Tag Archives: Dhanya Balakrishna

Dhanya Balakrishna: అవును ధన్య బాలకృష్ణను పెళ్లి చేసుకున్నా… పెళ్లి విషయం బయట పెట్టిన డైరెక్టర్!

Dhanya Balakrishna: పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ధన్య బాలకృష్ణ గురించి గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ధన్య బాలకృష్ణ కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ బాలాజీ మోహన్ అనే వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ మరొక నటి కల్పిక ఈమె గురించి తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో షేర్ చేశారు.

ఇలా తన అనుమతి లేకుండా తన వ్యక్తిగత విషయాలను కల్పిక తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడంతో ధన్య బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య కొద్దిరోజులు సోషల్ మీడియా వార్ జరిగింది.అయితే తాజాగా డైరెక్టర్ బాలాజీ మోహన్, ధన్య బాలకృష్ణతో తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా బాలాజీ మోహన్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ తాము పెళ్లి చేసుకున్నట్లు ఈయన కోర్టులో ధ్రువీకరించారు.ఇకనటి కల్పిక గణేష్ తన గురించి తన భార్య గురించి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు చేసి తన పరువుకు నష్టం కలిగించేలా వీడియో విడుదల చేసిందని కోర్టుకు సమర్పించారు.

Dhanya Balakrishna: 2020 లోనే ధన్య బాలకృష్ణను పెళ్లి చేసుకున్న బాలాజీ మోహన్…


ఇక బాలాజీ మోహన్ 2020 జనవరిలోనే నటి ధన్య బాలకృష్ణను వివాహం చేసుకున్నారు. కానీ ఇది ఆయనకు మొదటి వివాహం కాదు. ఇదివరకే ఆయన అరుణ అనే మహిళను పెళ్లి చేసుకుని తనకు విడాకులు ఇచ్చిన అనంతరం ధన్య బాలకృష్ణను పెళ్లి చేసుకున్నట్టు తెలియజేశారు.ఇలా బాలాజీ మోహన్ తన పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Dhanya Balakrishna: కల్పిక ఒక తాగుబోతు.. గంజాయి కొట్టి ఏం వాగుతుందో దానికే తెలియదు : ధన్య బాలకృష్ణ

Dhanya Balakrishna: ప్రస్తుతం నటి ధన్య బాలకృష్ణ, కల్పిక గణేష్ మధ్య పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్ జరుగుతుంది. కల్పిక ముందుగా ధన్యబాల కృష్ణ గురించి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. ధన్య బాలకృష్ణ కోలీవుడ్ డైరెక్టర్ బాలాజీ మోహన్ రెండవ వివాహం చేసుకున్నది అంటూ వీడియో షేర్ చేశారు. ఇక ఈ వీడియో డిలీట్ కావడంతో ఒక కోలీవుడ్ హీరో అండతోనే ధన్య తన వీడియో డిలీట్ చేయించిందని కల్పిక ఆరోపణలు చేశారు.

నీ పవర్ తోటి నువ్వు నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వీడియో డిలీట్ చేయించావు నా పవర్ ఏంటో తెలిస్తే భస్మం అయిపోతావు ఈ విషయం గురించి కోర్టులో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరింది కల్పిక. ఇక కల్పిక చేసిన ఈ వ్యాఖ్యలపై దన్య స్పందిస్తూ కల్పిక గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా కల్పిక గణేష్ గురించి ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ… కల్పిక ఒక తాగుబోతు అని, తను ఎప్పుడు మద్యం మత్తులో ఉండి ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది. అసలు తనేం మాట్లాడుతుందో తనకు కూడా గుర్తు ఉండదని కల్పికా గురించి ధన్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈమె స్మోకింగ్ కూడా చేస్తుంది. గంజాయి కొట్టి ఏది పడితే అది వాగుతూ ఉంటుందని తెలిపారు.

Dhanya Balakrishna: కల్పిక గంజాయి కొట్టి ఏదేదో వాగుతుంది…

ఇలా తన మాటలు నేను ఏమాత్రం పట్టించుకోనని మీరు కూడా తన మాటలు పట్టించుకోని మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి అంటూ ధన్య కల్పికకు షాక్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది.ఇక వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ ఉండడంతో ఈ విషయం కాస్త కోలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Kalpika Ganesh: నా పవర్ చూస్తే భస్మమైపోతావు.. నటి ధన్య బాలకృష్ణ పై కల్పిక ఫైర్!

Kalpika Ganesh: సినీనటి కల్పిక గణేష్ ఈ మధ్యకాలంలో వరుస వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.ఈమె సోషల్ మీడియా వేదికగా మరొక నటి ధన్యవాదాలు గురించి మాట్లాడుతూ.. ధన్య బాలకృష్ణ కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ బాలాజీ మోహన్ అనే వ్యక్తిని ఈ ఏడాది మొదట్లో తనని రెండవ వివాహం చేసుకుందని తెలిపారు. బాలాజీ మోహన్ ఇది వరకే పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చారు ఈ క్రమంలోనే ధన్యవాదాలు కృష్ణ తనని మరోసారి పెళ్లి చేసుకుందని తెలిపారు.

ఈమె చెన్నై వెళ్ళినప్పుడు బాలాజీ తో మంచి పరిచయం ఏర్పరచుకొని అతనిని రెండవ వివాహం చేసుకున్నారంటూ ఈ సందర్భంగా కల్పిక గణేష్ ధన్యవాదాలు వివాహం గురించి తెలియజేశారు. అయితే ఈ వీడియో కాస్త డిలీట్ అవడంతో మరోసారి కల్పిక గణేష్ ఈ వీడియో డిలీట్ అవ్వడానికి ధన్య కారణమని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఆమె ఇన్ని రోజులు నా ఫోన్ బ్లాక్ చేసి పెట్టుకుంది ఎప్పుడైతే తాను ఈ వీడియో షేర్ చేశాను వెంటనే తన ఫోన్ నెంబర్ అన్ బ్లాక్ చేసి ఆ రోజు రాత్రి వరుసగా తనకు ఫోన్ చేసిందని కల్పిగా తెలిపారు. అయితే కోలీవుడ్ హీరో పవర్ తో ధన్య ఆ వీడియోని డిలీట్ చేయించిందని కల్పిక ఆరోపణలు చేశారు. నువ్వు నీ పవర్ ఏంటో చూపించి వీడియో డిలీట్ చేయించావు అయితే నా పవర్ నీకు తెలియదు తెలిస్తే భస్మమైపోతావు.

Kalpika Ganesh: ధన్య బాలకృష్ణ వర్సెస్ కల్పిక గణేష్…


నాకు తెలియకుండా నేను అప్లోడ్ చేసిన వీడియోని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డిలీట్ చేయించావు నేను దీని గురించి మరింత తెలుసుకుంటాను అంటూ ఈ సందర్భంగా కల్పిక.. ధన్య బాలకృష్ణ వ్యవహారం పై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి ధన్య వర్సెస్ కల్పిక అనే లాగా వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వారు జరుగుతుంది.

Kalpika Ganesh: పెళ్లయిన డైరెక్టర్ ను రహస్యంగా రెండో వివాహం చేసుకున్న నటి ధన్య బాలకృష్ణ.. అసలు విషయం చెప్పిన నటి!

Kalpika Ganesh: కల్పిక గణేష్ ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఈ మధ్యకాలంలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. కల్పిక గణేష్ ఈ మధ్యకాలంలో వరుస వివాదాలను ఎదుర్కొంటున్నారు. ఇక తాజాగా ఈమె సమంత నటించిన యశోద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఈమె తాను కూడా మయోసైటీస్ వ్యాధి బారిన పడ్డానని అయితే తన ఫస్ట్ స్టేజిలో ఉన్నాననే విషయాలను కూడా తెలియజేశారు.

ఇకపోతే కల్పిక గణేష్ తాజాగా తన యూట్యూబ్ ద్వారా మరొక నటి ధన్య బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ధన్య బాలకృష్ణ పెళ్లి అయ్యి విడాకులు ఇచ్చిన కోలీవుడ్ డైరెక్టర్ బాలాజీ మోహన్ అనే వ్యక్తిని ఈ ఏడాది జనవరిలో రెండవ వివాహం చేసుకున్నారంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

ఈ వీడియో కాపీరైట్స్ కారణంగా డిలీట్ అయినప్పటికీ ఈ వీడియోలో భాగంగా కల్పిక ధన్య బాలకృష్ణ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ధన్య బాలకృష్ణ సినిమా షూటింగుల నిమిత్తం చెన్నై వెళ్ళినప్పుడు ఆమె ఎక్కువగా బాలాజీ మోహన్ తోనే ఉండేదని అయితే అప్పటికే ఆయనకు వివాహం జరిగి విడాకులు కూడా అయ్యాయని తెలిపారు. తమిళ సినిమాలు చేస్తున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్నారని తెలిపారు.

Kalpika Ganesh: బాలాజీ మోహన్ తనని ఇబ్బంది పెడుతున్నారేమో…

వీరి వివాహం జరిగి ఏడాదికావస్తున్న వీరి విషయాన్ని రహస్యంగా ఉంచారు.ఇక వీరి పెళ్లి విషయం తెలిసి తాను కాస్త ఆందోళన చెందాలని బాలాజీ తనని ఎక్కడ టార్చర్ చేస్తారని ఆందోళన చెందాను. అయితే అతను తనని బాగా చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు వీరి పెళ్లి గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందనే విషయానికి వస్తే..తాను సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది. అయితే తనని బాలాజీ ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడేమో అనిపించి ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెట్టానని కల్పికా తెలిపారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Dhanya Balakrishna : ఆ సినిమా చూసిన తర్వాత పవన్ అంటే క్రష్ అని చెప్పలేను అంతకంటే ఎక్కువే కావచ్చేమో : ధన్య బాలకృష్ణ.

చక్కటి కళ్ళు,ఆకట్టుకునే అందం, తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ.. ప్రేక్షకులను ఆహ్లాద పరుస్తూ కనిపించే నటీ మరెవరో కాదు… ధన్య భాలకృష్ణ ఒక దక్షిణాది భారతీయ చలన చిత్ర నటి. ఆమె తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది. ఆమె మురుగ దాస్ దర్శకత్వం వహించిన “7అమ్ అరివు” తెలుగులో( 7త్ సెన్స్) ద్వారా నటిగా పరిచయమైంది.

ధన్య భాలకృష్ణ బెంగులూరులో పుట్టి పెరిగిన తమిళ అమ్మాయి. ఆమె సూర్య, శ్రుతి హాసన్ నటించిన 7అమ్ అరివు తెలుగులో (7త్ సెన్స్) ద్వారా నటిగా పరిచయమైంది. ఆ తరువాత ఆమె రెండు తమిళ-తెలుగు ద్విభాషా చిత్రాలు లవ్ ఫెయిల్యూర్ (తమిళంలో కాదల్ సొదప్పువది ఎప్పిడి), ఎటో వెళ్ళిపోయింది మనసు(తమిళంలో నీతానే ఎన్ పొన్వసంతం) లో నటించింది.

ఆ తరువాత ఆమె 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో మహేశ్ బాబుని ప్రేమించాననే అమ్మాయి పాత్రలో నటించింది. రాజా రాణి చిత్రంలో ఆమె నయన తార స్నేహితురాలైన నివేతా పాత్ర పొషించింది. ఆమె కథనాయికగా నటించిన తొలి చిత్రం “చిన్ని చిన్ని ఆశ” నవంబరు 2013లో విడుదలైనది. ఆమె తదుపరి చిత్రాలు “చందమామలో అమృతం”, “సెకండ్ హ్యండ్” తరువాత విడుదలైనవి.

2001 శ్రీ సూర్య మూవీస్, ఏఎం రత్నం నిర్మాణం, ఎస్.జె.సూర్య దర్శకత్వంలో “ఖుషి” చిత్రం విడుదలయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, భూమిక హీరో, హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన స్వరాలు సినిమా విజయానికి ప్రధాన కారణంగా నిలిచాయి. అయితే ‌ప్రముఖ హీరోయిన్ ధన్య బాలకృష్ణ ‌మాట్లాడుతూ… తను చిన్నప్పుడు అనేక తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాలు చూసేదాన్ని, తెలుగు సినిమాలు చూస్తున్న క్రమంలో ఒకసారి పవన్ కళ్యాణ్ నటించిన “ఖుషి” చిత్రాన్ని చూశానని..

అందులో పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్ ఆయన క్రాఫ్ నన్ను బాగా ఆకర్షించాయని.. ఒక విధంగా చెప్పాలంటే ఆయన మీద క్రష్ కాదు అంతకంటే ఎక్కువేమో అనిపిస్తుంది. ఆ సినిమా చూసిన తర్వాత దాదాపు కొన్ని రోజులు ట్రాన్స్ లోకి వెళ్లానని.. అప్పటినుంచి ఆయనను నేను ఆరాధిస్తున్నాను. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వస్తుందని.. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని ధన్య భాలకృష్ణ వివరించారు.

ఆ సినిమాలో నేను మందు తాగినట్లు చూపించారు.. కానీ!

తమిళ స్టార్ హీరో సూర్య, శృతిహాసన్ జంటగా తెరకెక్కిన సెవెంత్ సెన్స్ సినిమా ద్వారా పరిచయమైన నటి ధన్య బాలకృష్ణ.ఈ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ధన్య తరువాత పలు సినిమాలలో ఎంతో అద్భుతంగా నటించి మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.లవ్‌ ఫెయిల్యూర్‌, ఎటో వెళ్లిపోయింది మనసు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు,విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అందరికీ ఎంతో గుర్తుండిపోయే ఒకే ఒక సీన్లో కనిపించి సందడి చేశారు. అదే విధంగా తెలుగులో నేను శైలజ, రాజు గారి గది, సాఫ్ట్వేర్ సుదీర్ సినిమాలతో మరింత గుర్తింపు సంపాదించుకున్న ధన్య తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.

ప్రస్తుతం ధన్య బెంగళూరులోనే నివసిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. తన ముద్దు పేరు పప్పు అని, తాను నటించిన రాజా రాణి సినిమాలో ఒక సన్నివేశంలో తనని మందు తాగుతున్నట్లు చూపించారు. కానీ అది నిజంగా మందు కాదు, కేవలం మంచినీళ్లు మాత్రమేనని ఈ సందర్భంగా ధన్య తెలిపారు.

తను పెద్దగా స్నేహితులతో కూడా కలవని, వీకెండ్స్ మాత్రం సరదాగా స్నేహితులతో కలిసి బయట భోజనం చేస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే తనకు పవన్ కళ్యాణ్, సూర్య, రణబీర్ కపూర్ తన క్రష్ అని ఎప్పటికైనా వీరితో సినిమా తీయాలనేది తన కోరికని తన మనసులో మాటను బయటపెట్టారు.