Categories: Political News

“కవిత లిక్కర్ స్కామ్‌ విచారణ ఆపితే BRS ను బీజేపీలో కలిపేస్తామన్నారు..” కేటీఆర్‌పై సీఎం రమేష్ సంచలన ఆరోపణ !

అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తాజాగా తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ, కేటీఆర్‌కు ఎదురుదాడి చేశారు. శనివారం అనకాపల్లిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

BRS will be merged with BJP.” CM Ramesh’s sensational allegation against KTR!

బీఆర్ఎస్-బీజేపీ విలీనం, లిక్కర్ స్కామ్ పై ఆరోపణలు

ముఖ్యంగా, బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు చర్చలు జరిగినప్పుడు కేటీఆర్‌నే ముందుగా అభ్యర్థించారని సీఎం రమేష్ తెలిపారు. “కవితపై లిక్కర్ స్కామ్ విచారణ ఆపితే బీఆర్ఎస్‌ను బీజేపీలో కలుపుతామని చెప్పిన వాడే కేటీఆర్. మా ఇంటికొచ్చి ఇదంతా మాట్లాడిన విషయం మర్చిపోయారా?” అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కోరిక మేరకే బీజేపీ పెద్దలతో తాను మాట్లాడిన విషయాన్ని వెల్లడించారు. అయితే, ఆ సమయంలోనే బీజేపీ నేతలు బీఆర్ఎస్ ఇప్పటికే ముగిసిపోయిన పార్టీ అని తేల్చేసినట్టు చెప్పారు. ఇదంతా నిజం కాదని కేటీఆర్ ధైర్యంగా గుండె మీద చెయ్యిపెట్టి చెప్పగలరా? అని సవాల్ విసిరారు.

అంతేకాక, గతంలో టీడీపీతో కేటీఆర్ పెట్టుకున్న పొత్తు కారణంగానే సిరిసిల్ల నియోజకవర్గంలో కేవలం 300 ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం గురించి కూడా వివరణ ఇవ్వాలంటూ నిలదీశారు.

రిత్విక్ కంపెనీ కాంట్రాక్ట్ ఆరోపణలు, సీఎం రమేష్ వివరణ

ఇక తనపై వచ్చిన రిత్విక్ కంపెనీ కాంట్రాక్ట్ ఆరోపణలపై స్పందిస్తూ, సీఎం రమేష్ వాటిని పూర్తిగా తిప్పికొట్టారు. “రిత్విక్ కంపెనీకి రూ.1660 కోట్ల విలువైన కాంట్రాక్టులు అప్పగించినప్పుడు నన్ను లింక్ చేయడమే నాసమర్థత. నాకు ఆ కంపెనీతో ఎలాంటి సంబంధం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కాంట్రాక్టులు దక్కించుకున్నానని కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవం. మంత్రిగా పదేళ్లు పనిచేసిన ఆయనకు ప్రభుత్వ కాంట్రాక్ట్ విధానాలు తెలియవా?” అని ప్రశ్నించారు. తనపై నిందలు మోపడం మూర్ఖత్వం అని పేర్కొన్నారు.

కేటీఆర్‌కు హెచ్చరిక, బీఆర్ఎస్ పాలనపై ఆరోపణలు

ఈ వివాదం మరింత ఉత్కంఠ రేపేలా సీఎం రమేష్ హెచ్చరికలు కూడా చేశారు. “కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. అవసరం వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అనేక అవకతవకల గురించి బయటపెడతా. పదేళ్ల పాలనలో 7 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు. వాటిలో ఎవరెవరికి కాంట్రాక్టులు వెళ్లాయో, ఏపీ నుంచి ఎన్ని కంపెనీలు ఉన్నాయో నాకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి” అని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో పాత కక్షలు మళ్లీ ముదురుతుండగా, కేంద్ర-రాష్ట్ర రాజకీయాల మధ్య తీవ్ర విమర్శలు, సవాళ్లకు వేదిక అయ్యే అవకాశం కనిపిస్తోంది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago