No one believed me except Pawan Kalyan..: Shruti Haasan
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా శృతి హాసన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ చిత్ర పరిశ్రమల్లో తక్కువ సమయంలోనే ఆమె తనదైన ముద్ర వేసింది. స్టార్ హీరోలందరితో కూడా తక్కువ కాలంలోనే కలిసి నటించిన నటీమణిగా శృతి గుర్తింపు పొందింది. అయితే ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదని, ఆమె తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న అనుభవాలను షేర్ చేసింది.
శృతి హాసన్ తెలిపిన వివరాల ప్రకారం, నటీమణుల మొదటి సినిమాలు ఫెయిల్ అయితే వెంటనే వారికి “ఐరన్ లెగ్” అనే దారుణమైన ట్యాగ్ అంటించడమో, సినిమా ఫలితానికి వారిని బాధ్యుల్ని చేయడమో టాలీవుడ్‌లో సాధారణమైపోయింది. అదే సమయంలో హీరోల విషయంలో మాత్రం అలాంటి విమర్శలు పెద్దగా ఎదురవ్వవు. ఈ విధమైన భేదభావాన్ని తాను కూడా మొదట్లోనే తట్టుకున్నానని ఆమె వెల్లడించారు.
“నాపై నమ్మకంతో ‘గబ్బర్ సింగ్’ సినిమాలో అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, హరీష్ శంకర్ గారికి ఎప్పటికీ కృతజ్ఞతలు. వాళ్లు నన్ను నమ్మకంగా తీసుకున్నారు. నేను అదృష్టవంతురాలినో, లేక దురదృష్టవంతురాలినో అన్న పదాలు నాకిష్టం ఉండవు. నటనంటే ప్రేమ. అదే నన్ను ఇంతవరకూ తీసుకొచ్చింది” అని శృతి హాసన్ తెలిపారు.
తన డెబ్యూ మూవీ ‘3’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా, “కొలవెరి డి” పాట మాత్రం సంచలనంగా మారిందని చెప్పింది. “ఈ రోజు ఓటీటీ, పాన్ ఇండియా ట్రెండ్‌లలో ‘3’ సినిమా వచ్చి ఉంటే, అది పెద్ద హిట్ అయ్యేదన్న నమ్మకం నాకు ఉంది” అని చెప్పింది.
ప్రస్తుతం శృతి హాసన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి ‘కూలీ’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె “ప్రీతి” అనే పాత్రలో కనిపించనుంది. “ఒక మ్యూజిక్ వీడియో పనిలో ఉన్నపుడు దర్శకుడు లోకేష్ కనగరాజ్ కథ చెప్పాడు. స్క్రిప్ట్ విన్న వెంటనే నాకిష్టమైంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు సత్యరాజ్ కుమార్తె పాత్రలో నటిస్తున్నాను. ఇది నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన పాత్ర” అంటూ శృతి హాసన్ తన తాజా ప్రాజెక్ట్ గురించి వివరించింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…