Tag Archives: December

డిసెంబర్ నెలలో థియేటర్లో సందడి చేసే సినిమాలు ఇవే.. ఓ లుక్కేయండి..

2021 చివరి నెల బాక్సాఫీస్ వద్ద సంచలనం స్పష్టించనుంది. నందమూరి బాలకృష్ణ సినిమాతో మొదలై థియేటర్లలో సినిమాలు సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ డిసెంబర్ 2021లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల జాబితా ఇక్కడ చూద్దాం. వాటిపై ఓ లెక్కేద్దాం.. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి కాంబినేషన్లో డిసెంబర్ 2న ‘అఖండ’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘అఖండ’లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

ఈ వారాంతంలో థియేటర్లలోకి రానున్న మరో తెలుగు చిత్రం ‘స్కైలాబ్’. డిసెంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉది. ‘స్కైలాబ్’ అనేది 1979 నాటి కామెడీ, డ్రామాగా తెరకెక్కింది. తమ గ్రామం పై స్పేస్ స్టేషన్ పడిపోతుందని ఒక గ్రామ ప్రజలు హృదయపూర్వకంగా భావించే సంఘటనల హాస్య మలుపుతో వ్యవహరిస్తారు. నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు.
డిసెంబర్ రెండో వారంలో కొత్త సినిమాల హంగామా కనిపిస్తోంది. అవి నాగశౌర్య ‘లక్ష్య’, కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ మరియు శ్రియ ‘గమనం’.

అవన్నీ ఒకే రోజున – డిసెంబర్ 10న విడుదలకానున్నాయి. ‘లక్ష్య’ అనేది స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ‘గుడ్ లక్ సఖి’ కూడా లంబాడా అమ్మాయి గురించి మాట్లాడే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకునూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘గమనం’.. శ్రియా శరణ్, నిత్యా మీనన్, శివ కందుకూరి మరియు ప్రియాంక జవాల్కర్ చుట్టూ తిరిగే కథ. సుజనారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

ఈ నెలలో అతిపెద్ద చిత్రం అల్లు అర్జున్ తొలి పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ – ‘పుష్ప ది రైజ్’. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ యాక్షన్‌పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ‘పుష్ప ది రైజ్’ డిసెంబరు 17న ఏకకాలంలో ఐదు భాషల్లో విడుదలవుతోంది. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత దర్శకుడు సుకుమార్‌ చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ బిగ్గీ ‘స్పైడర్‌మ్యాన్ నో వే హోమ్’ తెలుగులో కూడా విడుదలవుతోంది, ఇది ‘పుష్ప’కి ఒక రోజు ముందే థియేటర్లలోకి రానుంది. నాని లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ డిసెంబర్ 25 న విడుదల అవుతుంది. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతుంది ఈ సినిమా. రాహుల్ సంకృతియన్ దర్శకత్వం వహించిన ఈ చింద్రంలో .. సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్ మరియు కృతి శెట్టి నటించారు. టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అదే రోజున కపిల్ దేవ్ బయోపిక్ ’83’ కూడా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులోకి కూడా డబ్ చేస్తున్నారు.

ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్.. పది పాసైతే రూ.10,000.. ఇంటర్ పాసైతే 20,000!

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పదో తరగతి, ఇంటర్ పాసైన విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ 2019 ద్వారా ఎల్‌ఐసీ ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇస్తోంది. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో రకాల పాలసీలను తెచ్చిన ఎల్‌ఐసీ ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తోంది. ఎల్‌ఐసీ పాలసీల ద్వారా ఆర్థిక లక్ష్యాలను చేరుకునే అవకాశాలను, ఆర్థిక భద్రతను కల్పిస్తోంది.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ గర్ల్ స్కాలర్‌షిప్, రెగ్యులర్ స్కాలర్‌షిప్ పేరుతో రెండు స్కాలర్ షిప్ లను ఇస్తోంది. ఇంటర్ పాసైన వాళ్లు రెగ్యులర్ స్కాలర్ షిప్ ను పొందవచ్చు. తల్లిదండ్రుల వార్షికాదాయం లక్ష రూపాయల లోపు ఉన్న విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంటర్ లో కనీసం 60 శాతం మార్కులతో పాసైన విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

2018 – 19 అకాడమిక్ ఇయర్ విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో ఎల్‌ఐసీ డివిజినల్ సెంటర్‌కు పది మంది అబ్బాయిలు, పది మంది అమ్మాయిలకు డివిజనల్ స్కాలర్ షిప్స్ లభిస్తాయి. అదే విధంగా విద్యార్థినులు స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ ను పొందే అవకాశం ఉంటుంది. 2018 – 19 అకాడమిక్ ఇయర్ లో పది పాసైన విద్యార్హినులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఒక్కో ఎల్‌ఐసీ డివిజినల్ సెంటర్‌కు పది మంది విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ ను పొందవచ్చు. https://customer.onlinelic.in/liceps/portlets/visitor/gjf/gjfcontroller.jpf వెబ్ సైట్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రెగ్యులర్ విద్యార్థులకు సంవత్సరానికి 20,000 రూపాయలు, స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ కింద 10,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.

అమెజాన్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఆ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్..?

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇయర్ ఎండ్ నేపథ్యంలో అమెజాన్ మరో స్పెషల్ సేల్ ను నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 22వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ పేరుతో అమెజాన్ ఈ సేల్ ను నిర్వహించనుంది. స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారుల కోసం అమెజాన్ ఈ సేల్ ను నిర్వహిస్తుండగా ఈ సేల్ ద్వారా మొబైల్, మొబైల్ ఫోన్లకు సంబంధించిన ఇతర వస్తువులను అమెజాన్ విక్రయించనుంది.

ఆమెజాన్ ఇప్పటికే ఒక మైక్రో సైట్ ను రూపొందించి మైక్రో సైట్ ద్వారా సేల్ లో భాగంగా విక్రయించే స్మార్ట్ ఫోన్లు, ఇతర వివరాలను విడుదల చేసింది. అమెజాన్ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసిన కస్టమర్లకు ఎక్స్ ఛేంజ్ ఆఫర్లతో పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసిన వారికి 1,500 రూపాయల వరకు డిస్కౌంట్ ను ఇవ్వనుంది. ప్రముఖ బ్రాండ్లపై ఈ సేల్ లో అదిరిపోయే డిస్కౌంట్లను పొందే అవకాశం ఉంటుంది.

షియోమీ, హాన్సర్, శాంసంగ్, వన్ ప్లస్, నోకియా, రియల్ మీ, ఎల్జీ, జాబ్రా, ఒప్పో, యాపిల్ కంపెనీల స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. హెడ్ ఫోన్లు, పవర్ బ్యాంకులు, కవర్లు, కేబుల్ లపై కూడా అమెజాన్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈరోజు తగ్గింపు ధరలను అమెజాన్ యొక్క మైక్రో సైట్ ద్వారా చూడవచ్చు. శామ్‌సంగ్ గెలాక్సీ ఎం21, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం31, వన్‌ప్లస్ 8 టీ 5జీ, రెడ్ మీ 9 ప్రైమ్, రెడ్‌మీ నోట్ 9 ప్రో మాక్స్, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం51, ఐ ఫోన్ 11, వన్‌ప్లస్ నార్డ్ 5జీ ఫోన్లను ఆఫర్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది.

డిసెంబర్ 31 లోపు ఈ పని చేయండి.. లేదంటే రూ.10,000 కట్టాల్సిందే..?

మనలో చాలామంది చిన్నచిన్న పొరపాట్ల వల్ల వేల రూపాయలు జరిమానా రూపంలో చెల్లిస్తూ తీవ్రంగా నష్టపోతూ ఉంటారు. కొన్ని ముఖ్యమైన తేదీలను, ఆ తేదీల లోపు చేయాల్సిన పనులను గుర్తుంచుకోవడం ద్వారా జరిమానా నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. ఆదాయపు పన్నును చెల్లించే వాళ్లు ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీలోగా ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఆదాయపు పన్ను రిటర్నులు ఏదైనా కారణం వల్ల దాఖలు చేయడం సాధ్యం కాకపోతే ఏకంగా 10,000 రూపాయలు జరిమానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. భారీ మొత్తంలో జరిమానా పడే అవకాశం ఉండటంతో ఖాతాదారులు జరిమానాపై అవగాహన కలిగి ఉండి జాగ్రత్త వహిస్తే మంచిది. 2019 – 20 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీ చివరి తేదీగా ఉంది.

డిసెంబర్ 31వ తేదీలోగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయకపోతే 5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారు 1,000 రూపాయలు ఆలస్య రుసుముగా, 5 లక్షల కంటే ఆదాయం ఎక్కువగా ఉన్నవాళ్లు 10,000 రూపాయలు ఆలస్య రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా ఐటీఆర్ రిటర్నులు దాఖలు చేయని వాళ్లు జరిమానాను ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఎవరైనా ఆదాయపు పన్ను రిటర్నుల విషయంలో నిర్లక్ష్యం, ఆలసత్వం వహిస్తే చివరి నిమిషంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీలైనంత త్వరగా ఐటీఆర్ రిటర్నులు సబ్మిట్ చేస్తే జరిమానా భారం పడదు. మరో 22 రోజులు మాత్రమే సమయం ఉండటంతో పన్ను చెల్లింపుదారులు అలర్ట్ గా ఉంటే మంచిది.

ప్రజలకు అలర్ట్.. డిసెంబర్ నెలలో బ్యాంకు సెలవులు ఎప్పుడెప్పుడంటే..?

బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు, బ్యాంకులలో తరచూ లావాదేవీలను నిర్వహించే వాళ్లు బ్యాంకు సెలవుల గురించి తప్పనిసరిగా అవగాహన ఏర్పరచుకోవాలి. కరోనా విజృంభణ, లాక్ డౌన్ అమలు వల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకుల టైమింగ్స్ లో సైతం మార్పులు చోటు చేసుకున్నాయి. బ్యాంకు సెలవుల గురించి అవగాహన లేకపోతే లావాదేవీల నిర్వహణ సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

డిసెంబర్ నెలలో ఏకంగా 7 రోజులు బ్యాంకులకు సెలవు దినాలుగా ఉన్నాయి. ప్రతి నెల రెండవ శనివారం, నాలుగవ శనివారం బ్యాంకులకు సెలవు అనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే డిసెంబర్ నెలలో క్రిస్ మస్ మినహా మరో పండుగ లేకపోవడంతో ఇతర నెలలతో పోలిస్తే ఈ నెలలో సెలవులు తక్కువగా ఉన్నాయి. ముందుగా సెలవులపై అవగాహనను ఏర్పరచుకోవడం ద్వారా అందుకు తగిన విధంగా మన ప్రణాళికలలో మార్పులు చేసుకోవడం సాధ్యమవుతుంది.

డిసెంబర్ నెలలో 12, 26 తేదీలు రెండు, నాలుగు శనివారాలు కాబట్టి బ్యాంకు సెలవులుగా ఉన్నాయి. క్రిస్టియన్లకు అతిపెద్ద పండుగలలో ఒకటైన క్రిస్ మస్ పండుగ ఈ నెల 25వ తేదీన వస్తుంది. 26వ తారీఖు నాలుగో శనివారం కావడంతో ఉద్యోగులకు శుక్ర, శని, ఆదివారాలు వరుసగా మూడు రోజులు సెలవులు వస్తాయి. 6,13,20, 27 తేదీలు ఆదివారం కాబట్టి ఆ నాలుగు రోజులు కూడా బ్యాంకు ఉద్యోగులకు సెలవు దినాలుగా ఉంటాయి.

మొత్తం 31 రోజులలో ఏడురోజులు బ్యాంకు ఉద్యోగులకు సెలవు దినాలుగా ఉన్నాయి. అయితే ఇతర రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పండుగల వల్ల ఎక్కువ రోజులు సెలవు దినాలు ఉండటం గమనార్హం.

ఏపీ విద్యార్థులకు అలర్ట్.. రేపటినుంచే తరగతులు ప్రారంభం..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో రోజుకు 10,000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం 2,000 లోపే కొత్త కేసులు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జగన్ సర్కార్ స్కూళ్ల రీ-ఓపెన్ షెడ్యూల్‌ లో కీలక మార్పులు చేసింది.

మొదట విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి 6,7,8 తరగతుల విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కావాల్సి ఉండగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే క్లాసులు ప్రారంభించే విధంగా నిబంధనల్లో మార్పులు చేశామని అన్నారు. విద్యార్థులకు రేపటి నుంచి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం `1.30 గంటల వరకు క్లాసులను నిర్వహిస్తామని తెలిపారు.

6, 7 తరగతుల విద్యార్థులకు వచ్చే నెల 14వ తేదీ నుంచి క్లాసులను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. 8,9 తరగతుల విద్యార్థులకు మాత్రం రోజు విడిచి రోజు క్లాసులను నిర్వహించనున్నట్టు తెలిపారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు సంక్రాంతి పండగ సెలవుల తర్వాత క్లాసులను నిర్వహిస్తామని అన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ పాఠశాలల నిర్వహణ చేపడతామని తెలిపారు.

తరగతి గదుల్లో విద్యార్థులు మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి చేయనున్నామని అన్నారు. మారిన నిబంధనల ప్రకారం విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను స్కూళ్లకు పంపించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రారంభమైన స్కూళ్లలో పలు చోట్ల విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడుతూ ఉండటం గమనార్హం.

మొబైల్ ఫోన్లు వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న చార్జీలు..?

దేశంలో మొబైల్ ఫోన్ల వినియోగం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకరకంగా చెప్పాలంటే మొబైల్ ఫోన్లు మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. ఉద్యోగాలు చేసేవాళ్లలో చాలామంది ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. కొందరు డేటా కోసం, ఇతర కారణాల వల్ల ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులను వినియోగిస్తూ ఉండటంతో టెలీకం కంపెనీలకు లాభం చేకూరుతోంది.

అయితే టెలీకాం కంపెనీలు మొబైల్ ఫోన్ల వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. జియో రాకతో టెలీకాం రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. కస్టమర్లకు కాల్స్ ఛార్జీలు, డేటా ఛార్జీలు గతంతో పోలిస్తే భారీగా తగ్గాయి. అయితే మొదట్లో తక్కువ ధరలకే సర్వీసులు అందించిన జియో తర్వాత కాలంలో కాల్, డేటా ఛార్జీలను పెంచింది. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు కంపెనీలు త్వరలోనే మరోసారి ఛార్జీలను పెంచనున్నాయి.

మొబైల్ ఫోన్లు వినియోగించే కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. 2021 జనవరి నెల నుంచి టారిఫ్ చార్జీలు 15 నుంకి 20 శాం పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. జియో మినహా మిగతా కంపెనీలన్నీ పెంచవచ్చని..అయితే జియో టారిఫ్ ధరల పెంపు విషయంలో ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

గతేడాది డిసెంబర్ నెలలో మొబైల్ కంపెనీలు టారిఫ్ చార్జీలను భారీగా పెంచాయి. వొడాఫోన్ ఐడియా, ఎయిర్ ‌టెల్ కంపెనీలు ఇప్పటికే ధరల పెంపు ఉండవచ్చని సంకేతాలు ఇచ్చాయి. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఛార్జీల పెంపు అమలైతే వినియోగదారులు తీవంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి.

ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త.. రూ. 42,000 వేతనంతో ఉద్యోగాలు..?

గత కొన్ని రోజుల నుంచి నిరుద్యోగులకు వరుసగా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర గృహ, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఎన్‌బీసీసీ సంస్థ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 100 ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌బీసీసీ (ఇండియా) నిరుద్యోగ అభ్యర్థులు ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, గ్రూప్‌ డిస్క‌ష‌న్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://www.nbccindia.com/ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 100 ఇంజనీర్ ఉద్యోగాలకు ఖాళీలు ఉండగా వాటిలో 80 సివిల్ ఇంజనీర్ ఉద్యోగాలు, 20 మెకానికల్ ఉద్యోగాలు ఉన్నాయి.

బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు, ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవాళ్లు 550 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు 42,000 రూపాయలు వేతనంగా చెల్లిస్తారు.

వరుసగా వెలువడుతున్న నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుంది. కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులు, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్లు కష్టపడి ప్రయత్నిస్తే సులువుగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడం సాధ్యమే.

ఆ వ్యాక్సిన్లపై భారత్ లో ప్రయోగాలు.. డిసెంబర్ నాటికి తొలి వ్యాక్సిన్..?

దేశంలో ప్రజలు కరోనా మహమ్మారి కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మహమ్మారిని కట్టడి చేయవచ్చని భావిస్తున్నారు. సీరమ్ ఇన్సిట్యూట్ ఇప్పటికే డిసెంబర్ నాటికి భారత్ కు ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని కీలక ప్రకటన చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ మీడియాతో మాట్లాడుతూ ముక్కు ద్వారా ఉపయోగించే వ్యాక్సిన్ కొరకు దేశంలో ప్రయోగాలు చేయడానికి భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అనుమతులు ఇచ్చినట్టు వెలడించారు.

త్వరలో వ్యాక్సిన్ల ప్రయోగాలకు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతులు ఇవ్వనుంది. వ్యాక్సిన్ల ప్రయోగాలు సక్సెస్ అయితే మాత్రం ఇంట్రా నాసల్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ మరికొన్ని నెలల్లోనే భారత ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సాధారణ వ్యాక్సిన్లతో పోలిస్తే ముక్కు ద్వారా వేసే కరోనా వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ను దాదాపు 40 వేల మంది వాలంటీర్లపై ప్రయోగించే అవకాశం ఉంది.

మరోవైపు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీ రష్యా కరోనా వ్యాక్సిన్ కు కూడా భారతదేశంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంజక్షన్ల రూపంలో ఉన్న వ్యాక్సిన్ల తయారీ మాత్రమే జరుగుతోందని.. చెప్పిన సమయంలో భారత్ ముక్కు ద్వారా వేసే కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన ప్రయోగాలను చేపడుతూ ఉండటం గమనార్హం.

కరోనా వైరస్ మన శరీరంలోకి ముక్కు, నోటి ద్వారానే ప్రవేశిస్తూ అనేక ఆరోగ్య సమస్యలను సృష్టిస్తోంది. మరోవైపు దేశంలో ఇప్పటివరకు 75 లక్ష్లలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ కోసం వాషింగ్టన్ యూనివర్సిటీతో భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకుందని సమాచారం. యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ తరహా కరోనా వ్యాక్సిన్ గురించి ప్రయోగాలు చేపడుతున్నారు.