తమిళ స్టార్ హీరో సూర్య, శృతిహాసన్ జంటగా తెరకెక్కిన సెవెంత్ సెన్స్ సినిమా ద్వారా పరిచయమైన నటి ధన్య బాలకృష్ణ.ఈ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ధన్య తరువాత పలు సినిమాలలో ఎంతో అద్భుతంగా నటించి మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.లవ్ ఫెయిల్యూర్, ఎటో వెళ్లిపోయింది మనసు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు,విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అందరికీ ఎంతో గుర్తుండిపోయే ఒకే ఒక సీన్లో కనిపించి సందడి చేశారు. అదే విధంగా తెలుగులో నేను శైలజ, రాజు గారి గది, సాఫ్ట్వేర్ సుదీర్ సినిమాలతో మరింత గుర్తింపు సంపాదించుకున్న ధన్య తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.
ప్రస్తుతం ధన్య బెంగళూరులోనే నివసిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. తన ముద్దు పేరు పప్పు అని, తాను నటించిన రాజా రాణి సినిమాలో ఒక సన్నివేశంలో తనని మందు తాగుతున్నట్లు చూపించారు. కానీ అది నిజంగా మందు కాదు, కేవలం మంచినీళ్లు మాత్రమేనని ఈ సందర్భంగా ధన్య తెలిపారు.
తను పెద్దగా స్నేహితులతో కూడా కలవని, వీకెండ్స్ మాత్రం సరదాగా స్నేహితులతో కలిసి బయట భోజనం చేస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే తనకు పవన్ కళ్యాణ్, సూర్య, రణబీర్ కపూర్ తన క్రష్ అని ఎప్పటికైనా వీరితో సినిమా తీయాలనేది తన కోరికని తన మనసులో మాటను బయటపెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…