Tag Archives: Ganga river

నదిలో కొట్టుకొచ్చిన చెక్క పెట్టె.. అది తెరిచి చూస్తే అందరికి షాక్?

సాధారణంగా ఆడపిల్ల పుడితే భారం అని భావించే వారు ఎంతోమంది ఆడపిల్లలు పుట్టగానే వారిని ముళ్ళ పొదలు, చెత్త కుండీలలో పడేయడం చూస్తుంటాను అదేవిధంగా మరికొందరు ఆడపిల్ల అని తెలియగానే కడుపులోని వారి ప్రాణాలను పైకి పంపిస్తున్నారు. కానీ ఉత్తర ప్రదేశ్ ఘాజీపూర్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. గంగానదిలో ఓ చెక్కపెట్టె కొట్టుకు వచ్చింది.అది చూసిన ఓ వ్యక్తి ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఓ చంటి బిడ్డ ఉండడం చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఘాజీపూర్‌లో సదర్ కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ వద్ద గంగానదిలో చంటిబిడ్డ ఏడుపులు వినిపించడంతో పడవ నడుపుతున్న వ్యక్తి ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందోనని గమనించాడు. అయితే ఆ ఏడుపు నదిలో కొట్టుకు వస్తున్న చెక్క పెట్టె నుంచి వినిపించడంతో ఆ వ్యక్తి ఆ బాక్స్ ను పట్టుకొని దానిని తెరిచి చూశాడు. అయితే అందులో ఒక ఆడ బిడ్డ అదేవిధంగా అమ్మవారి ఫోటో ఉండడం చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు.

చెక్క పెట్టెలో ఒక ఎర్రటి వస్త్రంలో 21 రోజుల వయసున్న ఆడబిడ్డ ఉండడంతో పాటు ఆ బిడ్డ జాతకం ప్రకారం ఆ బిడ్డకు గంగా అని పేరు పెట్టినట్లు ఒక కాగితంలో రాసి ఉంది. అదేవిధంగా ఆ పెట్టెలో అమ్మవారి ఫోటో ఉండడంతో ఆ వ్యక్తి ఆ గంగమ్మ తల్లి ఈ బిడ్డను తనకు ప్రసాదించిందని భావించి, ఆ బిడ్డ దొరకడం తమ అదృష్టం అనుకొని బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్ళాడు.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు బిడ్డను తన దగ్గర పెంచుకోవడానికి వీలులేదని ఆ చిన్నారిని తీసుకుని ఆశాజ్యోతి కేర్ సెంటర్ కు తరలించారు. అయితే ఈ బిడ్డను చెక్కపెట్టెలో ఎవరు నదిలో వదిలి ఉంటారు అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఏదిఏమైనా ఈ విధంగా చెక్కపెట్టెలో బిడ్డ కొట్టుకు రావడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

పోలీసుల ఎదుటే కరోనా శవాన్ని దారుణంగా.. చివరికి?

దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు అధికం అవుతున్న నేపథ్యంలో కరోనా శవాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి స్మశాన వాటికలో స్థలం లేకపోవడంతో ఎన్నో మృతదేహాలు గంగానదిలో కొట్టుకు వస్తున్న ఘటన చోటుచేసుకుంది. ఇప్పటికి కూడా గంగానది ఒడ్డుకు మృతదేహాలు కొట్టుకునే వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ విధంగా ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మృతదేహాలు పట్ల ఉత్తరప్రదేశ్లో అమానవీయ చోటు చేసుకుంది.

యూపీలోని బలియాలో గంగానది ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మృతదేహాన్నికోవిడ్ మృతదేహంగా భావించి అక్కడ ఉన్న స్థానికులు ఆ శవాన్ని కట్టెలపై ఉంచి పెట్రోల్, టైర్లు వేసి దహనం చేశారు. అయితే ఈ ఘటన ఐదుగురు పోలీసుల సమక్షంలో జరగడంతో ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గంగా నది ఒడ్డుకు కొట్టుకు వచ్చిన కరోనా మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిపించాలని,అందుకు తగిన ఆర్థిక సహాయం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందని ఇదివరకే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపినప్పటికీ, పోలీస్ అధికారులు ఎంతో బాధ్యతారహితంగా మృతదేహం పట్ల ఈ విధంగా వ్యవహరించడంతో అధికారులు ఆ అయిదుగురు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా గంగానది ఒడ్డుకు మృతదేహాలు కొట్టుకు వస్తున్నాయని, ఈ విధంగా మృతదేహాలు నీటిలో కలపడం వల్ల నీరు కలుషితంగా మారి మరి కొన్ని కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని, నీటి ద్వారా ప్రజల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా శవాలను పీక్కుతింటున్న రాబందులు, కుక్కలు.. ఎక్కడంటే?

దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు రోజు రోజుకూ దిగజారి పోతున్నాయి.ఈ క్రమంలోనే రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కాగా వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించడానికి స్మశాన వాటికలో స్థలం లేకుండా పోతుందంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా నదులలో మృతదేహాలు కొట్టుకు రావడం అందరినీ ఎంతో ఆశ్చర్యానికి, ఆందోళనకు గురి చేస్తోంది.గంగానదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు కొట్టుకురావడం బిహార్‌లోని బక్సర్‌ జిల్లాలో కలకలం రేపింది. మహదేవ్ ఘాట్ వద్ద కిలోమీటర్ల పరిధిలో సుమారు 50కి పైగా మృత దేహాలు కొట్టుకు రావడం చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కరోనా బారినపడి మృతి చెందినవారి అంత్యక్రియలను నిర్వహించకుండా ఈ విధంగా నదిలో పడేస్తున్నట్లు పోలీసులు భావించారు. వారం రోజుల నుంచి మహాదేవ్ ఘాట్ వద్ద డజన్ల కొద్ది సేవలు కొట్టుకు రావడంతో ఆ శవాలను రాబందులు, కుక్కలు పీక్కు తింటున్నాయి.

కొందరు మహదేవ్ ఘాట్, చౌసా, మిశ్రావలియాచుట్టుపక్కల గ్రామాల నుంచి అంత్యక్రియలు నిర్వహించడం కోసం ఇక్కడికి వచ్చిన వారు ఇక్కడ ఉన్న దృశ్యాలను చూసి అంతక్రియలు నిర్వహించకుండా వెనక్కి వెళ్తున్నారని స్థానికులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా కరోన బారినపడి కనీసం అంత్యక్రియలకు కూడా నోచుకోకుండా ఆ శవాలను గంగానదిలో పడటం వల్ల కుక్కలు, రాబందులు పీక్కు తినడం చూస్తుంటే మన దేశంలో కరోనా ఏవిధంగా ప్రళయం సృష్టిస్తుందో అర్థమవుతోంది. కనుక ఈ మహమ్మారి నుంచి బయట పడటానికి మార్గం తగిన జాగ్రత్తలు పాటించడమేనని అధికారులు తెలియజేస్తున్నారు.