Movie News

Dil Raju: హీరో నితిన్ తో ఎంసీఏ సీక్వెల్ ఆలోచనలో దిల్ రాజు.. ఇదేం విడ్డూరం అంటూ ఫైర్ అవుతున్న నాని ఫాన్స్!

Dil Raju: వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో నాని సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ఎంసీఏ.ఇక ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ నాని కెరియర్ లో అప్పటివరకు హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ మధ్యకాలంలో సీక్వెల్ సినిమాల హవా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే నాని నటించిన ఎంసీఏ సినిమాకు సీక్వెల్ చిత్రం చేయాలన్న ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో నాని హీరోగా కాకుండా నితిన్ తో చేయాలన్న ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే నాని అభిమానులు ఎంసీఏ సీక్వెల్ చేయాలంటే నానితో చేయాలి కానీ నితిన్ తో చేయడం ఏంటి అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేసిన వేణు శ్రీరామ్ ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే నాని ప్రస్తుతం మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యి బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు నితిన్ ను తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారట అయితే నితిన్ కూడా ప్రస్తుతం వక్కంతం వంశీ, వెంకీ కుడుముల డైరెక్షన్లో రెండు సినిమాలకు కమిట్ అయ్యారు.

Dil Raju: దసరా ప్రమోషన్లలో నాని…

మరి దిల్ రాజు నానిని కాకుండా నితిన్ ను ఈ సినిమా సీక్వెల్ కోసం తీసుకోవడంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే త్వరలోనే ఈ విషయం గురించి అధికారక ప్రకటన వెలవడనుంది. ఇక ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటించిన దసరా సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago