Categories: Political News

‘సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతుంది..’ రోజా వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఫైర్!

అమరావతి: ఆర్కే రోజా వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. సభ్యత, సంస్కారాలు లేకుండా మాట్లాడే వ్యక్తులపై స్పందించాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. అయితే కొంతమంది నేతలు తాము ఎదుర్కొంటున్న రాజకీయ ప్రస్టేషన్‌ను తట్టుకోలేక అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. అలాంటి మాటల వల్ల ప్రజల సానుభూతి పొందవచ్చని కొందరు అనుకుంటున్నప్పటికీ, నిజంగా ప్రజలు వారిని అసహ్యించుకుంటున్నారని అనిత తెలిపారు.

Home Minister Anita fires back at Roja’s comments!

పెద్దిరెడ్డి గన్‌మెన్ సస్పెన్షన్ పై స్పందన

ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్‌మెన్ సస్పెన్షన్ అంశాన్ని ప్రస్తావిస్తూ, మంత్రి అనిత స్పందించారు. గన్‌మెన్‌ అనే వారు వ్యక్తిగత భద్రత కోసం నియమిస్తారని, అలాంటి వారిని అటెండర్‌లా వాడటం పూర్తిగా తప్పని ఆమె ఎత్తి చూపారు. రేపు ఎవరు పెద్దిరెడ్డిపై దాడికి పాల్పడినా, అటువంటి పరిస్థితుల్లో గన్‌మెన్‌ ఎలా రక్షిస్తారని ఆమె ప్రశ్నించారు.

ఉద్యోగులకు స్వేచ్ఛ, రాష్ట్ర ప్రయోజనాలు

తాజాగా ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం యంత్రాంగంలో ఉద్యోగులు ఎవరికీ తోత్తులుగా మారాల్సిన అవసరం లేదని, వారు నిజాయితీగా పని చేయడానికి స్వేచ్ఛ ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంపై దుష్టశక్తుల కన్ను పడకుండా ఉండాలని దేవుడిని కోరుకున్నానని కూడా ఆమె తన మాటల్లో పేర్కొన్నారు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago