Tag Archives: biopic

Nivetha Pethuraj: ఆ బయోపిక్ చిత్రంలో నటించాలని ఉంది… నివేతా పేతురాజ్ షాకింగ్ కామెంట్స్!

Nivetha Pethuraj: నివేత పేతురాజ్ నటుడు విశ్వక్ తో కలిసి ఈమె పాగల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తిరిగి ఈ జంట తాజాగా విడుదలైన దాస్‌ కీ ధమ్కీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి నివేత ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె పలు ఆసక్తికరమైన విషయాల గురించి తెలిపారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ప్రభుదేవాతో ఓ తమిళ సినిమా చేస్తున్నప్పుడు ‘నువ్వు తెలుగులో నటిస్తుంటావు కదా, ఇక్కడికెందుకొచ్చావు’ అని అడిగారట. ‘బాగా డాన్సులు చేసి, ఎక్కువ పారితోషికం తీసుకొచ్చేయ్‌’ అని చెప్పారని వెల్లడించారు. ఇక ఈ సినిమాలో గ్లామర్ షో చేయాలంటే కాస్త భయం వేసిందని ఈ సినిమా కోసం తాను పూర్తిగా శరీర బరువు తగ్గానని తెలిపారు.

దాస్‌ కీ ధమ్కీ సినిమా కోసం తాను ఎంతో కష్టపడి పూర్తిగా తన స్టైల్ మొత్తం మార్చుకున్నానని తెలిపారు. ఇక ఇందులో పాటలు కొన్ని సన్నివేశాలను అమ్మకు పంపించడంతో తన తల్లి కూడా ఇందులో చాలా అద్భుతంగా నటించానని మెచ్చుకున్నారని వెల్లడించారు. సాధారణంగా హీరోలు సినిమాలను నిర్మిస్తూ ఉంటారు కానీ విశ్వక్ మాత్రం సినిమాకు డైరెక్షన్ చేశారు. తన డైరెక్షన్లో వేరే హీరోతో సినిమా చేయొచ్చు కదా అని తనకు సలహా ఇచ్చానని తెలిపారు.

Nivetha Pethuraj:సౌందర్య బయోపిక్ చిత్రం…

విశ్వక్‌కి గ్యాంగ్‌స్టర్‌ సినిమాలంటే పిచ్చి. అప్పుడప్పుడూ కొన్ని కథలు కూడా వినిపించారని ఈమె తెలియజేశారు ఇక తాను బయోపిక్ సినిమాల గురించి మాట్లాడుతూ తనకు ఆస్ట్రానట్ కల్పనా చావ్లా బయోపిక్ చిత్రంలో నటించాలని ఉందని తెలిపారు. ఇక సౌందర్య బయోపిక్ చిత్రంలో కూడా చేయాలని ఉంది కానీ ఆ బయోపిక్ చిత్రంలో నిత్యమీనన్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది అంటూ ఈమె తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

Ram Charan: కోహ్లీ బయోపిక్ చిత్రంలో నటించాలని ఉంది… మనసులో కోరిక బయటపెట్టిన చరణ్!

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ వేడుకల నిమిత్తం అమెరికా వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. ఈ వేడుకలు ముగిసిన తర్వాత చిత్ర బృందం మొత్తం హైదరాబాద్ చేరుకోగా రామ్ చరణ్ ఉపాసన దంపతులు మాత్రం ఢిల్లీ వెళ్లారు. రామ్ చరణ్ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఇండియా టుడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ ప్రధాని నరేంద్ర మోడీ సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప వారితో కలిసి వేదిక పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు. ముఖ్యంగా ఆస్కార్ అవార్డు రావడానికి గల కారణాలను అలాగే ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కూడా ఈ సందర్భంగా ఈయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ తన మనసులో ఉన్నటువంటి ఒక కోరికను కూడా బయట పెట్టారు. ఇప్పుడు ఇండస్ట్రీలో బయోపిక్ చిత్రాల హవా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది రాజకీయ సినీ క్రికెట్ సెలబ్రిటీల జీవితాలకు సంబంధించిన బయోపిక్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే చరణ్ సైతం ఇలాంటి ఒక బయోపిక్ చిత్రంలో నటించాలని ఉంది అంటూ తెలిపారు.

Ram Charan: కోహ్లీ నాకు ఆదర్శం…


ఇప్పటికే ఎంతోమంది ఇండియన్ క్రికెటర్ల బయోపిక్ చిత్రాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే తనకు ఎంతో ఆదర్శంగా స్ఫూర్తిగా నిలిచిన విరాట్ కోహ్లీ బయోపిక్ చిత్రంలో నటించాలని ఉంది అంటూ రామ్ చరణ్ ఈ సందర్భంగా తన మనసులో కోరికను బయటపెట్టారు. ఇలా ఈయన కోహ్లీ బయోపిక్ చిత్రంలో నటించాలని ఉందని చెప్పడంతో కోహ్లీ అభిమానులు, చరణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Jhulan Goswami-Anushka Sharma: ఆ బయోపిక్ తో అలరించనున్న అనుష్క శర్మ..టీజర్ విడుదల..!

Jhulan Goswami-Anushka Sharma: బయోపిక్ లు అనేవి సినీ పరిశ్రమలో కామన్ అయిపోయాయి. ఇటీవల ఎంఎస్ ధోనీ బయోపిక్ కూడా సినిమాలో వచ్చిన విషయం తెలిసిందే. తర్వాత సినీ పరిశ్రమలో సీనియర్ హీరోల బయోపిక్ లు కూడా ఇటీవల సినిమాల రూపంలో వచ్చేస్తున్నాయి.

ఇటీవలే ‘రశ్మీ రాకెట్’ మూవీలో అథ్లెట్ గా నటించి, సినీ అభిమానుల మెప్పు పొందిన తాప్సీ పన్ను తాజాగా మిథాలీ రాజ్ బయో పిక్ షూటింగ్ పూర్తి చేసింది. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ బయోపిక్ ను ‘శభాష్‌ మిథు’ పేరుతో శ్రీజిత్ ముఖర్జీ తెరకెక్కించాడు.

తాజాగా అనుష్క శర్మ మరోసారి ఓ బయోపిక్ లో కనిపించనుంది. 2018లో ‘జీరో’లో చివరిగా కనిపించిన ఈ బ్యూటీ తన తదుపరి చిత్రం “చక్దా ఎక్స్‌ప్రెస్”లో నటించబోతోంది. భారత మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అనుష్క టైటిల్ రోల్ పోషిస్తోంది .

‘చక్దా ఎక్స్‌ప్రెస్’ టైటిల్ ఖారారు..


ఇక ఈసినిమా పేరును చక్దా ఎక్స్‌ప్రెస్ టైటిల్ ను ఫైనల్ చేశారు. ఈమేరకు ఆమె టీజర్ ను తన ట్విట్టర్ ఖాతా లో పోస్టు చేసింది. ఈ సినిమాలో జులన్ జీవితాన్ని.. ఆమె క్రికెట్ లో రావడానికి పడ్డ కష్టాలను వివరించనున్నారు. క్రికెటర్ అంటే కేవలం పురుషులు మాత్రమే కాదు.. మహిళలు కూడా ఆడి చూపించగలరని.. వాళ్లకు కూడా ఈ రంగంలో కెరీర్ ఉంటుందని చెప్పే కథ ఇది. ఆమె వల్ల తరువాతి తరం అమ్మాయిలకు క్రికెట్ లో మెరుగైన కెరీర్ ఏర్పడింది అంటూ అనుష్క పోస్ట్ చేసింది. ఇక విరుష్క దంపతులు ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆమె పేరు వామిక. అనుష్క శర్మ తన కుమార్తె వామిక పుట్టిన తర్వాత చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. అయితే ఇది ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు కానీ.. నెట్ ఫ్లిక్స్ లో మాత్రం స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది.

విరాట్ బయోపిక్ లో అఖిల్.. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానంటూ!

అక్కినేని వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ ఇప్పటివరకు నటించిన సినిమాలలో ఏ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా అక్టోబర్ 15 వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో అఖిల్ పాల్గొంటున్నారు.

సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అఖిల్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అఖిల్ నటిస్తున్నటువంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గురించి మాట్లాడటమే కాకుండా తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి తెలిపారు. తనకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం అన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తనకు క్రీడల బయోపిక్ సినిమాలంటే ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా తెలిపారు.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో రణవీర్ సింగ్ దీపికా పదుకొనే నటించిన 83 సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని, ఈ సినిమా కపిల్ దేవ్ జీవిత ఆధారంగా తెరకెక్కి ఉండడంతో ఈ సినిమాపై ఎంతో ఆతృత ఏర్పడిందని తెలిపారు. ఈక్రమంలోనే తనకి కూడా ఏదైనా క్రీడల బయోపిక్ చిత్రాలలో నటించాలని ఉందన్న విషయాన్ని బయటపెట్టారు.

ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ తనకు ప్రస్తుత ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ జీవిత కథ ఆధారంగా ఓ సినిమాలో నటించాలని ఉందని తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.విరాట్ కోహ్లీ జీవితం క్రికెట్ పై ఫ్యాషన్ తో, చాలా అగ్రెసివ్ గా ఉంటుందని ఈ సందర్భంగా అఖిల్ తెలిపారు.ఇదిలా ఉండగా ప్రస్తుతం అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దసరా కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాపై అటు అఖిల్,ఇటూ బొమ్మరిల్లు భాస్కర్ ఎన్నో అంచనాలను పెట్టుకున్నారని చెప్పవచ్చు.