో భాగంగా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందే.

ఇక ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేరోజు పెద్ద ఎత్తున పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్ అభిమానుల మధ్య గొడవ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.ఈ గొడవలో భాగంగా పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్ ఫ్యామిలీతో ప్రయాణిస్తున్నటువంటి కారుపై రాళ్ల దాడి చేశారు. దీంతో ఇది కాస్త పెద్ద ఎత్తున వివాదంగా మారింది. ఇలా ఈ విషయం వివాదంగా మారటమే కాకుండా పల్లవి ప్రశాంత్ జైలుకు కూడా వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చారు.

ఇక ఈ అల్లర్లకు పాల్పడినటువంటి వారిని సిసి కెమెరాలు ఆధారంగా పోలీసులు గుర్తించి వారిపై కేసులను నమోదు చేస్తున్నారు. ఇలా ఈ సీజన్ ఈ స్థాయిలో గొడవలకు కారణం కావడంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఈ కార్యక్రమం పట్ల షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొని కంటెస్టెంట్లు బయటకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున ర్యాలీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ర్యాలీలు నిర్వహించకూడదు…

ఇలా ఇకపై ర్యాలీలు చేయకుండా వారిని కంటెస్టెంట్లుగా ఎంపిక చేసుకునే సమయంలోనే అగ్రిమెంట్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో పరిసర ప్రాంతాలలో ఎవరు కూడా ర్యాలీ చేయకూడదని వారు హౌస్ లోకి వచ్చేటప్పుడు ఎలా గుట్టు చప్పుడు కాకుండా వస్తారో బయటకు వెళ్లేటప్పుడు కూడా అలాగే వెళ్లాలి అంటూ నిబంధనలను పెట్టబోతున్నారని తెలుస్తోంది.

Anchor Rashmi: ఆ నేరం కింద రశ్మిని అరెస్టు చేయాలి… దారుణమైన కామెంట్లు చేసిన నేటిజన్.. యాంకరమ్మ రియాక్షన్ ఇదే!

Anchor Rashmi: అంబర్ పేట్ వీధి కుక్కల ఘటన జరిగినప్పటి నుంచి యాంకర్ రష్మీ పెద్ద ఎత్తున నెటిజన్ల ట్రోలింగ్ కి గురవుతున్నారు. ఇలా ఈమె ఈ విషయంలో చిన్నారి ప్రదీప్ కు మద్దతు తెలుపకుండా కుక్కలకు సరైన వసతులు కల్పిస్తే ఇలాంటి సంఘటనలు జరగవు కదా అంటూ వీరి కుక్కలపై తనకు ఉన్నటువంటి ప్రేమను మరొకసారి తెలియజేశారు.

రష్మీ ఈ విధంగా స్పందించడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నేటిజన్స్ రష్మీ పై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. గతంలో కొందరు ఇలాంటి వారిపై యాసిడ్లు పోయాలి దాడులు చేయాలి అంటూ రెచ్చిపోయారు. అలాగే మరికొందరు రష్మిని కుక్కను కొట్టినట్లు కొట్టాలి అంటూ కామెంట్లు చేశారు. ఇలా తన గురించి వస్తున్నటువంటి కామెంట్లపై స్పందిస్తూ తిప్పి కొడుతున్నటువంటి రష్మీకి తాజాగా మరొక నేటిజన్ షాక్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఈ విషయంపై ఒక నెటిజెన్స్ స్పందిస్తూ వీధి కుక్కలు ఇలాగ రెచ్చిపోయి మనుషుల ప్రాణాలు తీయడానికి గల కారణం వాటికి ఆహారం పెడుతూ వాటి సంతతిని ప్రోత్సహించడమే కారణమని తెలిపారు.
ఇలా వీధి కుక్కల సంతతిని పెంచుతూ వాటికి ఆహారం పెడుతున్నటువంటి యాంకర్ రష్మీ వంటి వారిని ఈ నేరం కింద అరెస్టు చేయించాలి అంటూ కామెంట్ చేశారు.

Anchor Rashmi: అది అంత ఈజీ కాదు..

ఇక ఈ కామెంట్ పై రష్మీ స్పందిస్తూ తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు. ఈ విషయంపై స్పందించిన రష్మి అది అంత ఈజీ కాదు నీకు చేతనైంది చేసుకోపో అంటూ బదులిచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా కొందరి జంతు ప్రేమికులు కుక్కలకు మద్దతు తెలుపగా మరికొందరు చిన్నారి కుటుంబానికి మద్దతు తెలుపుతూ ఈ ఘటనపై కామెంట్లు చేస్తున్నారు.

వివాహిత స్నానం చేస్తుండా వీడియో తీశాడు.. ఆ వీడియోని అడ్డుపెట్టుకుని ఏం చేశారంటే?

చట్టాలు ఎన్ని చేసినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాల వార్తలే వినిపిస్తున్నాయి. ఇంటి నుంచి మహిళ బయట అడుగుపెట్టిందంటే.. తిరిగి ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేకుండా పోతోంది. ఏం జరిగి ఉంటుందో అన్న ఆందోళనలో తల్లిదండ్రులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇటీవల మైనర్ బాలికపై అత్యాచారాలు బాగా పెరిగిపోయాయి. అమ్మాయి అయితే చాలు ఎలాంటి వాయి వరుసలు గుర్తుకురావు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళకు బయటనే కాదు ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోయింది. ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా.. వారి రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటువంటిదే మరో ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం పట్టణంలోని ప్రశాంత్ నగర్ లో ఓ వివాహిత నివాసం ఉంటుంది.

ఆమెపై ఇద్దరు అన్నాదమ్ముళ్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. దీనిపై ఖమ్మంలోని ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆమె స్నానం చేస్తుండగా.. ప్రవీణ్ అనే యువకుడు ఆమె ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటితో ఆమెను బెదిరించాడు.

తన కామ కోరిక తీర్చాలని ఆమెను లొంగదీసుకున్నాడు. ప్రవీణ్ సోదరుడు గిరిదర్ కూడా ఆమెను ఇలానే బెదిరించడం మొదలుపెట్టాడు. వాళ్లు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఆమె తనపై వారిద్దరు లైంగిక దాడి చేసి.. వేధింపులకు గురిచేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వాళ్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

ప్రేమించి.. మోసం చేసిన వ్యక్తి అరెస్టు.. అరెస్టైన వ్యక్తి కార్పొరేటర్ భర్త కావడంతో..

ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనం స్పష్టించిన కేసులో అత్యాచార నిందితుడు కార్పొరేటర్ భర్త ఆకుతోట శిరీశ్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. దీనిలో శిరీష్ తో పాటు అతడి తండ్రి సుధాకర్‌ను కూడా మిల్స్ కాలనీ పోలీసులు అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. 2017లో శీరీష్ మరియు బాధిత మహిళ ప్రేమించుకున్నారు.

వివాహం చేసుకుంటానని ఆమె వెంట పడి నమ్మించాడు. అలా వాళ్లు కలిసి ఉన్న సమయంలోనే ఆమె కుటుంబ సభ్యుల పేరిట గల భూమిని విక్రయించగా.. వచ్చిన డబ్బు నుంచి 90లక్షల రూపాయలు శిరీష్ ఖాతాల్లో జమచేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తనను వివాహం చేసుకుంటాడనే నమ్మకంతో పెద్దమొత్తంలో డబ్బును శిరీష్ ఖాతాల్లో వేసినట్టు లావాదేవీల ఆధారాలతో పోలీసులకు వివరించింది.

అయితే శిరీష్ మరో యువతిని పెళ్లి చేసుకుని తనను మోసం చేయడమే కాకుండా…. తన డబ్బులు తిరిగివ్వకుండా తండ్రి సుధాకర్​తో కలిసి బెదిరింపులకు దిగాడని ఆమె తెలిపారు. అందులో భాగంగానే ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై గత నెల 23 న సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న వాళ్లను ఎట్టకేలకు నేడు పట్టుకొని అరెస్టు చేశారు.

అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్త కావడం తండ్రి లిక్కర్‌ వ్యాపారి కావడంతో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు బాధిత యువతితో కూడా రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కానీ ఫలించకపోవడంతో పోలీసులు కచ్చితంగా అతడిని అరెస్టు చేయాల్సి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకనే ఇంత సమయం కూడా తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు పరకాల జైలుకు పంపినట్లు ప్రాథమింగా సమాచారం అందుతోంది. ఆ యువతి ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ భర్త శిరీశ్ పై నమ్మకద్రోహం, మోసం, బెదిరింపు, అత్యాచారం తదితర కేసులను పలు సెక్షన్ల కింద నమెదు చేసి అరెస్టు చేశారు.

సీఎం తండ్రిని అరెస్టు చేసిన పోలీసులు.. ఎందుకంటే..

బ్రాహ్మ‌ణ స‌మాజాన్ని కించ‌ప‌రిచే వ్యాఖ్య‌లు చేసిన‌ ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రి భూపేశ్ బ‌ఘేల్ తండ్రి నంద‌కుమార్ బ‌ఘేల్‌ను ఆ రాష్ట్ర‌ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రాహ్మణుల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఇటీవల ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయడంతో పాటు అతడిని రాయ్‌పూర్ కోర్టులో హాజ‌రు ప‌ర్చ‌గా కోర్టు ఆయ‌నకు 15 రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది.

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం భూపేష్ బాగల్ తండ్రి నంద్ కుమార్ బాగల్ మాట్లాడుతూ.. బ్రాహ్మణులను గ్రామాల్లోకి రానివ్వవద్దని పిలుపునిచ్చారు. బ్రాహ్మణులను మీ ఊళ్లోకి రానివ్వకుండా చూడాలని.. అందరం కలిసి బ్రాహ్మణులను బహిష్కరిద్దామని సీఎం తండ్రి పిలుపునిచ్చారు. గంగా న‌ది నుంచి వాళ్లను ఓల్గా న‌దికి పంపించాలన్నారు.

వాళ్లు విదేశీయులు అంటూ వ్యాఖ్యానించారు. నందకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డీడీ నగర్ పోలీస్ స్టేషన్‌లో సర్వ్ బ్రాహ్మిణ్ సమాజ్ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఒక సీఎం తండ్రిపై కేసు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై ఈ ఘ‌ట‌నపై ఛ‌త్తీస్‌గ‌ఢ్ సీఎం భూపేశ్ బ‌ఘేల్ స్పందించారు.

అతడు మాట్లాడుతూ ఒక కొడుకు అతడిని నేను గౌరవిస్తాను కానీ.. భారతదేశ సిద్దాంతాలకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా.. ఏదైనా పని చేసినా . ప్రజలు మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉంటే..సహించనని అతడు వ్యాఖ్యానించాడు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు.

బెంగాల్లో 200 మంది బీజేపీ నేతలు అరెస్ట్!

కోల్‌కతాలో చెలరేగిన హింసాత్మక ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే అగ్నిమిత్రా పాల్‌తో సహా 200 మంది బిజెపి మహిళా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర కోల్‌కతాలోని సిమ్లా స్ట్రీట్‌లోని స్వామి వివేకానంద పూర్వీకుల ఇంటి ముందు బీజేపీ నేతలు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారింది. దీంతో అరెస్టు చేసిన వారందరినీ కోల్‌కతా పోలీస్ హెడ్ క్వార్టర్స్ సెంట్రల్ లాకప్‌కు తీసుకువెళ్లారు.

కాగా హౌరా జిల్లాలోని బాగ్నాన్‌లో ఇటీవల జరిగిన గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ కి వ్యతిరేకంగా బిజెపితో పాటు విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. దీంతో పోలీసు సిబ్బందికి మరియు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కోవిడ్ ప్రోటోకాల్‌ నిబంధనలను ఉల్లంఘించి, చట్టవిరుద్ధంగా సమావేశమైనందున ఆందోళనకారులను అరెస్టు చేయవలసి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు.