Tag Archives: immunity power

రక్త కణాలు తగ్గిపోయాయా.. అయితే ఈ దుంపలు తినాల్సిందే..!

స్వీట్ పొటాటో లేదా చిలగడ దుంప ఈ పేరును ఇష్ట పడని వారు ఎవరు ఉండరు. ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయే ఈ చిలగడ దుంప వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..ఇందులో పిండి పదార్థాలతోపాటు చక్కెర శాతంగా కూడా ఎక్కువే. శరీరానికి కావల్సిన పోషకపదార్థాలను అందించడంలోనే కాదు వివిధ రకాలుగా శరీరంలో చేరిన విషపదార్థాలను తొలగించడంలో చిలుగడ దుంపలకు ప్రత్యేక స్థానం ఉంది. అనేక ఖనిజ లవణాలతో పాటు దుంపలలో పిండి పదార్థాలు(కార్బోహైడ్రేటులు), విటమిన్‌లు(బి,సి,ఇ) ఉన్నాయి.

ఇక చిలుగడదుంపలో కార్టినాయిడ్స్‌ మరియు పాలీఫినాల్స్‌ వంటి ఫైటో రసాయనాలు ఉన్నాయి.ఈ దుంపలో లభించే పోషక పదార్ధాల వినియోగం దానిని ఉడకపెట్టే విధానంపై ఆధారపడి ఉంటుంది.అలాగే ఈ చిలగడ దుంప ఎదిగే పిల్లలకు ఉడికించి తినిపించడం వల్ల శరీరంలో ఉన్న విషరసాయనాలు సులభంగా బయటకు పంపిస్తుంది. అలాగే ఫైబర్ ఇంకా విటమిన్ బి 6 అధికంగా ఉండే చిలగడదుంపలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

విటమిన్ సి అధికంగా ఉండే చిలగడదుంప రోగనిరోధక శక్తిని అందించడమే కాదు ఎముకలు , దంతాల ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఈ దుంప శరీరానికి బోలెడన్ని పోషకాలను అందించి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.ఇందులో ఉండే పొటాషియం హృదయ స్పందనలు, నరాల సంకేతాలను నియంత్రిస్తుంది. మూత్రపిండాల వ్యాధులు, వాపులు, కండరాల తిమ్మిర్ల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి అనుకునే వారు చిలగడ దుంప తినవచ్చు.అలాగే పొటాటో చిప్స్ కు బదులుగా స్వీట్ పొటాటో చిప్స్ ఎంచుకోండి. ఆలూ చిప్స్‌ చేసే హానికి దూరంగా మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. రక్తంలోని ఎర్ర, తెల్ల రక్తకణాలను అధికంగా ఉత్పత్తి చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది. చిలకడ దుంప మానసిక ఆందోళనలు తగ్గించేందుకు తోడ్పడుతుంది.

పచ్చిమిర్చితో ఉపయోగాలు తెలిస్తే.. మీరు వాటిని పక్కకు పెట్టరు.. అవేంటంటే..

కొన్ని కూరల్లో కచ్చితంగా పచ్చిమిర్చిని వేయాల్సి ఉంటుంది. అయితే ఇవి తింటే ఘాటుగా ఉంటుందని చాలామంది పక్కకు పెడుతుంటారు. అయితే వీటి వల్ల ఎన్నో ఉపయోగలు ఉన్నాయి. ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి…ప్రస్తుత పరిస్థితిలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని ప్రతీ ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. పచ్చిమిరపకాయలు దీనికి ఖచ్చితంగా సహాయపడతాయి.

ఆకుపచ్చ మిరపకాయలలో విటమిన్ సి మరియు బీటా కెరోటిన్ ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మనం రోజు తినే కూరలలో పచ్చిమిరపకాయలు కలిపితే రోగనిరోధక శక్తిని పెంచడం, మలబద్ధకం నుండి ఉపశమనం పొందడం ఇంకా బరువు తగ్గడానికి సహాయపడటం వంటి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇంకా దీనిలో ప్రొస్టేట్ కాన్సర్‌రు తగ్గించే గుణాలున్నాయి.

డయాబెటిస్ ఉన్నవారు పచ్చిమిర్చిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సమతుల్య రక్తంలో చక్కెర స్థాయిని కొనసాగించవచ్చు. ఆహారం జీర్ణం అవ్వడంలో కూడా పచ్చిమిర్చి ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మసౌందర్యానికి కూడా సహకరిస్తుంది. పచ్చిమిర్చిలో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇది పొరల మధ్య రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది మరియు శరీరంలో ఉత్పత్తి చేసే శ్లేష్మాన్ని సడలించింది. జలుబు మరియు ఫ్లూ వల్ల కలిగే అంటువ్యాధులను తొలగించి, మంచి ఉపశమనం కలిగించడానికి పచ్చిమిర్చి సహాయపడుతుంది.

అంతేకాదు.. ఇది చాలా రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాకు పచ్చిమిర్చి మందులా పనిచేస్తుంది. అంతేకాకుండా.. మిరపకాయ గింజలను నువ్వుల నూనెలో కాగబెట్టి, పూతగా రాస్తుంటే కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఒక గ్లాసు నీటిలో గులాబీ పూలు రెండు పచ్చిమిరపకాయలు ఉడికించి ఆ నీటిని పుక్కిలలిస్తే గొంతు నొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది.

రోగనిరోధక శక్తి పెంచుకోవాలా.. అయితే వీటిని తీసుకోండి..!

మన పూర్వికులు తినే ఆహారంలో పుష్కలంగా పోషకాలు, విటమిన్లు, ఖనిజలవణాలు ఉండే విధంగా ఆహార పదర్థాలు తినేవారు. కానీ కాలం మారింది. ప్రస్తుతం ఉరుకుల ప్రపంచంలో కనీసం ఆరోగ్యంపై శ్రద్ధ వహించే తీరిక లేకుండా పోయింది. ప్రస్తుతం వ్యవసాయంలో కూడా పండించే పంట కూడా మొత్తం ఎరువులమయం అయిపోయింది. తింటే రోగం.. తినకపోతే నీరసం.

ఇలాంటి దుస్థితి ఏర్పడింది. మన తాతలు, బామ్మలు, అమమ్మలు తిన్న తిండేనే ఇప్పుడు మనమూ ఇష్టపడుతున్నాం. సామలు, అరికెలు కొర్రలు, అండు కొర్రలు, ఊడలు అంటూ వీటి వెంట పడుతున్నాం. ఈ మార్పు ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సైతం చెబుతున్నారు. ప్రతీ ఒక్కరు చిరుధాన్యాలు తినేందుకు కూడా ఎక్కువగా మొగ్గు చూపతున్నారు.

దీనికి గల కారణం ఏంటంటే.. వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వీటిని మనం తినే ఆహారంలో భాగంగా చేసుకుంటే.. వైద్యుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. వ్యాధుల నుంచి రక్షించుకోవడం కోసం ఆహారపు అలవాట్లలో మార్పులు అనివార్యంగా మారింది. బరువు తగ్గేవారు రాగుల్లో ట్రిప్టోథాన్ అనే అమైనో ఆమ్లం ఉపయోగపడుతుంది. అందువల్ల రాగులు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కడుపులో అల్సర్ వంటివి తగ్గించడంలో చిరుధాన్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మలబద్దకం ఉన్న వారికి చిరుధాన్యాలు ఒక ఔషదంగా పనిచేస్తుంది. వీటిని రోజూ వారి ఆహారంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు.. త్వరగా ముసలితనం రాకుండా కూడా సహకరిస్తాయి.

చేపలు తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..! ఇంకా ఎన్నో సమస్యలకు చెక్..

ప్రస్తుతం కరోనా కాలంలో ప్రతీ ఒక్కరూ ఇమ్యూనిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి వివిధ రకాల పండ్లను, మాంసాహార పదర్ధాలను తింటున్నారు. మాంసాహార పదర్థాల్లో మనకు ముఖ్యంగా లభించే వాటిల్లో చేపలు ఒకటి. వీటిని ఎక్కువగా ఇష్టపడటానికి గల కారణం ఏంటంటే.. దీనిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అందుకే వారంలో కనీసం రెండు సార్లయినా చేపలు తింటే.. ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు అంటున్నారు నిపుణులు. చేపలను తినడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్ లాంటివి కంట్రోల్‌లో ఉంటాయి. హార్ట్ ఎటాక్, మెదడు సంబంధింత సమస్యల నుంచి కూడా గట్టెక్కవచ్చని పేర్కొంటున్నారు. చేపల్లో కొవ్వు తక్కువగా ఉంటమే కాకుండా అందులో నాణ్యమైన ప్రోటీన్స్ లభిస్తాయి. దీంతో శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. చేపలు తినడం వల్ల.. జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు మెదడు బాగా పనిచేస్తుంది. గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు.

ముఖ్యంగా దీనిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలోని ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీని ఫలితంగానే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవు. రక్తం సరఫరాకు ఉపయోగపడుతుంది. ఒత్తిడి, మానసిక ఆందోళనలు తగ్గుతాయి. విటమిన్ డి కూడా లభిస్తుంది. స్త్రీలలో పీరియడ్స్ సక్రమంగా రావాలంటే చేపలు తినాలి. కంటి చూపు మెరుగు అవుతుంది. కంటి సమస్యలు ఉన్నవారు చేపలు తినడం వల్ల సమస్యలు తొలగిపోతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అంతేకాకుండా టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు చేపలు తింటే మంచిదంటుననారు నిపుణులు. రక్త హీనతతో బాధపడేవారు ఈ చేపలు తినడం వల్ల హిమోగ్లీబిన్ సరిపడా ఉండేలా చేస్తుంది. పేగుల్లో గ్యాస్ ఇతరత్రా సమస్యలు కూడా తగ్గుముఖం పడుతాయి. శరీర ఉష్ణోగ్రతను చేపలు క్రమబద్ధీకరించి.. శక్తిని అందిస్తాయి. చేపల్లో ఉండే జింక్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు.

గుండె సమస్యలు ఉన్నవాళ్లు జీడిపప్పు తీసుకోవచ్చా..?

జీడిపప్పు అనేది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ మధ్య కాలంలో జీడిపప్పు అంటే తెలియని వారు లేరు.. దీనిని తినకుండా కూడా ఎవరూ లేరు. కరోనా కారణంగా వీటి కోసం క్యూ కట్టారు. వీటిని కొనాలన్నా కూడా జేబులు ఖాళీ అవ్వడం ఖాయం.. ఎందకంటే వాటి ధర కూడా అంతే ఎక్కువగా ఉంటుంది.

ఈ జీడిపప్పులో కొలెస్టరాల్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా బ్రెజిల్ దేశంలో ఉంటాయి. జీడిపప్పులో ప్రొటీన్లు సమృద్ధి ఉంటాయి. ఈ ప్రొటీన్‌ చాలా సులభంగా జీర్ణమవుతుంది కూడా. మాంసంలో కన్నా ఎక్కువ ప్రొటీన్‌ జీడిపప్పులో ఉంటుంది. కిడ్నీ ఆకృతిలో కనపడటమే కాదు దీనివల్ల కిడ్నీలకు కలిగే ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే చాలామందికి వీటిని తినడం వల్ల గుండెకు ఏమైనా ప్రమాదం ఉంటుందా అని.. అలాంటిది ఏమి ఉండదు.

ఇది గుండెకు ఎలాంటి హాని చేయదు. దీనిలో మెగ్నీషియం నిల్వలు కూడా అధికంగా ఉండటంతో ఎముకలు పుష్టికి ఇవి దోహదపడుతాయి. మన శరీరానికి సుమారు 300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరమవుతుంది కనుక జీడిపప్పు రోజూ తీసుకుంటే మేలు. దీనిని రక్తపోటు ఉన్నవాళ్లు కూడా వీటిని తీసుకోవచ్చు. దీనిలో సోడియం శాతం తక్కువగాను.. పొటాషియం ఎక్కువగాను ఉంటుంది. కేన్సర్ సమస్యను అడ్డుకునే యాంటి ఆక్సిడెంట్లను జీడిపప్పు కలిగి ఉంది.

విటమిన్ ఈ కూడా ఇందులో ఉంటుంది కనుక ఇవి కేన్సర్‌ను రాకుండా అడ్డుకుంటాయి. జీడిపప్పును ఎండుద్రాక్షతో కలిపి తీసుకుంటే రుచికరంగా ఉండడమే కాకుండా, రక్తహీనత కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజూ పరగడుపున కొద్దిగా జీడిపప్పు, తేనెతో తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. బొల్లివ్యాధిని తగ్గించడంలో కూడా జీడిపప్పు బాగా ఉపయోగపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచే పైనాపిల్ కూర.. ఎలా చేయాలో తెలుసా?

ప్రస్తుతం కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు వారి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే విటమిన్-సి అధికంగా లభించే పండ్లు, కూరలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే వాటిలో పైనాపిల్ ఒకటి. పైనాపిల్ లో కేవలం రోగనిరోధకశక్తిని పెంపొందించే గుణాలు మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మరి ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ పైనాపిల్ కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:
పైనాపిల్ ఒకటి, ఒక కప్పు కొబ్బరి పొడి, ఆవాలు టేబుల్ స్పూన్,2 స్పూన్ల బెల్లం, తగినంత ఉప్పు, 2 ఎండుమిర్చి, కరివేపాకు రెమ్మ, తగినన్ని నీళ్లు, మూడు టేబుల్ స్పూన్ల నూనె.

తయారీ విధానం:
ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి కొబ్బరి తురుము, కొద్దిగా ఉప్పు, ఆ ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు, బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని కొన్ని నీళ్లు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమంలో కి ముందుగా కట్ చేసి పెట్టుకొన్న పైనాపిల్ ముక్కలను వేసి బాగా కలియ బెట్టాలి.

ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులోకి మూడు స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. ఆవాలు చిటపట అన్న తర్వాత ఈ పోపును తీసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకొన్న పైనాపిల్ మిశ్రమంలోకి వేస్తే ఎంతో రుచికరమైన పైనాపిల్ కూర తయారైనట్లే. ఈ పైనాపిల్ కూరను వేడి వేడి అన్నంలోకి లేదా ఉప్మా లోకి తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది.

షుగర్ ఉంటే గ్రీన్ టీ తాగొచ్చా.. ఆరోగ్యానికి మంచిదా?

ప్రపంచంలో ఎక్కువ మంది బాధపడే సమస్యలలో మధుమేహ సమస్య ఒకటి. రోజురోజుకు మధుమేహంతో బాధపడే వారి సంఖ్య అధికమవుతుంది. ఈ క్రమంలోనే మన శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవాలంటే చాలామంది వారి ఆహారంలో ఎన్నో నియమాలను పాటిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తీయని పదార్థాలు తగ్గించడం. కాఫీ టీ లను తగ్గించడం వంటివి చేస్తుంటారు. కాఫీ లేదా టీ లను అధికంగా తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయని భావన ఉండటం వల్ల పూర్తిగా కాఫీ టీలను పక్కన పెడుతుంటారు. ఈ క్రమంలోనే షుగర్ వ్యాధితో బాధపడే వారు గ్రీన్ టీ తాగవచ్చా? ఇది తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదకరం ఉండదా? అనే సందేహాలు తలెత్తుతుంటాయి.

షుగర్ తో బాధపడేవారికి గ్రీన్ టీ ఒక మంచి పానీయం అని చెప్పవచ్చు. ప్రతిరోజు మూడు కప్పులు గ్రీన్ టీ తాగడం వల్ల మన శరీరంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచడమే కాకుండా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధికభాగం యాంటిఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇవి మన శరీరానికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తాయి. అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపించడంలో యాంటీఆక్సిడెంట్లు దోహదపడతాయి.

ఈ గ్రీన్ టీ తాగటం వల్ల మన శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఈ క్రమంలోనే టైప్ 2 డయాబెటిస్ వల్ల వచ్చే సమస్యలు పూర్తిగా తగ్గుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.కనుక మధుమేహ సమస్యతో బాధపడేవారు గ్రీన్ టీ నిస్సంకోచంగా తాగ్గొచ్చని చెప్పవచ్చు.

గ్రీన్ టీ తాగటం వల్ల కేవలం మన శరీరంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచడమే కాకుండా, అధిక రక్తపోటు గుండె సమస్యలను దరిచేరనివ్వదు. అదేవిధంగా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని మొత్తం కరిగిస్తుంది. గ్రీన్ టీ లో అధిక భాగం యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదపడుతుంది.

ఈ ఆయుర్వేద మందులతో రోగనిరోధక శక్తిని పెంచుకోండి!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కరోనా బారిన పడకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని తెలియడంతో ప్రతి ఒక్కరు రోగ నిరోధకశక్తిని పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే వివిధ రకాల ఆహార పదార్థాలను, కషాయాలను, పానీయాలను తయారు చేసుకొని తాగడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు అని భావిస్తున్నారు.

ఈ భయంకరమైన మహమ్మారినికట్టడి చేయడానికి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనల అనంతరం వ్యాక్సిన్ ను కనుగొన్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు కృష్ణ పట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మెడిసిన్ వల్ల కరోనా నుంచి తొందరగా విముక్తి కావచ్చని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ విషయంలోనే ఎన్నో పరిశోధనలు జరిపిన ప్రభుత్వం సైతం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీకి అనుమతి తెలిపింది. కానీ కరోనా రాక మునుపే ఆయుర్వేదంలో ఈ విధమైనటువంటి మందులు ఎన్నో ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద మందులు చాలా ఉన్నాయి. మరి అవి ఏమిటో తెలుసుకుందాం.

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎక్కువమంది రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం తిప్పతీగను అధికంగా ఉపయోగిస్తున్నారు. తిప్పతీగ చూర్ణం లేదా గుళికలు, పౌడర్ రూపంలో మనకు లభిస్తుంది.దీనిని తరచూ తీసుకోవడం ద్వారా మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ తిప్పతీగ చూర్ణాన్ని మనకు జ్వరం చేసినప్పుడు మందులకు బదులుగా ఈ తిప్పతీగ కషాయం తాగడం వల్ల త్వరగా శరీర వేడిని తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం ఆమోదం తెలిపిన ఆయుర్వేద మందులు తిప్పతీగ ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది.

తిప్పతీగలతోపాటు అశ్వగంధ, అతి మధురం, నేల వేము కూడా రోగనిరోధక శక్తిని పెంచుతాయి.  అదేవిధంగా దాల్చిన చెక్క, మిరియాలు, సొంఠితో దీన్ని రూపొందించారు. వేడి చేసే గుణం గల ఈ కషాయంలో యాంటీ వైరల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల ఇది మన శరీరంలోకి ప్రవేశించిన హానికర బ్యాక్టీరియా వైరస్ లను నాశనం చేయడానికి దోహదపడతాయి.ఈ విధమైనటువంటి ఆయుర్వేద మందులను తరచూ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని ఢిల్లీ ఎంసీడీ ఆయుష్ విభాగం చీఫ్ మెడికల్ ఆఫీసర్, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ కామేశ్వరరావు తెలిపారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఇమ్యూనిటీ లేకపోతే వ్యాక్సిన్ పని చేయదా… నిపుణులు ఏమంటున్నారంటే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం మనముందున్న ఏకైక అస్త్రం వ్యాక్సిన్.దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ వైరస్ ను కట్టడి చేయగలమని అధికారులు తెలియజేస్తున్నారు.ఈ సమయంలోనే వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా శరీరంలో అయితే రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ పవర్) తక్కువగా ఉన్న వారు వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకుంటే అది పని చేస్తుందా? ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే సందేహాలు తరచూ తలెత్తుతున్నాయి. మరి ఈ విషయాలకు నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా వయసు పైబడే కొద్దీ మన శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే మన పై ఎన్నో రకాల వైరస్ లు దాడి చేసి మనల్ని తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుంటాయి. అందుకోసమే చాలామంది రోగనిరోధక శక్తి పెరిగే ఆహార పదార్థాలను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మన శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా ఉండటం వల్ల వ్యాధి వ్యాపింప చేసే బ్యాక్టీరియాలు లేదా వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటిని ఎదుర్కొనే యాంటీబాడీలను రోగనిరోధక శక్తి ఉత్పత్తి చేస్తుంది. అందుకోసమే మన శరీరంలో అధికంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక వ్యాక్సిన్ విషయానికి వస్తే కరోనా వ్యాక్సిన్ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో వేయడం వల్ల వారిలో యాంటీబాడీలు ఉత్పత్తి పెరుగుతుంది. కనుక వయసుపైబడిన వారు ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలనీ తెలియజేస్తున్నారు.i వ్యాక్సిన్ మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది కానీ వైరస్ ను చంపదు. ఈ క్రమంలోనే మన శరీరంలో సహజంగా యాంటీబాడీలు ఉత్పత్తి కావడం వల్ల వ్యాధితో పోరాడుతాయి. ఒకవేళ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ వైరస్ బారిన పడిన మరణం సంభవించదని నిపుణులు తెలియజేస్తున్నారు.

కరోనా వేళా.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాపించి ఉన్న కరోనా పరిస్థితులలో ఏ వస్తువు తాకాలన్న ఎంతో భయం వేస్తుంది. అదే విధంగా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలన్న ఎక్కడ వైరస్ బారిన పడతామో అనే అనుమానాలు కలుగుతుంటాయి. వైరస్ భయం పెట్టుకుని ఏ వస్తువుని తినకుండా ఉండలేము.. అలాగే ఏ పదార్థాలను తాగకుండా ఉండలేము. కనుక మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ బారినపడకుండా ఉంటామో జాతీయ పోషకాహార సంస్థ సూచిస్తోంది.

మనం కూరగాయల కోసం మార్కెట్ కు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మన ఇంట్లో ఉపయోగించే సంచిని మన వెంట తీసుకువెళ్లాలి. మార్కెట్లో మనకు అవసరమైన కూరగాయలను మాత్రమే తాకి జాగ్రత్తగా సంచిలో వేయించుకోవాలి.మార్కెట్లో రెండు మూడు రోజుల క్రితం వాడిపోయిన కూరగాయలు కాకుండా తాజాగా ఉన్న కూరగాయలు మాత్రమే తెచ్చుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత కూరగాయలను కొళాయి కింద శుభ్రం చేయాలి. ఈ విధంగా పారుతున్న నీటి కింద శుభ్రం చేయటం వల్ల ఎలాంటి వైరస్ అయిన నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుంది.

ఈ విధంగా కూరగాయలను, మాంసాన్ని శుభ్రంగా కడిగి వాటిని ఫ్రిజ్లో భద్రపరచుకోవాలి. మరికొందరు బయట నుంచి ఆహారపదార్థాలను తెప్పించుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఆహార పదార్థాలు వచ్చినప్పుడు ఆహారపదార్థాలకు తగలకుండా బయట కవర్ పై శానిటైజ్ చేసి ఆ కవర్లను చెత్తకుండీలో పడేసిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం ఆహారపదార్థాలను చేతితో తాకకుండా గరిటే ద్వారా వడ్డించుకోవాలి.

మనం కూరగాయలను కట్ చేసే కత్తి నుంచి మొదలుకొని ప్రతి ఒక్క వస్తువును ఎంతో శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి. ఈ విధంగా ప్రతి ఒక్క వస్తువులను శుభ్రం చేసిన తర్వాత తప్పకుండా మన చేతులను కూడా శుభ్రం చేసుకోవాలి. ఫ్రిజ్లో భద్రపరిచి కూరలు ఇతర పదార్థాలకు తప్పకుండ మూతపెట్టి భద్రపరుచుకోవాలి. ముఖ్యంగా మన చేతి గోళ్ళను పెరగకుండా ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలని, ఈ విధమైనటువంటి జాగ్రత్తలను పాటించినప్పుడు మనం ఎంతో సురక్షితంగా ఉండవచ్చని జాతీయ పోషకాహార సంస్థ పలు సూచనలు చేసింది.