Political News

Roja Vs Pawan : వామ్మో అంత మాట అనేసిందేంటి..? ఏపీ రాజకీయాల్లో పవన్-రోజా మాటల యుద్ధం..!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇటీవల మరోసారి వేడెక్కాయి. హరిహర వీరమల్లు సినిమా విడుదల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, అలాగే వైసీపీ నేత రోజా ఇచ్చిన కౌంటర్‌ వివాదాస్పదంగా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు ఎగిసిపడుతున్నాయి.

Pawan-Roja war of words in AP politics..!

రోజా సంచలన వ్యాఖ్యలు: “పవన్ పిచ్చి ముదిరింది”

ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్‌కే రోజా, పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు “పిచ్చి ముదిరింది” అంటూ విమర్శించారు. “ఎక్కడికెళ్లినా తాను అక్కడ పుట్టానంటాడు. అసలాయన ఎక్కడ పుట్టాడు? ఏం చదివాడు? ఆయనకే తెలియదు” అంటూ ఎద్దేవా చేశారు. రోజా వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో తీవ్ర ప్రతిస్పందనను రేపాయి.

పవన్ కౌంటర్: “బావిలో ఉన్న కప్పలు”

దీనికి కౌంటర్‌గా, విశాఖపట్నంలో జరిగిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ స్పందించారు. “నా పేరు పవనం. నేను తిరుగుతుంటాను. పవనాలు తిరుగుతుంటాయి. కానీ మీరు బావిలో ఉన్న కప్పలు” అంటూ కాస్త తూర్పు శైలిలో, అందరికీ అర్థమయ్యేలా, వైసీపీ నేతలపై చురకలేసారు.

రోజా ‘అపానవాయువు’ ట్వీట్, జనసేన ఆగ్రహం

ఈ కామెంట్లపై స్పందించిన రోజా కూడా, ట్విట్టర్ వేదికగా పవన్‌కు తిరుగుబాటు లాంటి స్పందననే ఇచ్చారు. “అపానవాయువు అంతటా ఉంటుంది కానీ ఏమి లాభం?” అనే ట్వీట్ ద్వారా ఆమెలో ఉన్న వ్యంగ్యాన్ని మరోసారి బయటపెట్టారు. ఇది కూడా ఇన్‌డైరెక్ట్‌గా పవన్‌ను ఉద్దేశించిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే రోజా చేసిన ఈ ట్వీట్‌పై జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “అపానవాయువు అంటే పిత్తు. పవన్ కళ్యాణ్‌ను అలాంటి పదాలతో పోల్చడం ఏం న్యాయం?” అంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, ఇంత దారుణంగా దిగజారి మాట్లాడడం దారుణమని ఫైర్ అవుతున్నారు.

ఈ వివాదంలో మరో ఆసక్తికర విషయం ఏంటంటే, రోజా చేసిన ట్వీట్‌కి కామెంట్స్‌ చేసేందుకు వీలుండకుండా ఆమె కామెంట్స్ సెక్షన్‌ను డిసేబుల్ చేయడం. ఇది ఆమె విమర్శలకు తగిన స్పందనలను ఎదుర్కొనకుండా తప్పించుకునే ప్రయత్నంగా భావిస్తున్నారు.

రాజకీయ దుమారం

సినిమా ప్రొమోషన్ వేదికగా మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు రాజకీయ వేదికపై పెద్ద దుమారంగా మారింది. ఇది ఇకపై ఏ స్థాయికి వెళ్తుందో వేచి చూడాల్సిందే.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago