Tag Archives: Ayurvedic medicine

ఈ ఆయుర్వేద చికిత్సలతో.. వర్షాకాల వ్యాధులకు చెక్ పెట్టండిలా!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా రెండవ దశ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతూ మూడవ దశ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం వర్షాకాలం మొదలవడంతో ఎన్నో రకాల వ్యాధులు మనల్ని వెంటాడుతాయి. అయితే ఈ విధమైనటువంటి వ్యాధుల్ని ఎదుర్కోవడం కోసం ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి వ్యాధులను ఎదుర్కోవడానికి ఆయుర్వేద చికిత్స ఒకటని చెప్పవచ్చు.ఈ వర్షాకాలంలో మన శరీరంలో రోగ నిరోధక శక్తి బలహీనపడటం ఎన్నో రకాల అంటు వ్యాధులకు కారణమవుతుంది. కనుక ఈ ఆయుర్వేద చికిత్స విధానాన్ని అనుసరించి ఈ విధమైనటువంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.

సాధారణంగా మనం ఇంట్లో అప్పుడప్పుడు తైలమర్దన చేస్తుంటాము. ఈ విధంగా మర్దనా చేయటం వల్ల మన శరీరంలో రక్తప్రసరణ పెరుగుదల, శరీరంలో మలినాలు విసర్జితమవుతాయి. ఈ క్రమంలోనే మన శరీరంలోని కణాలకు శక్తి ఉత్తేజితం అవుతుంది తద్వారా మనకు ఎంతో సుఖనిద్ర పడుతుంది. ఈ విధంగా మనం శరీరమంతటా మర్దనా చేయటం కోసం ఏదైనా నూనెలను లేదా సున్నిపిండితో మర్థన చేయడాన్ని ఆయుర్వేద భాషలో అభ్యంగన స్నానం అని పిలుస్తారు.

ఎవరైతే అధిక బరువు,ఒంట్లో నీరు నిల్వ ఉండిపోవడం, నిస్తేజం, రక్తప్రసరణ లోపం ఉంటుందో అలాంటివారు
ఉద్ఘర్షణ చికిత్స చేయించుకోవడం వల్ల దీర్ఘకాలంలో శరీరంలోని పేరుకుపోయిన కలుషితాలన్నీ విరిగి రక్తప్రవాహంలో కలుస్తాయి. దీని ఫలితంగా కొవ్వు కరగడంతో పాటు శరీర బరువు తగ్గుతారు.

అదేవిధంగా తల అధిక బరువు, జలుబు వంటి సమస్యలతో బాధపడే వారికి శిరోధార చికిత్స అందిస్తారు. వివిధ రకాల తైలాలతో తలకు జుట్టు బాగా మర్దన చేయడం వల్ల తల భారం తగ్గి,మెదడులో సెరటోనిన్‌, డోపమైన్‌ హార్మోన్లు సక్రమంగా స్రవించడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

ఈ ఆయుర్వేద మందులతో రోగనిరోధక శక్తిని పెంచుకోండి!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కరోనా బారిన పడకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని తెలియడంతో ప్రతి ఒక్కరు రోగ నిరోధకశక్తిని పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే వివిధ రకాల ఆహార పదార్థాలను, కషాయాలను, పానీయాలను తయారు చేసుకొని తాగడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు అని భావిస్తున్నారు.

ఈ భయంకరమైన మహమ్మారినికట్టడి చేయడానికి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనల అనంతరం వ్యాక్సిన్ ను కనుగొన్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు కృష్ణ పట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మెడిసిన్ వల్ల కరోనా నుంచి తొందరగా విముక్తి కావచ్చని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ విషయంలోనే ఎన్నో పరిశోధనలు జరిపిన ప్రభుత్వం సైతం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీకి అనుమతి తెలిపింది. కానీ కరోనా రాక మునుపే ఆయుర్వేదంలో ఈ విధమైనటువంటి మందులు ఎన్నో ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద మందులు చాలా ఉన్నాయి. మరి అవి ఏమిటో తెలుసుకుందాం.

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎక్కువమంది రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం తిప్పతీగను అధికంగా ఉపయోగిస్తున్నారు. తిప్పతీగ చూర్ణం లేదా గుళికలు, పౌడర్ రూపంలో మనకు లభిస్తుంది.దీనిని తరచూ తీసుకోవడం ద్వారా మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ తిప్పతీగ చూర్ణాన్ని మనకు జ్వరం చేసినప్పుడు మందులకు బదులుగా ఈ తిప్పతీగ కషాయం తాగడం వల్ల త్వరగా శరీర వేడిని తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం ఆమోదం తెలిపిన ఆయుర్వేద మందులు తిప్పతీగ ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది.

తిప్పతీగలతోపాటు అశ్వగంధ, అతి మధురం, నేల వేము కూడా రోగనిరోధక శక్తిని పెంచుతాయి.  అదేవిధంగా దాల్చిన చెక్క, మిరియాలు, సొంఠితో దీన్ని రూపొందించారు. వేడి చేసే గుణం గల ఈ కషాయంలో యాంటీ వైరల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల ఇది మన శరీరంలోకి ప్రవేశించిన హానికర బ్యాక్టీరియా వైరస్ లను నాశనం చేయడానికి దోహదపడతాయి.ఈ విధమైనటువంటి ఆయుర్వేద మందులను తరచూ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని ఢిల్లీ ఎంసీడీ ఆయుష్ విభాగం చీఫ్ మెడికల్ ఆఫీసర్, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ కామేశ్వరరావు తెలిపారు.

ఆనందయ్య మందు పంపిణీ ఇప్పట్లో లేనట్లే.. ఎందుకంటే?

ప్రస్తుతం భారతదేశంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది రోజుల నుంచి ఆనందయ్య ఆయుర్వేద మందు ఎంతో ప్రాచుర్యం పొందుతోంది. ఇతని దగ్గర మందు తీసుకున్నవారి ఆరోగ్యం నిమిషాలలో కుదుటపడుతుందని, ఈ మందు ద్వారా ఎంతో మంది తమ ప్రాణాలను దక్కించుకున్నారని గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందు కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆయుర్వేద మందు పై ప్రభుత్వం నిషేధం విధించి ఈ మందు పై CCRAS (సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్) అధ్యయనం చేపట్టాలని సూచించింది. అయితే ఏ అధ్యయనానికి ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ అధ్యయనంలో భాగంగా అధికారులు ఇప్పటి వరకు ఆనందయ్య దగ్గర ఎంతమంది మందు తీసుకున్నారు, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఏవిధంగా ఉందో అనే విషయం గురించి ఆరా తీస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆనందయ్య దగ్గర మందు తీసుకున్న బాధితులకు సోమవారం నుంచి ఫోన్ కాల్స్ చేస్తున్న నేపథ్యంలో 92 మందికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు, అదేవిధంగా 42 మంది గ్రామస్తులు ఆనందయ్య వద్ద మందు తీసుకోలేదని చెబుతున్నారు. అయితే ఆనందయ్య దగ్గర మందు కోసం వచ్చిన వారు వచ్చినట్టుగా మందు తీసుకు వెళ్తున్నారని, ఎవరు కూడా అతనికి ఫోన్ నెంబర్ లేదా ఇతర వివరాలను కానీ తెలుపలేదని అధికారులు తెలియజేస్తున్నారు.

ఈ విధంగా ఆనందయ్య దగ్గర మందు తీసుకున్న బాధితుల వివరాలు తెలియకపోతే ఈ అధ్యయనం ఏ విధంగా చేయాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వివరాలు తెలిస్తే తప్ప నివేదిక తయారు చేయలేమని అధికారులు తెలియజేశారు. ఇటువంటి సమయంలో ఆనందయ్య మందు పై అధ్యయనం చేయడం మరింత ఆలస్యం కావచ్చని, ఈ మందు ఇప్పట్లో పంపిణీ అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదని తెలుస్తోంది. ఆనందయ్య దగ్గర మందు తీసుకున్న వారి వివరాలు తెలిస్తే కానీ నివేదిక ఇవ్వలేరు,నివేదిక ఇవ్వకపోతే ప్రభుత్వం ఈ మందు సరఫరాకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.

‘బ్లాక్ ఫంగస్’కు ఆయుర్వేద మందు.. అది వస్తే అసలు మనిషి బతుకుతాడా?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ఎంతటి తీవ్ర రూపం దాలుస్తుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా నుంచి కోలుకున్న వారిపై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది కరోనాతో జయించి బయట పడినప్పటికీ, బ్లాక్ ఫంగస్ బారినపడి, కంటి చూపు కోల్పోవడం, మరికొందరు ఈ ఫంగస్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే దేశమంతటా రోజురోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

కరోనా నుంచి కోలుకున్న వారిలో తీవ్ర ముప్పుగా పరిగణించిన ఈ బ్లాక్ ఫంగస్ ను ఆయుర్వేద చికిత్సా విధానంతో పూర్తిగా నయం చేయవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించిన వెంటనే బాధితులు సరైన చికిత్స తీసుకోవటం వల్ల ఈ ఫంగస్ నుంచి బయట పడవచ్చు అని గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు ఎం.శ్రీనివాస్‌నాయక్‌ తెలియజేశారు.

బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో లక్షణాలు కనిపించిన వెంటనే ఆయుర్వేద నిపుణులను సంప్రదించి వైద్యుల పర్యవేక్షణలో రెండు పద్ధతులలో మందులు వాడితే ఈ వ్యాధి నుంచి బయట పడవచ్చు. మొదటి ఈ చికిత్సా విధానంలో భాగంగా గంధక రసాయనం మాత్రలు భోజనం తర్వాత రెండు రోజులు వాడాలి.ఖదిరాదివతి మాత్రలు భోజనానికి ముందు రెండు రోజులు వాడాలి.పంచతిక్త గుగ్గులువృతము 10 గ్రాములు గోరువెచ్చని పాలలో భోజనానికి ముందు తాగాలి. అదేవిధంగా మృత్యుంజయ రసం రెండు మాత్రలు రోజుకు మూడు సార్లు వేసుకోవాలి.

రెండో చికిత్స విధానంలో భాగంగా ఆరోగ్యవర్ధనీవతి  మాత్రలు 2 భోజనం తర్వాత వేసుకోవాలి. విషతుందుకవతి రెండు మాత్రలు మూడు సార్లు భోజనం తర్వాత వాడాలి.టంకణభస్మం ఒక గ్రాము గ్లాసు నీటితో కలిపి పుక్కిలించాలి.   ఈ విధమైన చికిత్సా విధానాల ద్వారా బ్లాక్ ఫంగస్ నుంచి బయటపడవచ్చని డాక్టర్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. అయితే ఈ మందులు కేవలం డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలని ఆయన తెలిపారు.