Tag Archives: cricket

IPL 2024: ప్రపంచ కప్ హీరోలపై దృష్టి పెట్టిన ఐపీఎల్ ప్రాంచైజీలు… ఆసీస్ పైనే పూర్తి దృష్టి?

IPL 2024: ఐపీఎల్ 2024 కోసం ఇప్పటికే అన్ని జట్టులో సిద్ధమవుతున్నాయి. అయితే త్వరలోనే ఐపీఎల్ సీజన్ కోసం దుబాయ్ లో వేలం జరగనుంది ఈ క్రమంలోనే ప్రపంచ కప్ క్రికెట్లో పెద్ద ఎత్తున పోటీపడి ఆట తీరును కనబరిచిన ఆటగాళ్లపైన ఈసారి ప్రాంచైజీలు పూర్తి దృష్టి పెట్టాయని తెలుస్తుంది. ఈ ఐపీఎల్ కోసం ఈ నెల 19వ తేదీ వేలం జరగబోతుంది.

అందుతున్న సమాచారం ప్రకారం దుబాయిలో జరగబోయే ఈ వేలం పాటలో పెద్ద ఎత్తున కాసుల వర్షం కురిపించబోతున్నారని తెలుస్తుంది.ముఖ్యంగా ప్రపంచ కప్ 2023లో అద్భుత ప్రదర్శన చేసే ఆటగాళ్లపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేశాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లపై అందరూ చూపు పడిందని తెలుస్తుంది. ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ ను తమ జట్టులోకి తీసుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి.

భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శన చేశాడు. అలాగే భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర కూడా ప్రపంచ కప్ పోటీలలో అద్భుతమైన ఆట తీరును కనబరిచారు ఈయన కోసం కూడా ఫ్రాంచైజీలు తెగ పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్  సారథ్యంలో ఆరోసారి ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచింది దీంతో ఈయనపై కూడా ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించబోతున్నాయని తెలుస్తోంది.

వరల్డ్ కప్ ఆటగాళ్లపై కాసుల వర్షం..

న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ప్రపంచకప్‌లో టీమిండియా, న్యూజిలాండ్‌లు 2 సార్లు తలపడ్డాయి. లీగ్ రౌండ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం సాధించింది. ఈ ఐపీఎల్ వేలంలో డారెల్ మిచెల్‌ భారీ ధర పలకవచ్చు. వీరితో పాటు గెరాల్డ్ కోయెట్జీ, ట్రావిస్ హెడ్ తదితర ఆటగాళ్ల పై భారీ స్థాయిలోనే ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన పనిలేదు…. నెగిటివ్ ట్రోల్స్ పై ఘాటుగా సమాధానం చెప్పిన తమన్!

Thaman: తెలుగు సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తమన్ ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తన సినిమాల పరంగా తీవ్ర స్థాయిలో నెగిటివ్ ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా తన గురించి ఎలాంటి విమర్శలు వచ్చినా ఎప్పటికప్పుడు ఆ విమర్శలపై స్పందిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్రో సినిమా నుంచి పాట విడుదలైన సంగతి మనకు తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ అంటే స్టార్ హీరోకి పెట్టాల్సిన సాంగ్ కాదంటూ తమన్ పై భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రమోషన్లలో భాగంగా తమన్ స్పందిస్తూ ఈ విమర్శలపై ఘాటుగా స్పందించారు.

తన గురించి ఎన్నో విమర్శలు వస్తున్నప్పటికీ తాను వాటన్నింటినీ ప్రశంసలుగానే స్వీకరిస్తానని తెలిపారు. అయితే ఈ సినిమాలో ఈ పాట అక్కడ పెట్టడం కరెక్ట్ అని భావించే పెట్టామని అయినా ఇది పవన్ కళ్యాణ్ సాంగ్ కాదని సాయి ధరమ్ తేజ్ సాంగ్ అంటూ క్లారిటీ ఇచ్చారు.అంతేకాకుండా తన గురించి చాలామంది విమర్శలు చేస్తున్నారు తాను మ్యూజిక్ పై ఫోకస్ చేయకుండా క్రికెట్ పై ఫోకస్ చేస్తున్నానని కామెంట్స్ చేస్తున్నారు.

Thaman: క్రికెట్ నా వ్యసనం…


నిజానికి నాకు ఎలాంటి వ్యసనాలు లేవు నా వ్యసనం క్రికెట్ మాత్రమేనని తెలిపారు. అది కూడా నేను రాత్రి 9 తర్వాత మాత్రమే క్రికెట్ ఆడటానికి వెళ్తానని నా పనులు మానుకొని క్రికెట్ ఆడటానికి వెళ్లలేదని తెలిపారు.ఈ విషయం గురించి ఏ దర్శకుడు గానీ నిర్మాత గానీ ఇప్పటివరకు నాపై ఫిర్యాదు చేయలేదు అలాంటప్పుడు నేను ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పుకోవాల్సిన పనిలేదు అంటూ క్రికెట్ ఆడటానికి వెళ్తారు అంటూ విమర్శించే వారికి తన స్టైల్ లో సమాధానం చెప్పారు.

Sr. NTR: బ్యాట్ చేతపట్టి క్రికెట్ ఆటలో అదరగొట్టిన సీనియర్ ఎన్టీఆర్… వైరల్ అవుతున్న వీడియో!

Sr. NTR: మనదేశంలో క్రికెట్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. గత కొన్ని వందల సంవత్సరాలుగా క్రికెట్ ఆటపై తమ అభిమానాన్ని కనపరుస్తూ ఉన్నారు.అయితే క్రికెట్ కేవలం క్రికెటర్స్ మాత్రమే కాకుండా సినీ సెలబ్రిటీల మధ్య కూడా సీసీఎల్‌ లీగ్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే గత 40 సంవత్సరాలుగా సెలబ్రిటీల మధ్య సీసీఎల్‌ జరిగి ఇందులో వచ్చిన డబ్బులను పలు చారిటీ ట్రస్టులకు విరాళంగా అందిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే 1978 సంవత్సరంలో జరిగినటువంటి సీసీఎల్‌ మ్యాచ్ కు సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పట్లో టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ మధ్య ఈ లీగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఇందులో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఎన్టీఆర్, ఏఎన్నార్, అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు వాటి ఎంతోమంది నటులు పాల్గొన్నారు.

ఇక బాలీవుడ్ సెలబ్రిటీల కూడా ఈ సీసీఎల్‌ లో పెద్ద ఎత్తున పోటీకి దిగారు. అయితే ఈ వీడియోలో ఎన్టీఆర్ బ్యాట్ చేతబట్టి ఓ రేంజ్ లో క్రికెట్ అదరు కొట్టాడని తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బౌలింగ్ వేయగా సీనియర్ ఎన్టీఆర్ తన బ్యాట్ కు పని చెప్పారు.

Sr. NTR: అమితాబ్ బౌలింగ్ కి బ్యాటింగ్ చేసిన ఎన్టీఆర్..

ఇలా ఎన్టీఆర్ ఓ రేంజ్ లో క్రికెట్ ఆడుతూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈయన పరుగులు పెట్టే విషయంలో కూడా ఎన్టీఆర్ తన మేనరిజం చూపించారు.ప్రస్తుతం అప్పటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా వీరి క్రికెట్ పై ఓ లుక్ వేసెయ్యండి.

MS Dhoni: గిల్ క్రిస్ట్ ను బౌండరీ వరకు పరుగులు పెట్టించిన ధోని… అసలేం జరిగిందంటే?

MS Dhoni: భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని ఆట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యద్భుతమైన కెప్టెన్, టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనుడు, ఫినిషర్ గా ఎన్నో రికార్డులు అందించిన ఘనత ధోనీకి చెల్లుతుందని చెప్పాలి. ఇలా ఇండియాని ముందుకు నడిపించడంలో ధోని ఎన్నో వినూత్నమైన నిర్ణయాలు తీసుకుంటారు.

సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ధోనికి ఎవరు సాటిరారు.ధోనీ మైండ్ లో ఏముంటుంది అనేది తెలుసుకోవడం ఎవరి తరం కాదు. ఇలా ధోని తీసుకున్న నిర్ణయంతో ఒకసారి రిక్కీ పాంటింగ్ బకరాని చేయక అదే మ్యాచ్లో గిల్ క్రిస్ట్ బౌండరీ వరకు పరిగెత్తించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అప్పటి వీడియో వైరల్ గా మారింది.

గతంలో ఆస్ట్రేలియా టూర్ కి వెళ్లిన సందర్భంగా ఓ మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న ధోనీని కట్టడి చేసేందుకు రికీ పాంటింగ్ 8 మంది ఫీల్డర్స్ ని మోహరించాడు. ఎక్కువగా ఆఫ్ సైడ్ ఆడే ధోనీ ఏం చేస్తాడా అని స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ధోని ఏం చేస్తారని ఆత్రుతగా చూస్తున్నారు.ఇక జాన్సన్ ఆఫ్ సైడ్ వేసిన బంతిని.. ఫ్రంట్ ఫుట్ కు వచ్చి ఆడిన ధోనీ లైగ్ సైడ్ కొట్టాడు.

MS Dhoni: గిల్ క్రిస్ట్ పై అసహనం వ్యక్తం చేసిన పాంటింగ్…

అటువైపు ఫీల్డ్స్ ఎవరూ లేకపోవడంతో వికెట్ కీపర్ గా ఉన్నటువంటి గిల్ క్రిస్ట్ బౌండరీ వరకు పరుగెత్తి బాల్ పట్టుకున్నాడు. అయితే అదే సమయంలోనే ధోని ఏకంగా మూడు పరుగులు చేశారు. దీంతో పిచ్చెక్కిపోయినా రికీ పాంటింగ్ ఎందుకు పరిగెత్తావు అంటూ గిల్ క్రిస్ట్ పై అసహనం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Urvashi Rautela: ఆ క్రికెటర్ ప్రేమిస్తున్నాడంటూ కామెంట్స్ చేసిన ఊర్వశి రౌతెలా.. అక్క నన్ను వదిలేయ్ అంటూ క్రికెటర్ కౌంటర్?

Urvashi Rautela: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా గురించి పరిచయం అవసరం లేదు.బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న ఈమె సమయం చూసి ఓ క్రికెటర్ తనని ప్రేమిస్తున్నాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడిప్పుడే ఇండియన్ క్రికెట్ టీం లో అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్ గా పేరు సంపాదించుకున్నారు క్రికెటర్ రిషబ్ పంత్.

ఇలా సమయం చూసి ఊర్వశి రిషబ్ పంత్ తనని ప్రేమిస్తున్నాడు అంటూ ఈమె చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె రిషబ్ పంత్ పేరు ప్రస్తావించకుండా ఆర్పి అంటూ తన గురించి వెల్లడించారు.

ఈ విధంగా నటి ఊర్వశి క్రికెటర్ తనని ప్రేమిస్తున్నాడు అంటూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఈ వీడియో క్రికెటర్ రిషబ్ పంత్ స్పందిస్తూ నటి ఊర్వశి పేరు ప్రస్తావించకుండా అక్క నన్ను వదిలేయ్ అంటూ ఈమెపై పరోక్షంగా దాడి చేశారు.ఊర్వశి పేరు బయటకు చెప్పకుండా అక్క అంటూనే కొందరు వారికి పబ్లిసిటీ కోసం మరికొందరి పేర్లను వాడుకుంటూ ఉన్నవి లేనట్టు చెబుతుంటారు అని ఈయన పరోక్షంగా ఆమె వీడియో పై స్పందిస్తూ కౌంటర్ వేశారు.

Urvashi Rautela: అక్క అని సంబోధించిన క్రికెటర్..

మొత్తానికి క్రికెటర్ రిషబ్ పంత్ అక్క అంటూ కామెంట్ చేయడంతో వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని అయితే నటి ఊర్వశి కేవలం తన పబ్లిసిటీ కోసమే తన పేరును ఉపయోగిస్తుంది అంటూ పలువురు భావిస్తున్నారు. మొత్తానికి ఈయన ఊర్వశి వీడియో పై స్పందిస్తూ తనకు భారీ కౌంటర్ వేశారని పలువురు భావిస్తున్నారు.

IPL 2022: మొదలైన ఐపీఎల్ వేలం.. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితా ఇదే..!

IPL 2022: ఐపీఎల్ వేలం షురూ అయింది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. పలు ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లను దక్కించుకోవడానికి పోటీపడ్డాయి. ఈ వేలంలో ఎక్కువగా అందరి కళ్లు టీమిండియా ఆటగాడు శ్రీయాస్ అయ్యర్ పై పడ్డాయి. అనుకున్నట్లుగానే అతడు భారీ ధరకు అమ్ముడుపోయాడు. కోల్ కత్తా నైట్ రైడర్స్ (KKR) అతడిని భారీ ధరకు దక్కించుకుంది.

IPL 2022: మొదలైన ఐపీఎల్ వేలం.. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితా ఇదే..!

శ్రీయాస్ కు దాదాపు రూ.12.25 కోట్లను వెచ్చించి కొనుకున్నాడు. అతడితో పాటు సౌతాఫ్రికా స్పీడ్ స్టర్ కగిసో రబాడ కూడా భారీ ధరకు అమ్ముడుపోయాడు. దాదాపు రూ.9.25 కోట్లను వెచ్చింది. అతడిని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ దక్కించుకుంది. ఇక వీరితో పాటుగా.. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ రూ. 8.52 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. కోల్ కత్తా నైట్ రైడర్స్ మరో ఆటగాడిని భారీ మొత్తంలో వెచ్చించి కొనుక్కుంది.

IPL 2022: మొదలైన ఐపీఎల్ వేలం.. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితా ఇదే..!

అంతే కాకుండా.. కమిన్స్ కు రూ.7.25 కోట్లను ఇచ్చి దక్కించుకుంది. బౌలర్ బౌల్ట్ ను రూ.8 కోట్లు వెచ్చించి రాజస్థాన్ రాయల్స్ దక్కించుకోగా.. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను రూ.5 కోట్లను వెచ్చించి కొనుక్కుంది.

ఇండియన్ పేసర్ మహ్మద్ షమిని రూ.6.25 కోట్లతో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలో సౌతాఫ్రికా సీనియర్ బ్యాట్స్ మెన్ ఫాఫ్ డెప్లెసిస్ ను రూ.7 కోట్లకు దక్కించుకుంది. మొన్నటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు ఆడిన ఆస్ట్రేలియా డాషింగ్ ఒపెనర్ డేవిడ్ వార్నర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అతడికి రూ.6.25 కోట్లను వెచ్చించారు. ఇక లక్నో టీమ్ విషయానికి వస్తే.. అందులో ప్రొటీస్ ఒపెనర్ గా ఉన్న డికాక్ రూ.6.75 కోట్లకు అమ్ముడుపోయాడు. ఇక ఇప్పటి వరకు జరిగిన ఈ ఐపీఎల్ 2022 వేలంలో ఇవే అత్యధికంగా అమ్ముడుపోయిన ఆటగాళ్లు.

వేలంలో అపశ్రుతి..

ఇదంతా ఇలా ఉండగా.. ఐపీఎల్ వేలం జరుగుతున్న సమయంలో ఆక్ష‌నీర్ హ్యూ ఎడ్మెడ్స్ వేలం మ‌ధ్య‌లో కుప్ప‌కూలాడు. దాంతో వేలం నిలిచిపోయింది. శ్రీలంక ఆల్‌రౌండ‌ర్ హ‌స‌రంగను వేలం పాడుతుండ‌గా… ఉన్న‌ట్లుండి హ్యూ ఎడ్మెడ్ కింద ప‌డిపోయారు. అతడికి వెంటనే ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతవ వేలం వాయిదా పడగా.. మళ్లీ సాయంత్రం మొదలు కానుంది.

India-West Indies: సిరీస్ పై గురి పెట్టిన టీమిండియా..! నేడు వెస్టిండీస్ తో ప్రారంభం కానున్న రెండో వన్డే.. !

India-West Indies: టీమిండియా సిరీస్ విజయంపై కన్నేసింది. వెస్టిండీస్ తో జరుగున్న ద్వైపాక్షిక సిరీస్ ను దక్కించుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరగిన తొలి వన్ డేలో భారత్ ఘనవిజయం సాధించింది.

India-West Indies: సిరీస్ పై గురి పెట్టిన టీమిండియా..! నేడు వెస్టిండీస్ తో ప్రారంభం కానున్న రెండో వన్డే.. !

ఏ దశలోనూ వెస్టిండీస్ టీమ్, టీమిండియా ముందు నిలవలేకపోయింది. దీంతో చారిత్రక వన్ డేలో భారత్ విజయం సాధించింది.  నేడు వెస్టిండీస్ తో రెండో వన్ డేలో తలపడనుంది భారత్. ఇప్పటికే తొలి వన్ డే విజయంతో రోహిత్ సేన రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్ లో ఉన్నాడు.

India-West Indies: సిరీస్ పై గురి పెట్టిన టీమిండియా..! నేడు వెస్టిండీస్ తో ప్రారంభం కానున్న రెండో వన్డే.. !

తొలి వన్ డేలో హాఫ్ సెంచరీ సాధించాడు. మరోవైపు భారత బౌలర్లు కూడా సూపర్ బౌలింగ్ చేశారు. ముఖ్యంగా స్పిన్ విభాగం చాలా పటిష్టంగా కనిపించింది. తొలి వన్ డేలో భారత స్పిన్ బౌలింగ్ ఎదురుకోలేక.. వెస్టిండీస్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. భారత స్పిన్ ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడారు. 

రెండో వన్ డే కూడా తొలి వన్ డే జరిగిన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరుగనుంది. దీంతో పిచ్ ఈ రోజు కూడా స్పిన్ కు సహకరించే అవకాశం ఉంది. అయితే రోహిత్ శర్మతో ఎవరు ఓపెనింగ్ కు వస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే కేఎల్ రాహుల్ కూడా అందుబాటులోకి వచ్చారు. అయితే తుది జట్టులోకి తీసుకుంటారా లేదా..ఒక వేళ రాహుల్ ని తుది జట్టులోకి తీసుకోకుంటే… అనేదానిపై స్పష్టత రావాలి. ఇషాంత్ కిషన్ తో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను ఓపెన్ చేసే అవకాశం ఉంది. 


తుది జట్లు (అం చనా)

భారత్: రోహిత్ (కెప్టెన్ ), రాహుల్, కోహ్లీ, పంత్, సూర్య కుమార్, దీపక్ హుడా, సుందర్, శార్దూల్, సిరాజ్, చాహల్, ప్రసిద్ధ్ కృ ష్ణ
వెస్టిం డీస్: పొలార్డ్ (కెప్టెన్ ), హోప్, బ్రాండన్, బ్రావో, బ్రూక్స్ , పూరన్, హోల్డర్ , అలెన్, అకీల్, అల్జారీ, రోచ్

Indian Premier League: ఐపీఎల్ వేలానికి పేరు నమోదు చేసుకున్న బెంగాల్ మంత్రి..! వివరాల్లోకి వెళ్తే..

Indian Premier League: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) కోసం క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా గత రెండు సీజన్లు దుబాయ్ వేదికగా జరగడంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. తాజాగా ఈ ఐపీఎల్ మాత్రం ఇండియాలోనే జరగుతున్నట్లు బీసీసీఐ ఇదివరకే క్లారిటీ ఇచ్చింది. 

Indian Premier League: ఐపీఎల్ వేలానికి పేరు నమోదు చేసుకున్న బెంగాల్ మంత్రి..! వివరాల్లోకి వెళ్తే..

దీనికోసం త్వరలో ఐపీఎల్ కొత్త సీజన్ కోసం ఆటగాళ్ల వేలం కూడా ప్రారంభం అయింది. ఇప్పటికే అన్ని జట్లు తమ స్ట్రాటజీలతో ఉన్నాయి. ఏ ప్లేయర్ ను తీసుకోవాలనే క్లారిటీతో ఉన్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్ జట్టు వేళంపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చెన్నైకి చేరుకున్నాడు. ఇతర జట్ల యాజమాన్యాలు కూడా ప్లేయర్ల వేలంపై కసరత్తు చేస్తున్నాయి. 

Indian Premier League: ఐపీఎల్ వేలానికి పేరు నమోదు చేసుకున్న బెంగాల్ మంత్రి..! వివరాల్లోకి వెళ్తే..

తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. వెస్ట్ బెంగాల్ మంత్రి, త్రుణమూల్ కాంగ్రెస్ నేత మనోజ్ తివారీ కూడా ఈసారి ఐపీఎల్ వేలంలో నిలవనున్నారు. తన పేరును వేలం కోసం నమోదు చేసుకున్నాడు. క్రికెట్ అయిన మనోజ్ తివారీ గతేడాది బెంగాల్ ఎన్నికల్లో త్రుణమూల్ కాంగ్రెస్ తరుపున శిభ్ పూర్ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువతా మమతా బెనర్జీ మంత్రి వర్గంలో క్రీడల శాఖ మంత్రి పనిచేస్తున్నాడు.


మొత్తం 12 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ లు..

ప్రస్తుతం వేలంలో పేరు నమోదు చేసుకున్న మనోజ్ తివారీ.. తన ప్రారంభం ధరను రూ. 50 లక్షలుగా పేర్కొన్నాడు. గతంలో ఇండియా తరుపున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాడు. మొత్తం 12 వన్డేలు, 3 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్ టోర్నీలో కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రైజింగ్ పూణే జాయింట్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.

క్రికెట్ అభిమానులు పండగ చేసుకునే వార్త.. ఏంటంటే..

గత కొన్ని రోజుల నుంచి క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఐపీఎల్ మొదలైన దగ్గర నుంచి అభిమానులు సందడి చేస్తున్నారు. ఐపీఎల్ అయిపోగానే వెంటనే టీ20 వరల్డ్ కప్ వచ్చింది. తర్వాత వెంటనే మళ్లీ న్యూజిలాండ్ తో టీ20 మరియు టెస్టు ఆడనున్నారు. 2022 ఆస్ట్రేలియా వేదికగా మరో టీ20 వరల్డ్ కప్ సమరం ఉండనుంది.

మళ్లీ మరుసటి సంవత్సరం 2023 లో వన్డే వరల్డ్ కప్ మన భారతదేశం వేదిక కానుంది. అయితే తాజాగా 2024లో నిర్వహించే క్రికెట్ కు సంబంధించి 8 ఐసీసీ టోర్నమెంట్ల వేదికలను ఐసీసీ తాజాగా ప్రకటించింది. 14 దేశాల్లో ఈ టోర్నమెంట్లు జరుగనున్నట్లు ట్విట్టర్ వేదిక ద్వారా ప్రకటించారు. 2024 టీ 20 వరల్డ్‌ కప్‌ యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ లో జరుగనుంది.

2025 చాంపియన్‌ ట్రోపికి పాకిస్తాన్‌ వేదిక కానుంది. ఇక 2026 టీ20 వరల్డ్‌ కప్‌ ఇండియా, శ్రీలంక లో జరుగనుంది. ఇక 2027 వరల్డ్‌ కప్‌ కు సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలు కానున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించారు. అలాగే… 2028 టీ20 వరల్డ్‌ కప్‌ ఆసీస్‌, న్యూజిలాండ్‌ దేశాలు వేదికలు కానున్నాయి. 2029 లో చాంపియన్‌ ట్రోఫికి ఇండియా వేదిక కానుంది.

2030 టీ 20 వరల్డ్‌ కప్‌కు ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ లు వేదికలు కానున్నాయి. 2031 వరల్డ్‌ కప్‌ కు ఇండియా, బంగ్లా దేశ్ దేశాలు వేదికలు కానున్నాయి. ఈ కొత్త వేదికలు.. టైం టేబుల్ లతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ షెడ్యూల్ ప్రకారమే వారి వారి వ్యక్తిగత పనులను చేసుకునేందుకు అవకాశం ఉండనుంది.

తలుపు తట్టిన అదృష్టం.. రూ. కోటి గెలుచుకున్న ప్లంబర్.. ఎలా అంటే..?

అదృష్టం ఎటు నుంచి తలుపు తడుతుందో తెలియదు. అప్పడే మనం వాటిని అందుకోవాలి.. లేదంటే మరో సారి ఆ అవకాశం రాదు. ఏం చేసినా.. అదృష్టం ఉండాలి అని అంటుంటారు.. ఇది నిజమే. ఎంత కష్టం చేసినా కాస్తంత అదృష్టం ఉంటే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. లేక పోతే ఎక్కడ నుంచి జీవితం మొదలు పెట్టామో అక్కడే ఉంటాం. అయితే ఇలాంటి లక్ తో ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.

అతడికి లాటరీ తగిలింది అనుకుంటున్నారా.. కాదు.. అతడు క్రికెట్ బెట్టింగ్ లో రూ.కోటి గెలుచుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్ బెట్టింగ్ అంటే ముఖ్యంగా డ్రీమ్ 11 గుర్తుకు వస్తుంది. దీనిలో పాల్గొనే వారు తనకంటూ ఉన్న 22 మంది టీమ్ సభ్యుల్లో 11 మందిని ఎంచుకొని అందులో బెట్టింగ్ పెడతారు.ఇలా అతడు ప్రెడిక్ట్ చేసిన ఓ ప్లంబర్ ఏకంగా రూ.కోటి గెలుచుకున్నాడు.

అందులో రూ.30 లక్షలు ట్యాక్స్ కింద పోగా.. రూ.70 లక్షలు తన అకౌంట్లో పడ్డాయని చెప్పుకొచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌లోని కటిహార్‌ జిల్లా మనిహారీకి చెందిన బబ్లూ మండల్‌ హంస్‌వర్‌ గ్రామంలో ప్లంబింగ్‌ పనులు చేస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. అతడికి తన స్నేహితుడు ఈ డ్రీమ్ 11 గురించి చెప్పాడట.

ఎలా ఆడాలో అతడే నేర్పించాడు. దీంతో మొదటి నుంచి అతడు రూ.200 తో బెట్టింగ్ మొదలు పెట్టాడు. అయితే మొన్న క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌పై అంటే చెన్నై మరియు ఢిల్లీపై బెట్టింగ్ పెట్టాడు. కోటి రూపాలయలు గెలుచుకున్నాడు. వచ్చిన డబ్బులతో ఓ ఇల్లు కట్టుకుంటానని.. మిగిలిన డబ్బులతో దేవాలయానికి విరాళంగా ఇస్తానన్నాడు.