కొన్ని కూరల్లో కచ్చితంగా పచ్చిమిర్చిని వేయాల్సి ఉంటుంది. అయితే ఇవి తింటే ఘాటుగా ఉంటుందని చాలామంది పక్కకు పెడుతుంటారు. అయితే వీటి వల్ల ఎన్నో ఉపయోగలు ఉన్నాయి. ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి…ప్రస్తుత పరిస్థితిలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని ప్రతీ ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. పచ్చిమిరపకాయలు దీనికి ఖచ్చితంగా సహాయపడతాయి.
ఆకుపచ్చ మిరపకాయలలో విటమిన్ సి మరియు బీటా కెరోటిన్ ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మనం రోజు తినే కూరలలో పచ్చిమిరపకాయలు కలిపితే రోగనిరోధక శక్తిని పెంచడం, మలబద్ధకం నుండి ఉపశమనం పొందడం ఇంకా బరువు తగ్గడానికి సహాయపడటం వంటి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇంకా దీనిలో ప్రొస్టేట్ కాన్సర్‌రు తగ్గించే గుణాలున్నాయి.
డయాబెటిస్ ఉన్నవారు పచ్చిమిర్చిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సమతుల్య రక్తంలో చక్కెర స్థాయిని కొనసాగించవచ్చు. ఆహారం జీర్ణం అవ్వడంలో కూడా పచ్చిమిర్చి ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మసౌందర్యానికి కూడా సహకరిస్తుంది. పచ్చిమిర్చిలో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇది పొరల మధ్య రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది మరియు శరీరంలో ఉత్పత్తి చేసే శ్లేష్మాన్ని సడలించింది. జలుబు మరియు ఫ్లూ వల్ల కలిగే అంటువ్యాధులను తొలగించి, మంచి ఉపశమనం కలిగించడానికి పచ్చిమిర్చి సహాయపడుతుంది.
అంతేకాదు.. ఇది చాలా రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాకు పచ్చిమిర్చి మందులా పనిచేస్తుంది. అంతేకాకుండా.. మిరపకాయ గింజలను నువ్వుల నూనెలో కాగబెట్టి, పూతగా రాస్తుంటే కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఒక గ్లాసు నీటిలో గులాబీ పూలు రెండు పచ్చిమిరపకాయలు ఉడికించి ఆ నీటిని పుక్కిలలిస్తే గొంతు నొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…