ఐటి దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగానికి హైదరాబాద్ నగరానికి చెందిన నర్కుటి దీప్తి ఎన్నికయ్యారు. హైదరాబాద్ కమిషనరేట్ లో ఫోరెన్సిక్ నిపుణులుగా పనిచేస్తున్న డాక్టర్ వెంకన్న కూతురు దీప్తి యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరెడాలో సీటు సాధించారు. ఈ విధంగా అమెరికాకి వెళ్ళిన దీప్తి ఈనెల 2వ తేదీతో ఎంఎస్ పూర్తి చేశారు.
చదువులో ఎంతో రాణిస్తున్న దీప్తి రెండు నెలల క్రితమే యూనివర్సిటీ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా దీప్తి మైక్రోసాఫ్ట్, గోల్డ్ మెన్ సాక్స్, అమేజాన్ కంపెనీల్లో ఉద్యోగం సాధించింది. అయితే వీటన్నింటిలో కెల్లా దీప్తి మైక్రోసాఫ్ట్
సంస్థ వైపే మొగ్గు చూపారు.
దీప్తి ప్రతిభను గుర్తించిన మైక్రోసాఫ్ట్ సంస్థ తనకు సంవత్సరానికి అక్షరాల 2 కోట్ల రూపాయల వార్షిక వేతనాన్ని చెల్లిస్తూ మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ (ఎస్‌డీఈ) గ్రేడ్–2 కేటగిరీలో ఎంపిక చేసుకున్నారు. ఈ క్రమంలోనే దీప్తి ఈ నెల 17న మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు తీసుకోనున్నారు. ఒక తెలుగు తేజం మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఇంతటి విలువైన ఉద్యోగం సాధించడం ఎంతో గర్వకారణమని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…