Tag Archives: brs

Kavitha: కవిత అరెస్టు వెనుక ఇంత కథ ఉందా.. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కామెంట్స్ వైరల్!

Kavitha: త్వరలోనే ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఒక్కసారిగా రాజకీయాలలో పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది. కవిత నివాసంలో దాదాపు 4 గంటల పాటు సోదాలు జరిపిన ఈడీ అధికారులు.. మనీలాండరింగ్ కింద కవితను అరెస్టు చేసి తీసుకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే కవిత అరెస్టు రెండు రాష్ట్ర రాజకీయాలలో కూడా సంచలనంగా మారాయి.

పార్లమెంట్ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో కవిత అరెస్టు కావడం వెనుక రాజకీయ కుట్ర ఉందని కాంగ్రెస్ బిజెపిలకు కలిసి ఈ కుట్రను ప్రోత్సహించాయని బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కవిత అరెస్టు వెనుక ఉన్నటువంటి కారణాలను రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

బిజెపితో పొత్తుకు గతంలో బిఆర్ఎస్ అనుకూలంగా వ్యవహరించలేదు త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి తిరగాలి అంటే కవితను అరెస్టు చేయాల్సిందేనని భావించి తనను అరెస్టు చేశారు తాను గతంలో కూడా ఈ విషయం గురించి పలు సందర్భాలలో మాట్లాడినట్లు ఈయన గుర్తు చేశారు.

కవిత అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమ..
ఒకవేళ బిజెపి పొత్తు కనుక పెట్టుకుంటే బారాసతో పొత్తు పెట్టుకోవాలని లేకపోతే కవిత అరెస్టు అవుతుందని ఈయన గతంలో తెలిపారు అయితే కవిత అరెస్టు వెనక కేవలం రాజకీయ కుట్ర మాత్రమే ఉందని ఈయన వెల్లడించారు. ఇక ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే సమయంలో ఆమెను అరెస్టు చేయడం వెనుక మరే ఇక ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే సమయంలో ఆమెను అరెస్టు చేయడం వెనుక ఇక ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే సమయంలో ఆమెను అరెస్టు చేశారు నాకు తెలుసు ఆమెకు బెయిల్ కూడా ఇవ్వకపోవచ్చు అని ఈయన తెలిపారు.

Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ కు కీలక బాధ్యతలు అప్పగించనున్న కేసీఆర్!

Prakash Raj:bకన్నడ చిత్ర పరిశ్రమ నుంచి నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ప్రకాష్ రాజ్ అతి తక్కువ సమయంలోనే తెలుగు తమిళ హిందీ భాషలలో కూడా ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రకాష్ రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.

ఈ క్రమంలోనే బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈయన టిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో తీసుకెళ్లడం కోసం పార్టీకి బిఆర్ఎస్ గా నామకరణం చేసిన విషయం మనకు తెలిసిందే. తెలంగాణ భవన్ లో డిసెంబర్ 9న మధ్యాహ్నం 1.20 నిమిషాలకు కేసీఆర్ సంతకంతో టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించింది.

ఇకపోతే కెసిఆర్ బిఆర్ఎస్ గా ప్రకటిస్తూ నిర్వహించినటువంటి కార్యక్రమంలో నటుడు ప్రకాష్ రాజ్ ఆకర్షణగా నిలిచారు.గత కొద్దిరోజులుగా ప్రకాష్ బిజెపి ప్రభుత్వం పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత చూపిస్తూ బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి నాయకులు తన పార్టీకి ఎంతో కీలకమని భావించిన కేసీఆర్ నటుడు ప్రకాష్ రాజ్ కి తన
బిఆర్ఎస్ పార్టీలో కీలక పదవి అందించబోతున్నారని టిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.

Prakash Raj: బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా ప్రకాష్ రాజ్..

నటుడు ప్రకాష్ రాజ్ కర్ణాటక లేదా తమిళనాడు రాష్ట్రాలలో బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా ప్రకాష్ రాజ్ ని నియమించనున్నట్లు సమాచారం. ఇకపోతే గత ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో కూడా ఇదే లోకసభ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.