Rishabh Pant has a serious injury. Will he come to bat? Sai Sudarshan's key comments!
మాంచెస్టర్, ఇంగ్లాండ్: ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడడంతో అభిమానులు ఆందోళనకు లోనవుతున్నారు. మ్యాచ్ తొలి రోజు ఆటలో, ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌కు ఎదురైన సమయంలో పంత్ ఒక బంతిని రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ బంతి బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకొని నేరుగా అతడి కుడిపాదానికి బలంగా తాకింది.
దీంతో పంత్ తీవ్ర నొప్పితో క్రీజులోనే కుప్పకూలిపోయాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి ప్రాథిక చికిత్స అందించినా ఉపయోగం లేకుండా పోయింది. అతడి కుడిపాదం బాగా వాపు చెందినదిగా, రక్తస్రావం జరుగుతున్నట్లు కనిపించింది. పరిస్థితి మరింత గంభీరంగా మారడంతో, గోల్ఫ్ కార్ట్ సహాయంతో మైదానం వెలుపలికి తీసుకువెళ్లారు. రిటైర్డ్ హర్ట్ అయ్యే సమయానికి పంత్ 37 పరుగులు చేశాడు.
ఈ పరిణామం భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌ల్లో అదిరిపోయే ఫామ్‌లో ఉన్న పంత్ గాయపడటం టీమ్ ప్లాన్‌ను తీవ్రంగా ప్రభావితం చేయొచ్చు. రెండో రోజు పంత్ క్రీజులోకి తిరిగి రాకపోతే భారత్ స్కోరుపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.
ఈ గాయంపై టీమిండియా యువ ఆటగాడు సాయి సుదర్శన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పంత్ తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు. గాయంపై స్పష్టత కోసం స్కానింగ్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వెల్లడించాడు. రాత్రికి నొప్పి తగ్గవచ్చునన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, గురువారం ఉదయానికి పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుందని తెలిపారు.
“మాంచెస్టర్‌లో పంత్ చక్కగా ఆడాడు. కానీ అతడు మళ్లీ బ్యాటింగ్‌కు రాకపోతే, అది మాకు పెద్ద లోటు. జట్టు స్కోరుపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. అయినప్పటికీ మేమంతా మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఎక్కువసేపు క్రీజులో ఉండేందుకు, మంచి స్కోర్ నమోదు చేయడానికి కృషి చేస్తున్నాం,” అని సాయి సుదర్శన్ పేర్కొన్నాడు.
మ్యాచ్ పరిస్థితుల పరంగా చూస్తే, తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (19), శార్దూల్ ఠాకూర్ (19) లు క్రీజులో నిలిచారు. బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్ (61), యశస్వి జైస్వాల్ (58) అర్థశతకాలతో రాణించగా, కేఎల్ రాహుల్ (46) కూడా కీలక ప్రదర్శన ఇచ్చాడు. అయితే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాత్రం కేవలం 12 పరుగులకే వెనుదిరిగాడు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…