Tag Archives: Bangalore

Tarakaratna: 23 రోజులు వైద్యం అందించిన తారకరత్న కోలుకోకపోవడానికి కారణం ఏంటి.. అసలేం జరిగింది?

Tarakaratna: నందమూరి తారకరత్న ఇకలేరనే వార్త నందమూరి అభిమానులలోను టిడిపి కార్యకర్తలలోనూ తీవ్ర విషాదం నింపింది.లోకేష్ పాదయాత్రలో భాగంగా ఆయనకు మద్దతు తెలుపుతూ పాల్గొన్నటువంటి తారకరత్న ఉన్నపలంగా హార్ట్ స్ట్రోక్ రావడంతో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఈయనను సమీప ఆసుపత్రికి తరలించే అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.

ఇలా నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఈయనకు ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో గత 23 రోజులగా వెండిలేటర్ పై చికిత్స అందుతుంది. ఇలా 23 రోజుల నుంచి నిపుణుల సమక్షంలో చికిత్స అందుతున్నప్పటికీ ఈయన ఆరోగ్య విషయంలో ఏ మాత్రం మెరుగు కనిపించకపోవడంతో ఒకవైపు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూనే వచ్చారు.

తారకరత్న విషయంలో నందమూరి కుటుంబ సభ్యులకు కూడా చాలా కేర్ తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటూనే ఉన్నారు. పెద్ద ఎత్తున పూజలు హోమాలు కూడా చేశారు. ఇలా ఒకవైపు విదేశీ వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ తారకరత్న ప్రాణాలు కోల్పోవడానికి అసలు కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు.

Tarakaratna: తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన తారకరత్న….


ఈ విధంగా 23 రోజులపాటు వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నటువంటి తారకరత్న ప్రాణాలు కోల్పోవడానికి గల కారణం ఆయన బ్రెయిన్ ఫంక్షన్స్ జరగకపోవడమే. ఈయన పాదయాత్రలో హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆ ప్రభావం మెదడుపై పడిందని దాంతో మెదడు పనితీరు తగ్గిపోవడం వల్ల ఈయన వెంటిలేటర్ పై ఉన్నప్పటికీ ఆయన శరీరం వైద్యానికి సహకరించలేదని అలాగే వైద్యులు ఎంతో శ్రమించినప్పటికీ ఆయన మెదడు పనితీరులో ఏమాత్రం మెరుగు లేకపోవడంతోనే ఆయన మరణించారని తెలుస్తోంది.ఏది ఏమైనా క్షేమంగా తిరిగి వస్తారు అనుకున్న తారకరత్న ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని తెలిసి నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు

Tarakaratana: విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి… శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్న డాక్టర్స్!

Tarakaratana: నందమూరి తారకరత్న అనారోగ్యానికి గురై దాదాపు 20 రోజులు కావస్తున్న ఇప్పటికి తారకరత్న స్పృహలోకి రాలేదు దీంతో అభిమానులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తారకరత్న ఆరోగ్య విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రలో భాగంగా పాల్గొన్నటువంటి తారకరత్న ఉన్నఫలంగా స్పృహ తప్పి పడిపోయారు. అయితే ఆయనని ప్రథమ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనకు స్ట్రోక్ వచ్చిందని తెలియగానే మెరుగైన వైద్య చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు.

బెంగళూరులో నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్న చికిత్స తీసుకుంటున్నారు అయితే ఈయన ఆసుపత్రిలో చేరి దాదాపు 20 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా స్పృహలోకి రాకపోవడంతో ఈయన ఆరోగ్యం పరిస్థితి పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఈయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అని పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

విదేశీ నిపుణుల సమక్షంలో తారకరత్నకు చికిత్స జరుగుతోందని తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి 16వ తేదీ ఈయనకు మరోసారి స్కానింగ్ నిర్వహించగా ఈయన శరీర భాగాలన్నీ కూడా స్పందిస్తున్నాయని అయితే మెదడు పని తీరు మాత్రం ఏమాత్రం స్పందించలేదని తెలుస్తుంది. ఇకపోతే వైద్యులు ఈయనకు స్కానింగ్ నిర్వహించిన తర్వాత త్వరలోనే తన హెల్త్ అప్డేట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Tarakaratana:మెరుగుపడని మెదడు పనితీరు….


ఇలా తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురవడంతో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆ సమయంలో మెదడుకు సరైన స్థాయిలో ఆక్సిజన్ అందకపోవటం వల్ల ఆయన మెదడు పనితీరుపై తీవ్రమైన ప్రభావం పడిందని, నిపుణులు తెలియజేశారు.అయితే తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు నందమూరి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.

Tarakaratna: తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన బాలకృష్ణ…?

Tarakaratna: నందమూరి తారక రామారావు మనవడిగా గుర్తింపు పొందిన నందమూరి తారకరత్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నందమూరి తారకరత్న ఆ తర్వాత పలు సినిమాలలో హీరోగా, విలన్ గా నటించాడు. అయితే సినిమా రంగంలో సరైన గుర్తింపు రాకపోవటంతో ఇండస్ట్రీ కి దూరం అయ్యాడు.

ఆ తర్వాత వ్యాపార రంగంలో రాణిస్తున్న తారక్ ఇటీవల రాజకీయల్లో ఎంటర్ అవుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్రలో నందమూరి తారకరత్న పాల్గొన్నారు. ఈ యాత్ర ప్రారంభించిన మొదటి రోజే తారకరత్న గుండెపోటుతో అనారోగ్యం పాలయ్యాడు. దీంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రతిమ చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, డాక్టర్ల చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తోందని నందమూరి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో బాలకృష్ణ వెంటనే బెంగుళూరుకు చేరుకొని డాక్టర్లతో సంప్రదింపులు జరిపి తారకరత్న వైద్యం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. అప్పటి నుండి బాలకృష్ణ బెంగళూరులోనే ఉంటున్నాడు.

Tarakaratna: అదొక మెరాకిల్…

ఇక తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి బాలకృష్ణ స్పందిస్తూ… ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, 45 నిమిషాల పాటు ఆగిపోయిన తారకరత్న గుండె మళ్ళీ కొట్టుకోవడం ఒక మెరాకిల్ అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం స్టంట్ వేయడానకీ డాక్టర్లు కొన్ని మందులు వేస్తున్నారు. బీపీ, షుగర్ లెవల్స్ నార్మల్ అయ్యాక స్టంట్ వేయనున్నట్టు చెప్పారు. తారకరత్న హెల్త్ విషయమై వైద్యులు అన్ని రకాలుగా కేర్ తీసుకుంటున్నారని వెల్లడించాడు.

Taraka Rathna: తారకరత్నకు సోకిన మెలెనా లక్షణాలు.. అది ఎలా వస్తుందో తెలుసా?

Taraka Rathna: తారకరత్న.. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమోగుతున్న పేరు. ప్రస్తుతం తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే.. అయితే తారకరత్న త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు అలాగే నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే దేవుళ్లకు పెద్ద ఎత్తున పూజలు కూడా చేస్తున్నారు.

బెంగళూరులోని హృదయాలయ ఆసుపత్రి వైద్యులు తారకరత్న మెలెనా అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.
జీర్ణశయాంతర రక్తస్రావాన్ని మెలెనా అని పిలుస్తారు. అయితే మామూలుగా మెలెనా వల్ల ఎగువ జీర్ణశయాంతర మార్గంతో పాటుగా నోరు, అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగు మొదటి భాగం నుంచి రక్తస్రావం అవుతుంది. కొన్ని కొన్నిసార్లు ఎగువ జీర్ణశయాంతర దిగువ భాగంలో ఉండే పెద్ద ప్రేగు ఆరోహణ భాగంలో కూడా రక్తస్రావం జరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

చాలామంది అభిమానులు తారకరత్న బాధపడుతున్న మెలెనా వ్యాధి గురించి దాని లక్షణాల గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేయగా కొన్ని రకాల విషయాలు బయటకు వచ్చాయి.. అయితే మెలెనా వ్యాధి రావడానికి కారణాల విషయానికి వస్తే.. ఎగువ జీర్ణశయాంతర మార్గం దెబ్బ తినడం, కడుపులో పుండ్లు, కడుపులో యాసిడ్ ఉత్పత్తి అధికంగా ఉండడం లేదా రక్తనాళాల్లో వాపు, రక్తస్రావం అలాగే రక్త సంబంధిత వ్యాధుల వల్ల ఈ మెలెనా వ్యాధి వస్తుంది.

Taraka Rathna:శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది….

ఇక ఈ మెలెనా వ్యాధి లక్షణాల విషయానికొస్తే.. ఈ వ్యాధి సోకిన వారికి మలం నల్లగా, బంక మాదిరి రావడంతో పాటుగా దుర్వాసన విపరీతంగా వస్తుంది. అలలాగే ఈ వ్యాధి వల్ల శరీరంలో రక్త స్థాయి చాలావరకు తగ్గిపోయి రక్తహీనతతో పాటు బలహీనమైపోతారు. కొన్ని కొన్ని సార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ మెలెనా వ్యాధి సోకిన వారికి శరీరం లేత పసుపు రంగులోకి మారిపోతుంది. అలసట, విపరీతమైన చెమటలు, గందరగోళం అనిపించడం, అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చు.

Actress Rajini: హీరోయిన్ రజినీని కాల్చి చంపుతానని బెదిరించిన స్టార్ హీరో తండ్రి?

Actress Rajini: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు సీనియర్ హీరోయిన్ రజిని.ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం కన్నడ మలయాళ భాషలలో కూడా సుమారు 80 సినిమాలకు పైగా నటించారు. రజనీకా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె అసలు పేరు శశికౌర్ మల్హోత్రా.బెంగళూరులో జన్మించిన ఈమె సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

ఇక ఈమెకు ఇండస్ట్రీలో దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ఈమెకు అండగా నిలిచి ఈమె కాల్ షీట్స్ చూసుకోవడమే కాకుండా ఈమె ఏ సినిమా అయినా నటించాలి అంటే ముందుగా దాసరి నారాయణ రావు గారికి ఆ కథ వినిపించాలి.ఇలా దాసర నారాయణరావు గారి అండతో ఈమె ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలలో నటించారు.

ఇక సాధారణంగా కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి వస్తున్న సమయంలో పాత హీరోయిన్ లకు అవకాశాలు తగ్గిపోవడం సర్వసాధారణం ఈ క్రమంలోనే రజిని కూడా అవకాశాలు తగ్గి ఉన్న ఫలంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఈమె ఇండస్ట్రీకి దూరం కావడానికి ఓ కారణం ఉంది. రజిని మేనమామ అనే సినిమాలో కూడా నటించారు. ఈ సినిమాలో హీరోగా నందమూరి కళ్యాణ్ చక్రవర్తి నటించారు.ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈమె ఒకరోజు షూటింగ్ కి ఆలస్యంగా రావడమే కాకుండా షూటింగ్లో పాల్గొనకుండా తిరిగి వెళ్తున్నారు. అందుకే అవకాశాలు తగ్గాయా…

Actress Rajini:

హీరో కళ్యాణ్ చక్రవర్తి తండ్రి అడ్డుపడి ఎందుకు షూటింగ్ చేయకుండా వెళ్తున్నారు అనడంతో ఈమె దురుసుగా తనకు ఇవ్వాల్సిన పేమెంట్స్ ఇవ్వలేదంటూ సమాధానం చెప్పారట. ఇప్పటికే లొకేషన్ లో ఎంతోమంది ఆర్టిస్టులు వెయిట్ చేస్తున్నారు. మరోసారి వారి కాల్ షీట్స్ దొరకవు షూటింగ్ చేయాలని తన తండ్రి చెప్పినప్పటికీ ఆమె వినకుండా కారు డోర్ వేసుకోవడానికి ప్రయత్నించగా కళ్యాణ్ చక్రవర్తి తండ్రి గన్ తీసి షూటింగ్లో పాల్గొనకపోతే షూట్ చేసి చంపుతా అంటూ తనని బెదిరించడంతో ఆమె ఆరోజు షూటింగ్లో పాల్గొని తనకు ఇవ్వాల్సిన డబ్బును తీసుకొని వెళ్లిపోయారట. ఇలా ఈమె ప్రవర్తించిన కారణంగానే ఈమెకు ఇండస్ట్రీలో అవకాశాలు కూడా తగ్గిపోయాయని తెలుస్తోంది.

Kangana Ranaut: ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకున్న కంగనా.. అవార్డు ఇస్తూ నవ్వులపాలైన సైమా నిర్వాహకులు!

Kangana Ranaut: ప్రతి ఏడాది చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తూ వివిధ భాషల నుంచి కొన్ని సినిమాలను సెలెక్ట్ చేసి సైమా అవార్డులను ప్రధానం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే 2021 సంవత్సరానికి గాను సైమా అవార్డు వేడుకలను బెంగళూరులో ఎంతో ఘనంగా నిర్వహించారు. వివిధ భాషల నుంచి బెస్ట్ సినిమాలను ఎంపిక చేసి ఈ అవార్డులను ప్రధానం చేశారు.

ఇకపోతే తమిళంలో తెరకెక్కిన తలైవి సినిమాలో నటించినందుకుగాను ఉత్తమ నటిగా కంగనా రనౌత్ సైమా అవార్డు అందుకున్నారు.అయితే ఈమెకు సాయి
సైమా అవార్డు ఇవ్వడంతో సైమా నిర్వాహకులు పెద్ద ఎత్తున నవ్వుల పాలయ్యారు. ముఖ్యంగా తలైవి సినిమాలో జయలలిత పాత్రకు కంగనా ఏమాత్రం సరిపోలేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి అదేవిధంగా ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది.

Kangana Ranaut: డబ్బు పెట్టినోళ్లే అవార్డు ఇవ్వడం ఏంటి..

ఇలా మిశ్రమ స్పందన దక్కించుకున్న ఈ సినిమాలో నటించిన కంగనాకు సైమా అవార్డు ఇవ్వడం ఏంటి అని అందరూ నవ్వుకున్నారు. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏమిటంటే తలైవి సినిమాను నిర్మించినది మరెవరో కాదు సైమా వేడుకలను నిర్వహించే వాళ్లే నిర్మాతలుగా వ్యవహరించారు. ఇలా డబ్బు పెట్టిన వాళ్ళే తిరిగి ఆ సినిమాకి అవార్డు ఇవ్వడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడమే కాకుండా నవ్వుల పాలయ్యారు.

అయితే తమిళంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు సైమా నామినేషన్ లో ఉన్నప్పటికీ కంగనాకు ఈ అవార్డు రావడం పట్ల నిజంగానే ఆడియన్స్ పోల్ ద్వారానే ఈ అవార్డులు ఇస్తున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సైమ నామినేషన్ లో భాగంగా తమిళంలో నిలిచినటువంటి సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే..నెట్రికన్‌’ నుండి నయనతార, ‘జై భీమ్‌’ నుండి లియోమోల్‌ జోజ్‌, ‘అన్‌బిర్‌కినియాల్‌’ నుండి కీర్తి పాండియన్‌, ‘తిట్టమ్‌ ఇరండు’ నుండి ఐశ్వర్య రాజేష్‌ పోటీలో ఉన్నప్పటికీ కంగనాకు అవార్డు రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Actor Suman: నేను క్షేమంగానే ఉన్నాను.. తప్పుడు వార్తలపై మండిపడిన సుమన్?

Actor Suman: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత నాలుగు దశాబ్దాల క్రితం అగ్ర హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ మెగాస్టార్ చిరంజీవికి పోటీగా నిలిచిన వారిలో సుమన్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవికి పోటీగా ఈయన సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సుమన్ తన కెరియర్ ను కోల్పోవలసి వచ్చింది.ఇలా ఇండస్ట్రీకి కొంతకాలం పాటు దూరమైన అనంతరం పలు సినిమాలలో సహాయ నటుడిగా చేస్తూ బిజీగా ఉన్నారు.

ఇకపోతే ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్స్ వారి వ్యవహారం కాస్త శృతి మించిందని చెప్పాలి. తమ ఛానల్ వ్యూస్ కోసం ఏకంగా బ్రతికున్న వారిని కూడా చంపేస్తున్నారు. బ్రతికున్న నటీనటులను చనిపోయారంటూ థంబ్ నెయిల్స్ పెడుతూ తమ ఛానల్ వ్యూస్ పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటుడు సుమన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన చనిపోయారంటూ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి.

ఈ క్రమంలోనే ఈ వార్తలు వైరల్ కావడంతో సుమన్ అభిమానుల సైతం ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు.ఇక ప్రస్తుతం బెంగళూరులో ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న సుమన్ కి సన్నిహితుల ద్వారా ఈ విషయం తెలియడంతో ఈయన ఏకంగా ప్రెస్ నోట్ విడుదల చేశారు.ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ అభిమానులు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని తాను ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నానని వెల్లడించారు.

Actor Suman: క్షేమంగా ఉన్నానని తెలిపిన సుమన్…

ఇలా తన ఆరోగ్య పరిస్థితి గురించి తాను మరణించానంటూ ప్రచారం చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ లపై ఈయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆ చానల్ పై పరువు నష్టం దావా వేయనున్నట్లు పేర్కొన్నారు. తాను క్షేమంగా ఉన్నప్పటికీ వారి స్వలాభం కోసం ఈ విధమైనటువంటి అసత్య వార్తలను ప్రచారం చేయడం భావ్యం కాదని ఈయన మండిపడుతూ సదరు చానల్ పై పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు.ఇలా సుమన్ ఈ విషయ పై స్పందించి తాను క్షేమంగా ఉన్నానని చెప్పడంతో అభిమానులు ఒక్క సారిగా ఊపిరి పీల్చుకున్నారు.

ఎమ్మెల్యే రోజాకు తప్పిన ప్రమాదం.. గాల్లోనే గంటపాటు తిరిగిన విమానం.. చివరకు ఏమైందంటే?

నగరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. అయితే పైలట్ విమానాన్ని తిరుపతిలో కాకుండా బెంగళూరులో సురక్షితంగా దించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రయాణిస్తున్న రాజమండ్రి-తిరుపతి విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

అయితే పైలట్ విమానాన్ని తిరుపతిలో కాకుండా బెంగళూరులో సురక్షితంగా దించారు. ఎమ్మెల్యే రోజా రాజమండ్రి నుంచి తిరుపతికి వెళ్లాల్సి ఉండగా.. ఈరోజు ఉదయం 10:55 గంటలకు తిరుపతి చేరుకోవాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఆమె ఎక్కారు. ఈ నేపథ్యంలో విమానంలో ప్రయాణంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్ వేగంగా స్పందించి విమానాన్ని బెంగళూరు వైపు తీసుకెళ్లాడు. ఆ సమయంలో విమానంలో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉండగా, విమానం సురక్షితంగా బెంగళూరులో ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

తాము ఇంకా విమానంలోనే ఉన్నామని, ఇంకా విమానం తలుపులు తెరవలేదని ఎమ్మెల్యే రోజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పైలట్‌కు ఇంకా ఆదేశాలు ఇవ్వలేదు అని రోజా వీడియో విడుదల చేశారు. తిరుపతి విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు అనుమతి లభించకపోవడంతో విమానం గంటకు పైగా గాలిలో తిరుగుతోందని ఆమె వీడియో ద్వారా వార్తను పంచుకున్నారు . ప్రస్తుతం ఈ వీడియో వైరల్‎గా మారింది. మరోవైపు ఈ విమానం తిరుపతికి తిరిగి వస్తుందా లేదా అన్నదానిపై అధికారుల నుంచి స్పష్టత లేదు.

ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఎమ్మెల్యే తో పాటు ఇతర ప్రయాణీకులు ఇప్పుడు ఎయిర్‌క్రాఫ్ట్‌లోకి దిగడానికి అనుమతించారని .. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. తమకు ల్యాండింగ్‌కు అనుమతి లేనందున విమానం దిగేందుకు రూ. 5,000 చెల్లించాలని ఇండిగో అధికారులు డిమాండ్ చేశారని ఎమ్మెల్యే వెల్లడించారు. ఊపిరాడక విమానంలో కూర్చోలేక ఆమెతో సహా కొందరు డబ్బులు చెల్లించారని ఎమ్మెల్యే తెలిపారు. ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు తిరుపతి ఎయిర్‌పోర్టులో ఫిర్యాదు చేయాలని చెప్పారన్నారు. ఆమెతో పాటు మిగిలిన ప్రయాణికులు ఈ వ్యవహారంపై సివిల్ కేసు నమోదు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం.