Tag Archives: charmi

Vijay Devarakonda: లైగర్ ఫ్లాప్.. నిర్మాతలకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ.. రెమ్యూనరేషన్ వెనక్కిచ్చిన హీరో?

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో పాటు పూరి చార్మిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదలయ్యి హిందీ వెర్షన్ లో బాగానే కలెక్షన్స్ రాబట్టినప్పటికీ మిగిలిన అన్ని భాషలలో కలిపి ఈ సినిమా దాదాపు 50 కోట్ల రూపాయల వరకు నష్టాలను చవిచూస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ నష్టాలను భరించడం కోసం పూరి జగన్నాథ్ తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హీరో విజయ్ దేవరకొండ సైతం ఈ సినిమా లాభాలతో కలిపి ఏకంగా 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు సినిమాలలో వచ్చిన లాభాలను హీరోకి ఇవ్వలేదని అయితే ఆ లాభాలు తనకు వద్దని చెప్పడమే కాకుండా తనకి ఇచ్చిన ఆరు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కూడా వెనక్కి ఇచ్చారని తెలుస్తుంది.

ఈ విధంగా ఈ సినిమా ద్వారా భారీ నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చినట్టు సమాచారం. ఇకపోతే విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని కూడా పూరి జగన్నాథ్ చార్మిలతో కలిసి చేయాల్సి ఉంది.

Vijay Devarakonda: జనగణమన లాభాలలో వాటా..

పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమాని కూడా విజయ్ దేవరకొండతో చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన అనంతరం ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తే అందులో వచ్చే లాభాలను విజయ్ దేవరకొండ తీసుకోనున్నట్లు వెల్లడించారు.ఇలా సినిమా నష్టపోవడంతో నిర్మాతలకు విజయ్ దేవరకొండ అండగా నిలబడడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఫ్లాప్ కావడంతో విజయ్ దేవరకొండ తన తదుపరిచిత్రం ఖుషి, జనగణమన సినిమాలపై దృష్టి పెట్టారు.

Balakrishna-Charmy: ఛార్మీతో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..!అన్నీ చేసేశాకే ఇలా అంటూ..!

Balakrishna-Charmy: నందమూరి నటసింహం బాలయ్య జోష్ మామూలుగా లేదు. ఓ వైపు తను నటించిన అఖండ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించాడు. దీంతో థియేటర్లకు ఆడియన్స్ క్యూ కట్టారు. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. తొలిసారిగా వంద కోట్ల క్లబ్ లో బాలయ్య అఖండ మూవీ చేరింది.

Balakrishna-Charmy: ఛార్మీతో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..!అన్నీ చేసేశాకే ఇలా అంటూ..!

ఇంతకుముందు బోయపాటి- బాలయ్య కాంబినేషన్ లో ఇప్పటికే సింహ, లెజెండ్ సినిమాలు భారీ విజయం సాధించడంతో అఖండపై భారీ అంచానాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే సినిమా భారీ హిట్ అయింది.

Balakrishna-Charmy: ఛార్మీతో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..!అన్నీ చేసేశాకే ఇలా అంటూ..!

ఇదిలా ఉంటే మరోవైపు ఓటీటీలో కూడా బాలయ్య తన సత్తా చూపిస్తున్నారు. ఆహాలో వస్తున్న ‘ అన్ స్టాపబుల్’ భారీ హిట్ అయింది. ఈ షోలో బాలయ్య ఎనర్జీ అల్టిమేట్ గా ఉంది. తాను హోస్ట్ గా చేస్తున్న ఈ షోకు వ్యూస్ కూడా పెరిగాయి. ఇప్పటి వరకు మోహన్ బాబు, , బ్రహ్మ నందం, అనిల్ రావిపూడి, రవితేజ, రాజమౌళి, కీరవాణి, రానా సందడి చేశారు.


తేడా సింగ్ పాత్ర గురించి చర్చ..

తాజాగా లైగర్ టీం.. బాలయ్య అన్ స్టాపబుల్ షోలో సండది చేసింది. జనవరి 14న ఈ షో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమో నెట్ లో హల్చల్ చేస్తోంది. బాలయ్య పంచెకట్టులో వావ్ అనిపించేలా ఉన్నారు. ఇదిలా ఉంటే బాలయ్య.. పైసా వసూల్ సినిమాలోని పాటతో ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాటల గన్ అంటూ దర్శకుడు పూరి జగన్నాథ్ ని పొగిడారు బాలకృష్ణ.  వీళ్ల కాంబినేషన్లో వచ్చిన ‘పైసా వసూల్’ సినిమాలోని తేడా సింగ్ పాత్ర గురించి చర్చించుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య పూరీని లయన్ అని.. ఛార్మిని టైగర్ అని.. మీ ఇద్దరిద్దనీ కలిపితే.. ‘లైగర్’ అని చెప్పారు. ఇక ఆ తరువాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చాడు. బాలయ్య.. విజయ్ తో సరదాగా బాక్సింగ్ కూడా చేశారు.

ఛార్మి విషయంలో నాకు కోపం వచ్చింది అందుకే.. పవన్ కళ్యాణ్ కామెంట్స్!

మాయగాడు సినిమా షూటింగ్ అయిపోయాక దానికి సంబంధించి హీరోయిన్ ఛార్మి ప్రమోషన్‌కి రానన్నారని ప్రముఖ నిర్మాత యలమంచిలి రవి అన్నారు. ప్రమోషన్‌కు రాకపోతే ఎలా అనే విషయంపై ఆమెతో కొంచెం గొడవ పడాల్సి వచ్చిందని, ఆ తర్వాత పెద్దలైన మురళీ మోహన్ ద్వారా అది సద్దుమణిగిపోయిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆమె ప్రమోషన్‌కు హాజరయ్యారని ఆయన చెప్పుకొచ్చారు. రెమ్యునరేషన్‌ విషయంలోనూ ఆమెకు, తనకు ఎలాంటి విబేధాలు లేవన్న ఆయన, అమౌంట్ మొత్త ఇచ్చేశామని అయినా కూడా ఆమె సినిమా పబ్లిసిటీ చేయడానికి నిరాకరించారని ఆయన వివరించారు.

ఇంత చేసి, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి సినిమా ప్రమోషన్‌కు రాకపోతే ఎలా సినిమా ఏమవుతుంది ? ప్రొడ్యూసర్ ఏమవుతాడు ? అని ఆలోచించి ఆ సమయంలో కొంచెం అగ్రెసివ్‌గా ఉండాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఆ తర్వాత మా అసోసియేషన్‌లో చెప్పేసరికి, మురళీ మోహన్‌ గారు చర్చించి సమస్యను పరిష్కారం చేశారని ఆయన చెప్పారు.

ఇకపోతే ఏపీ ప్రభుత్వం థియేటర్స్‌పై తీసుకున్న నిర్ణయంపై నిర్మాత యలమంచిలి రవి స్పందించారు. తన దృష్టిలో చెప్పాలంటే ఆ జీవో తప్పా, ఒప్పా అనేది పక్కన పెడితే ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేసుకునే విధానంలో వైఫల్యం జరిగిందని ఆయన అన్నారు. వ్యాపారం.. వ్యాపారంలా చేయాలన్న ఆయన, ప్రభుత్వాన్ని ఒక ప్రెస్‌మీట్‌లో కూర్చొని ఏదో ఆలోచిస్తే వారు వ్యాపారం ఎందుకు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఎవరికి అవసరం ఉంటే వాళ్లు వెళ్లాలి కదా అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇంతకు ముందు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వారంలో ఇండస్ట్రీ నుంచి ఒకరు వెళ్లి బొకే ఇచ్చి, శాలువ కప్పి కలిసొచ్చేవారని, అలా జగన్ అధికారంలోకి వచ్చాక ఎవరైనా వెళ్లారా అని ఆయన అన్నారు. అది వాళ్లు కూడా మనసులో పెట్టుకోరా అని ఆయన ప్రశ్నించారు.

ఇకపోతే పవన్ కల్యాణ్ ఈ జీవోపై స్పందించినా అవసరం ఇండస్ట్రీది కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటే అవుతదా లేదంటే ప్రెస్‌మీట్‌లు పెడితే అవుతదా అని ఆయన డైరక్ట్‌గానే ప్రశ్నలు కురిపించారు. రాజకీయ పార్టీ రాజకీయమే చేస్తుందని, మా అసోసియేషన్‌లో మొన్న అంత రాజకీయం జరిగింది. కానీ దాని వల్ల ఎవరికైనా ప్రయోజనముందా అని ఆయన అన్నారు.