Tag Archives: funeral

Rakesh Master: ఆ చెట్టు కిందనే అంత్యక్రియలు …. ముందుగానే చెప్పిన రాకేష్ మాస్టర్!

Rakesh Master: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ మరణ వార్త మర్చిపోకముందే మరొక సీనియర్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణించడం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. రాకేష్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆదివారం సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో మరణించారు.

ఈయన వడదెబ్బ కారణంగా తీవ్రమైన విరోచనాలతో బాధపడుతూ గాంధీ ఆసుపత్రిలో చేరారు. అయితే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈయన మరణించారు.ఈ విధంగా రాకేష్ మాస్టర్ మరణించడంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు తన శిష్యులు ఇతర కొరియోగ్రాఫర్లు రాకేష్ మాస్టర్ మరణానికి సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.

ఇకపోతే రాకేష్ మాస్టర్ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ తాను చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలి అనే విషయాలను కూడా తెలియజేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Rakesh Master: వేప చెట్టు కిందనే సమాధి..


తనకు చెట్లు అంటే చాలా ఇష్టమని రాకేష్ మాస్టర్ ఈ వీడియోలో తెలియచేశారు. అందుకే తాను చనిపోయిన తర్వాత తనని ఒక వేప చెట్టు కింద సమాధి చేయాలి అంటూ తెలిపారు. తన మామయ్య (భార్య తండ్రి)సమాధి పక్కన ఒక వేప చెట్టు నాటాను తనని కూడా ఆ వేప చెట్టు కిందనే సమాధి చేయాలి అంటూ అలాగే తన అంత్యక్రియలు తన స్నేహితులందరూ కూడా పాల్గొనాలని కొందరి పేర్లను ఈయన సూచించారు.తన అంత్యక్రియల గురించి ముందుగానే రాకేష్ మాస్టర్ చెబుతూ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Latha Mangeshkar: లతా మంగేష్కర్ భౌతికదేహంపై షారుఖ్ ఖాన్ ఉమ్ము వివాదం..! కొంచమైనా బుద్దుందా అంటూ నటి ఫైర్ ..!

Latha Mangeshkar: షారుఖ్ ఖాన్ ఈ మధ్య ఏం చేసినా వివాదం అవుతోంది. వరసగా ఫ్లాప్ సినిమాలతో గత వైభవాన్ని కోల్పోయాడు. మరోవైపు సల్మాన్, ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లు వరసగా ప్రయోగాలు చేస్తూ.. హిట్లు కొడుతున్నారు.

Latha Mangeshkar: లతా మంగేష్కర్ భౌతికదేహంపై షారుఖ్ ఖాన్ ఉమ్ము వివాదం..! కొంచమైనా బుద్దుందా అంటూ నటి ఫైర్ ..!

2013లో విడుదలైన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాతో చివరి సారిగా హిట్ కొట్టాడు బాలీవుడ్ బాద్షా. 9 ఏళ్లుగా వరసగా ఫ్లాపులే పలకరిస్తున్నాయి. మరోవైపు ఇదిలా ఉంటే ఇటీవల డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దొరకడం.. అతన్ని అరెస్ట్ చేసి కొన్ని రోజుల పాటు రిమాండ్ లో ఉంచడం తెలిసిందే.

Latha Mangeshkar: లతా మంగేష్కర్ భౌతికదేహంపై షారుఖ్ ఖాన్ ఉమ్ము వివాదం..! కొంచమైనా బుద్దుందా అంటూ నటి ఫైర్ ..!

ఈ వివాదంతో మరింతగా కుంగిపోయాడు. మీడియాకు ముఖం కూడా చూపట్టలేని పరిస్థితి ఎదురైంది. దీంతో పాటే దేశంలో ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ షారుఖ్ ఖాన్ ను విపరీతంగా ట్రోల్ చేస్తోంది. నీచమైన కామెంట్లు పెడుతున్నారు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ దోషి అని తేలకముందే… పని గట్టుకుని ఆ ఫ్యామిలీపై విష ప్రచారం కూడా చేశారు. 

తాజాగా ఈ ఘటనపై నటి ఊర్మిళ ఫైర్..

ఇదిలా ఉంటే తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నాడు షారుఖ్ ఖాన్. ఇటీవల గాన కోకిల లతామంగేష్కర్ మరణించిన సంగతి. ఆమె అంత్యక్రియలకు షారుఖ్ ఖాన్ హాజరయ్యారు. అయితే ఆమెకు శ్రద్ధాంజలి ఘటించే సందర్భంలో మాస్క్ తీసి గాలి ఊదాడు షారుఖ్ ఖాన్. ఇక ఇది పట్టుకుని సోషల్ మీడియాలో మళ్లీ ట్రోలింగ్ మొదలయ్యాయి. షారుఖ్, లతామంగేష్కర్ పార్థీవ శరీరం వద్ద ఉమ్మివేశారని సిగ్గు లేదా అంటూ నెటిజెన్లు కామెంట్లు పెట్టారు. తాజాగా ఈ ఘటనపై నటి ఊర్మిళ ఫైర్ అయ్యారు. ముస్లిం సంప్రదాయాల ప్రకారం చనిపోయిన తర్వాత వ్యక్తి వద్ద నోటి నుంచి గాలి ఊదుతారు. ఇది తెలియని నెటిజెన్లు విమర్శిస్తున్నారంటూ..  ప్రార్ధనను కూడా ఉమ్మువేయడం అనుకునే సమాజంలో మనం బ్రతుకుతున్నామని ఆమె మండిపడ్డారు.

Ramesh Babu Death: దారుణం.. కరోనాతో బాధపడుతున్న మహేష్ బాబు.. అన్న భౌతికఖాయం చూడలేని స్థితిలో..!

RameshBabu Death: సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య.. నటుడు-నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు జనవరి 8 శనివారం కన్నుమూశారు. రమేష్ బాబు చాలా కాలంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు. చివరకు 56 ఏళ్ల వయస్సులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ విషయాన్ని నిన్న ట్విట్టర్ వేదికగా ఘట్టమనేని ఫ్యామిలీ తెలియజేసింది.

మా ప్రియమైన రమేష్‌బాబు గారు మరణించారని మేము చాలా బాధతో తెలియజేస్తున్నాము. ఆయన మన హృదయాల్లో ఎప్పటికీ జీవించి ఉంటాడు. మా మద్దతుదారులందరినీ కోవిడ్ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని .. దహన సంస్కారాలు జరిగే ప్రదేశంలో గుమికూడకుండా ఉండాలని మేము కోరుతున్నాము అంటూ ట్వీట్ చేశారు.

RameshBabu Death: దారుణం.. కరోనాతో బాధపడుతున్న మహేష్ బాబు.. అన్న భౌతికఖాయం చూడలేని స్థితిలో..!

అయితే ఇక్కడ బాధకరమైన విషయం ఏంటంటే.. ఇటీవల మహీష్ బాబు కరోనాతో బాధపుడుతున్న విషయం తెలిసిందే. అతడు హోం క్వారంటైన్ లో ఉంటూ.. చికిత్స పొందుతున్నాడు. ఇటీవల అతడు దుబాయ్ కు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అతడు కోవిడ్ టెస్టు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.


చివరి చూపుకు అవకాశం కల్పిస్తారా..?

అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. తేలికపాటి లక్షణాలతో COVID-19 తో బాధపడుతున్నట్లు మహేష్ ట్వీట్ చేశాడు. తాను ఇంట్లోనే ఉంటూ.. అవరమైన చికిత్స తీసుకుంటున్నాని పేర్కొన్న విషయం తెలిసిందే. తన ఫ్యామిలీ అంతా హోం క్వారంటైన్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రమేష్ బాబు మరణం తీవ్రంగా కలచివేస్తోంది. అతడి భౌతిక ఖాయాన్ని చూడలేని పరిస్థితిలో ఉన్నాడు మహేష్ బాబు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఆ చుట్టు పక్కల పరిసరాల్లో కూడా రాలేని పరిస్థితి. ఈ విషయంలో మహేష్ బాబు అభిమానులు చాలా చింతిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. ఇక అతడి అన్న భౌలికఖాయాన్ని చూసేందుకు మహేష్ బాబుకు అనుమతి ఇస్తారా..? లేదా అనేది వైద్య అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

నేడు ఫిల్మ్ ఛాంబర్‌ కు సిరివెన్నెల పార్థివదేహం.. మహాప్రస్థానంలో అంత్యక్రియలు..!

తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో అతడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.

అతడి మరణం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. తన పాటలతో తెలుగు సినిమాకి జీవం పోసిన సిరివెన్నెల కలం అప్పుడే ఆగిపోయిందంటే ఎరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ధిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగా సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక ఆయన చివరిచూపు కోసం .. అతడి భౌతిక కాయన్ని ఈ రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్‌ లో ఉంచారు.

అభిమానుల సందర్శనార్థం ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగున్నాయి. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సిరివెన్నెల బౌతిక ఖాయానికి నివాళులర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని అంత్యక్రియలకు హాజరుకానున్నారు. కేవలం సినీ ప్రముఖులే కాకుండా సాధారణ పౌరులు కూడా సందర్శించేందుకు అనుమతిని ఇచ్చారు.

పునీత్ అంత్యక్రియలకు తమిళ హీరోలు రాకపోవడానికి కారణం అదేనా?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. ఈ క్రమంలోనే ఆయన మరణవార్త విన్న దక్షిణాది సినీ ఇండస్ట్రీ తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే నటుడు పునీత్ కి తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి అనుబంధం ఉంది. ఈ అనుబంధంతో తెలుగు హీరోలు ఆయన మరణవార్త విని కడసారి తన మిత్రుడి చివరి చూపు కోసం బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి, ఎన్టీఆర్ వంటి వారు బెంగళూరుకు చేరుకొని పునీత్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.

ఈ క్రమంలోనే పునీత్ అభిమానులు తమిళ హీరోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పునీత్ కి తమిళ ఇండస్ట్రీలోను మంచి స్నేహితులు ఉన్నారు తెలుగు హీరోలు వచ్చి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించినప్పుడు తమిళ హీరోలు అందరూ ఎక్కడికి వెళ్లారు అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై వారి సినిమాలను కన్నడలో బైకాట్ చేస్తామంటూ నిరసనలు చేశారు.

తాజాగా తమిళ హీరోలు పునీత్ అంత్యక్రియలలో పాల్గొనకపోవడానికి కారణం ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇలా తమిళ హీరోలు పునీత్ అంత్యక్రియలలో పాల్గొనకపోవడానికి కారణం కావేరీ జలాలని తెలుస్తోంది.గత కొన్ని సంవత్సరాల నుంచి తమిళనాడు కర్ణాటక ప్రభుత్వాల మధ్య కావేరి జలాల వివాదం కొనసాగుతుందని ఈ క్రమంలోనే తమిళ సినిమాలను కన్నడలో విడుదల చేయకూడదంటూ అప్పట్లో కన్నడ హీరోలు నినాదాలు కూడా చేశారు.

ఇలా ఈ రెండు రాష్ట్రాల మధ్య కావేరి జలాల గొడవ ఉండడంతో ప్రస్తుతం అంత్యక్రియలకు తమిళ హీరోలు హాజరైతే ఇవి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయనే ఉద్దేశంతో పునీత్ అంత్యక్రియలలో పాల్గొనలేదని ఆయన మరణవార్త తెలియగానే చాలా మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పునీత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నట్లు తెలియజేశారు.