కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. ఈ క్రమంలోనే ఆయన మరణవార్త విన్న దక్షిణాది సినీ ఇండస్ట్రీ తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే నటుడు పునీత్ కి తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి అనుబంధం ఉంది. ఈ అనుబంధంతో తెలుగు హీరోలు ఆయన మరణవార్త విని కడసారి తన మిత్రుడి చివరి చూపు కోసం బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి, ఎన్టీఆర్ వంటి వారు బెంగళూరుకు చేరుకొని పునీత్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
ఈ క్రమంలోనే పునీత్ అభిమానులు తమిళ హీరోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పునీత్ కి తమిళ ఇండస్ట్రీలోను మంచి స్నేహితులు ఉన్నారు తెలుగు హీరోలు వచ్చి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించినప్పుడు తమిళ హీరోలు అందరూ ఎక్కడికి వెళ్లారు అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై వారి సినిమాలను కన్నడలో బైకాట్ చేస్తామంటూ నిరసనలు చేశారు.
తాజాగా తమిళ హీరోలు పునీత్ అంత్యక్రియలలో పాల్గొనకపోవడానికి కారణం ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇలా తమిళ హీరోలు పునీత్ అంత్యక్రియలలో పాల్గొనకపోవడానికి కారణం కావేరీ జలాలని తెలుస్తోంది.గత కొన్ని సంవత్సరాల నుంచి తమిళనాడు కర్ణాటక ప్రభుత్వాల మధ్య కావేరి జలాల వివాదం కొనసాగుతుందని ఈ క్రమంలోనే తమిళ సినిమాలను కన్నడలో విడుదల చేయకూడదంటూ అప్పట్లో కన్నడ హీరోలు నినాదాలు కూడా చేశారు.
ఇలా ఈ రెండు రాష్ట్రాల మధ్య కావేరి జలాల గొడవ ఉండడంతో ప్రస్తుతం అంత్యక్రియలకు తమిళ హీరోలు హాజరైతే ఇవి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయనే ఉద్దేశంతో పునీత్ అంత్యక్రియలలో పాల్గొనలేదని ఆయన మరణవార్త తెలియగానే చాలా మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పునీత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నట్లు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…