Nivetha Pethuraj: నివేత పేతురాజ్ నటుడు విశ్వక్ తో కలిసి ఈమె పాగల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తిరిగి ఈ జంట తాజాగా విడుదలైన దాస్ కీ ధమ్కీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి నివేత ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె పలు ఆసక్తికరమైన విషయాల గురించి తెలిపారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ప్రభుదేవాతో ఓ తమిళ సినిమా చేస్తున్నప్పుడు ‘నువ్వు తెలుగులో నటిస్తుంటావు కదా, ఇక్కడికెందుకొచ్చావు’ అని అడిగారట. ‘బాగా డాన్సులు చేసి, ఎక్కువ పారితోషికం తీసుకొచ్చేయ్’ అని చెప్పారని వెల్లడించారు. ఇక ఈ సినిమాలో గ్లామర్ షో చేయాలంటే కాస్త భయం వేసిందని ఈ సినిమా కోసం తాను పూర్తిగా శరీర బరువు తగ్గానని తెలిపారు.
దాస్ కీ ధమ్కీ సినిమా కోసం తాను ఎంతో కష్టపడి పూర్తిగా తన స్టైల్ మొత్తం మార్చుకున్నానని తెలిపారు. ఇక ఇందులో పాటలు కొన్ని సన్నివేశాలను అమ్మకు పంపించడంతో తన తల్లి కూడా ఇందులో చాలా అద్భుతంగా నటించానని మెచ్చుకున్నారని వెల్లడించారు. సాధారణంగా హీరోలు సినిమాలను నిర్మిస్తూ ఉంటారు కానీ విశ్వక్ మాత్రం సినిమాకు డైరెక్షన్ చేశారు. తన డైరెక్షన్లో వేరే హీరోతో సినిమా చేయొచ్చు కదా అని తనకు సలహా ఇచ్చానని తెలిపారు.
విశ్వక్‌కి గ్యాంగ్‌స్టర్ సినిమాలంటే పిచ్చి. అప్పుడప్పుడూ కొన్ని కథలు కూడా వినిపించారని ఈమె తెలియజేశారు ఇక తాను బయోపిక్ సినిమాల గురించి మాట్లాడుతూ తనకు ఆస్ట్రానట్ కల్పనా చావ్లా బయోపిక్ చిత్రంలో నటించాలని ఉందని తెలిపారు. ఇక సౌందర్య బయోపిక్ చిత్రంలో కూడా చేయాలని ఉంది కానీ ఆ బయోపిక్ చిత్రంలో నిత్యమీనన్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది అంటూ ఈమె తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…