సాధారణంగా చాలా మందికి చిన్నప్పటి లవ్ స్టోరీ లు ఎన్నో ఉంటాయి. చాలామంది స్కూల్ ఏజ్ లోనే లవ్ పడటం వాటికి బ్రేక్ అప్ చెప్పుకోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. తాజాగా తన చిన్నప్పటి లవ్ స్టోరీని నటుడు తనిష్ బయటపెట్టారు. ఈ సందర్భంగా తనీష్ మాట్లాడుతూ…అయిదో తరగతి లోనే తన లవ్ స్టార్ట్ అయిందని ప్రముఖ నటుడు చెప్పారు.
తన ప్రేమ కథల గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని ఆయన అన్నారు. అందులో స్పెషల్ గా చెప్పుకునే మూమెంట్స్ కూడా ఉన్నాయని, అవి తన జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకమే అని ఆయన వివరించారు.
తనిష్ తన చిన్నప్పటి ప్రేమ కథలలో బాగా గుర్తుండి పోయే సన్నివేశం అంటే, తన ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నపుడు తన స్కూల్ టెర్రస్ మీదనే ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశానని ఆయన చెప్పారు. లంచ్ టైమ్ లో పూరీ డబ్బా ఇచ్చి మరీ తనకు ప్రపోజ్ చేశానని తనీష్ అన్నారు.
ఇంకో విషయం ఏంటంటే, ఇంకో అమ్మాయి కోసం తన ఇంటిని కూడా మారామని తనీష్ చెప్పారు. ఆ విషయం వాళ్ళ ఇంట్లో అప్పుడు తెలియదని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఈ మధ్యే తన అమ్మ గారితో అప్పుడు అలా జరిగింది కదా అని తనతో ఆ విషయాన్ని షేర్ చేసుకున్నట్టు ఆయన తెలిపారు. అయితే అందుకే వేరే ఇంటికి మారమా అని అడిగితే, లేదు నేనే వెళ్ళేటట్లు చేశానని ఈ సందర్భంగా తనీష్ తన చిన్నప్పటి ప్రేమ కథల గురించి చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…