Movie News

Dhanya Balakrishna: అవును ధన్య బాలకృష్ణను పెళ్లి చేసుకున్నా… పెళ్లి విషయం బయట పెట్టిన డైరెక్టర్!

Dhanya Balakrishna: పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ధన్య బాలకృష్ణ గురించి గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ధన్య బాలకృష్ణ కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ బాలాజీ మోహన్ అనే వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ మరొక నటి కల్పిక ఈమె గురించి తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో షేర్ చేశారు.

ఇలా తన అనుమతి లేకుండా తన వ్యక్తిగత విషయాలను కల్పిక తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడంతో ధన్య బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య కొద్దిరోజులు సోషల్ మీడియా వార్ జరిగింది.అయితే తాజాగా డైరెక్టర్ బాలాజీ మోహన్, ధన్య బాలకృష్ణతో తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా బాలాజీ మోహన్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ తాము పెళ్లి చేసుకున్నట్లు ఈయన కోర్టులో ధ్రువీకరించారు.ఇకనటి కల్పిక గణేష్ తన గురించి తన భార్య గురించి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు చేసి తన పరువుకు నష్టం కలిగించేలా వీడియో విడుదల చేసిందని కోర్టుకు సమర్పించారు.

Dhanya Balakrishna: 2020 లోనే ధన్య బాలకృష్ణను పెళ్లి చేసుకున్న బాలాజీ మోహన్…


ఇక బాలాజీ మోహన్ 2020 జనవరిలోనే నటి ధన్య బాలకృష్ణను వివాహం చేసుకున్నారు. కానీ ఇది ఆయనకు మొదటి వివాహం కాదు. ఇదివరకే ఆయన అరుణ అనే మహిళను పెళ్లి చేసుకుని తనకు విడాకులు ఇచ్చిన అనంతరం ధన్య బాలకృష్ణను పెళ్లి చేసుకున్నట్టు తెలియజేశారు.ఇలా బాలాజీ మోహన్ తన పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago