Tag Archives: jayalalitha

Actress Satya Priya : శోభన్ బాబు, జయలలిత కు ఒక కూతురు.. అనే వదంతుల్లో పచ్చి నిజాలు బయటపెట్టిన సత్యప్రియ.!!

జయలలిత రాజకీయాలలోకి రాకముందు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించింది. 1961 నుంచి 1980 వరకు ఎక్కువగా కథానాయికగా వివిధ రీతుల చిత్రాలలో, వైవిధ్యభరితమైన పాత్రలలో నటించింది. నాట్యంలో కూడా ఆమెది అందే వేసినచేయి. ఒకరకంగా తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా కొద్దికాలం పాటు ఏలింది. తమిళనాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన ఆల్ ఇండియా అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగం యొక్క సాధారణ కార్యదర్శి. ఆమె అభిమానులు ఆమెను పురట్చి తలైవి (విప్లవ నాయకురాలు)అని పిలుచుకుంటారు.

ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. ఎం.జీ.ఆర్ రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఎంజీఆర్, జయలలిత తమిళ ఇండస్ట్రీలో “ది బెస్ట్ పేయిర్” గా చెప్పుకోవచ్చు. వీరిద్దరు కలిసి దాదాపు 28 చిత్రాల్లో కలిసి నటించారు. వీరు కలిసి మొదటగా 1964లో “ఆయిరత్తిల్ ఒరువన్” అనే చిత్రంలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఆ తరువాత అనేకమంది తెలుగు తమిళ కన్నడ మలయాళ హీరోలు ఆమెతో నటించడానికి ఉత్సాహం చూపేవారు.

1970 ఆ ప్రాంతంలో ఎంజీఆర్.. జయలలితను కాకుండా చంద్రకళ, మంజుల, లత కథానాయికలుగా ఓ తమిళ చిత్రంలో ఎంజీఆర్ నటించారు. తనను కాదని వేరే కథానాయికలతో ఎంజీఆర్ నటించడం జయలలితకు నచ్చలేదు. ఆ క్రమంలో జయలలిత, ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగింది. 1971లో జయలలిత తల్లి స్వర్గస్తులయ్యారు. ఆ తర్వాత ఒక్కసారిగా జయలలితకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగులో (1973) శోభన్ బాబుతో నటించే అవకాశం వచ్చింది. అలా శోభన్ బాబు, జయలలిత కలిసి “డాక్టర్ బాబు” చిత్రంలో కలిసి నటించారు ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. 1975 వచ్చేసరికి తమిళంలో పూర్తిగా అవకాశాలు తగ్గడంతో ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో శోభన్ బాబుతో సాన్నిహిత్యం పెరిగింది.

1979 “స్టార్ అండ్ స్టైల్” అనే ఓ ఇంగ్లీషు పత్రిక వీరి రహస్య అనుబంధం గురించి రాయడం జరిగింది. ఈ ఇంగ్లీష్ ఆర్టికల్ ని తమిళనాట బాగా పేరు పొందిన “కుముదం” పత్రిక తమిళంలోకి అనువదించి జయలలిత, శోభన్ బాబు రహస్య అనుబంధం గురించి రాశారు. దానికి స్పందించిన జయలలిత.. శోభన్ బాబు తనకు మధ్య బంధం ఉందని… ఒకరి బాధలు, భావాలు పంచుకునేంత దగ్గరని అది ఎంతో పవిత్రమైన అనుబంధమని.. శోభన్ బాబును తను కలిసే నాటికి ఆయన వివాహితుడని కావున ఆయన సతీమణికి ద్రోహం చేయలేదని ఆమె చెప్పుకొచ్చారు. ఆ తరువాత‌ వారి రహస్య అనుబంధం గురించి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలో పుంఖానుపుంఖాలుగా వదంతులతో కూడిన వార్తలు దినపత్రికలో వచ్చాయి. శోభన్ బాబు, జయలలిత మధ్య గల ఆ రహస్య అనుబంధం ఏమిటి అన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

అయితే ఈ మధ్యకాలంలో అలనాటి నటి సత్యప్రియ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ… శోభన్ బాబు, జయలలిత మధ్య రహస్య అనుబంధం గురించి ఆమెను అడగగా…. జయలలిత పర్సనల్ మేకప్ మెన్ తనకు కూడా మేకప్ మేన్ గా పని చేశారని… శోభన్ బాబు, జయలలిత మధ్య అనుబంధం నిజమేనని… కానీ వారిద్దరికీ కలిసి ఒక కూతురుకు జన్మించిందనేది అవాస్తవమని మేకప్ మెన్ చెప్పారని.. ఒక్కసారి జయలలిత ద్వేశించిన వ్యక్తిని మల్లి దగ్గరికి రానివ్వదని జయలలిత ముఖ్యమంత్రి అయ్యాక ఒకప్పుడు పర్సనల్ మేకప్ మెన్ గా పని చేసిన అనుబంధంతో ఆమెను కలుద్దామని వెళ్లేసరికి తనను గేటు వద్ద నుంచే పంపించిందని మేకప్ మెన్ తనతో అన్నారని సత్యప్రియ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Krishna: దివంగత సీఎం జయలలితకు ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన కృష్ణ.. అసలేం జరిగిందంటే?

Krishna: ఐదు దశాబ్దాలకు సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నట శేఖర్ కృష్ణ ఇక లేరు అనే వార్త ఇప్పటికీ మింగుడు పడటం లేదు. ఎన్నో సాహస ప్రయోగాత్మక సినిమాలను పరిచయం చేసిన ఘనత కృష్ణ గారికి ఉందని చెప్పాలి. ఇలా తన సినీ కెరియర్లో 350కు పైగా సినిమాలలో నటించిన ఈయన తుది శ్వాస విడిచారు.

సినీ ప్రస్థానంలో ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోవాల్సిందే.సాధారణంగా ఎవరైనా తమ కూతురు కుమారుడు పెళ్లికి సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తారు. అయితే కృష్ణ మాత్రమే ఏకంగా దివంగత మాజీ సీఎంకు ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పారట. ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే..

కృష్ణ గారు పెద్ద కుమార్తె పద్మావతి వివాహాన్ని గల్లా జయదేవ్ తో నిశ్చయించారు. వీరి వివాహం చెన్నైలో జరగనుంది. ఈ క్రమంలోనే తన పెద్ద కుమార్తె వివాహానికి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జయలలితను కృష్ణ స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. జయలలిత కూడా తన కుమార్తె వివాహానికి రావడానికి ఆసక్తి చూపింది.ఇక వివాహ మూడు రోజులు ఉందనగా జయలలిత సెక్యూరిటీ వచ్చి సెక్యూరిటీ పరంగా ముందు మూడు వరుసలు ముఖ్యమంత్రి గారికి కేటాయించాలని సూచించారట.

Krishna: సెక్యూరిటీ పరంగా జయలలితను రావద్దని చెప్పిన కృష్ణ…

ఈ విషయం తెలుసుకున్న కృష్ణ తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా తరలివస్తారు అలాంటిది 3 వరుసలు కేవలం జయలలిత గారి కోసం కేటాయించడం కుదరదు అంటూ ఆమెకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించి ఎంతో సున్నితంగా తన కూతురు పెళ్లికి రావద్దని మీ ఆశీర్వాదాలు ఉంటే చాలని చెప్పారట.పరిస్థితి అర్థం చేసుకున్నటువంటి జయలలిత సైతం పెళ్లి రోజు వధూవరులకు ఒక బోకే పంపించి వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Jayalalitha: వాణిశ్రీ తనకు మద్దతు తెలుపలేదని పంతానికిపోయి జయలలిత ఏం చేసారో తెలుసా?

Jayalalitha: సినిమా పరిశ్రమలో నటీమణులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జయలలిత వాణిశ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగు తమిళ భాషలలో ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ఇద్దరు నటీమణులు ప్రాణ స్నేహితులు కూడా.అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న తర్వాత జయలలిత రాజకీయాలలోకి వచ్చారు. కానీ వాణిశ్రీ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

వాణిశ్రీని రాజకీయాల గురించి ప్రశ్నించగా తనకు రాజకీయాలలోకి రావడం ఇష్టం లేదని ఐదు సంవత్సరాల పదవి కోసం రోడ్డుపై పడి పరువు మర్యాదలు పోగొట్టుకోవడం తనకు ఇష్టం లేదని తెలిపారు. అయితే జయలలిత మాత్రం రాజకీయాలపై మక్కువతో రాజకీయాలలోకి వచ్చారు. ఈ క్రమంలోనే ఆమెకు రాజకీయ రంగంలో మద్దతు తెలపాల్సిందిగా స్వయంగా జయలలిత వాణిశ్రీని కోరారు.

ఈ విధంగా జయలలిత కోరడంతో వాణిశ్రీ సున్నితంగా తిరస్కరించింది. దీంతో వాణిశ్రీ పై జయలలిత పట్టలేనంత కోపం పగ పెంచుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి జయలలిత అధికారంలోకి వచ్చిన తర్వాత
సొంత పార్టీ ఏఐఏడీఎంకే.. నాయ‌కుడు.. ఒక‌రు వాణిశ్రీకి మ‌ద్రాసు శివారులో ఉన్న ఒక ఫాం హౌస్‌ను ఆక్ర‌మించుకున్నారు.

Jayalalitha: కోపంతోనే జయలలిత అలా చేసిందా…

ఈ క్రమంలోనే ఈ విషయంపై వాణిశ్రీ ఏకంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ జయలలిత ఏ మాత్రం తనకు న్యాయం చేయలేదట. కేవలం తనకు మద్దతు తెలుపలేదన్న కారణంతోనే తనపై పగ పెంచుకున్నారు. ఇక జయలలిత అధికారంలో లేకపోయినప్పటికీ ఆమెకు ఈ ఫామ్ హౌస్ విషయంలో న్యాయం జరగలేదని అమ్మ మాట కాదని ఎవరు కూడా తనకు న్యాయం చేయలేకపోయారని తెలుస్తోంది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఫామ్ హౌస్ తిరిగి తనకు ఇప్పించారు.

Jayalalitha: నటి జయలలిత మరణం పై వెలుగులోకి వచ్చిన నిజాలు.. ఆ విషయాలన్నీ బయటపెట్టిన ఆర్ముగ స్వామి కమిషన్!

Jayalalitha: తమిళనాడు ప్రజలకు అమ్మగా ఎంతో మంచి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న నటి దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం నుంచి ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు కోలుకోలేకపోతున్నారు. ఈమె మరణించి సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ ఈమె మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే నటి జయలలిత మరణం పై ఎన్నో అనుమానాలు కూడా గతంలో వ్యక్తం అయ్యాయి.

ఈ క్రమంలోనే జయలలిత మరణం పై తమిళనాడు ప్రభుత్వం ఆర్ముగ స్వామి కమిషన్ ద్వారా విచారణ చేపట్టాలనీ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కమిషన్ ఒక రిపోర్ట్ తయారుచేసి తమిళనాడు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ నివేదికలో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ క్రమంలోనే దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్య సమస్యల కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2016 డిసెంబర్ 5 వ తేదీ రాత్రి 10 గంటలకు మరణించారని అపోలో హాస్పిటల్ వైద్యులు అధికారికంగా వెల్లడించారు. అయితే ఈమె మరెన్నో వార్త పై ఎన్నో అనుమానాలు సందేహం వ్యక్తం అవడంతో తమిళనాడు ప్రభుత్వం అమ్మ మరణం పై దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు.

Jayalalitha వెలుగులోకి వచ్చిన నిజాలు…

ఈ క్రమంలోనే ఆర్ముగ స్వామి కమిషన్ జయలలిత మరణం పై దర్యాప్తు చేసిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం జయలలిత డిసెంబర్ 4 మధ్యాహ్నం 3:50 సమయంలోనే మరణించారని పేర్కొన్నారు. అయితే ఈమె డిసెంబర్ 4వ తేదీ మరణించడంతో డిసెంబర్ 5న అధికారకంగా ప్రకటించారు. మరి ఈ 31 గంటల వ్యవధిలో ఏం జరిగింది అనే విషయం తెలియాల్సి ఉంది.

జయలతిత, ఎన్టీఆర్ జాతకాలు ఒక్కటే.. రాజకీయాల్లోకి వస్తే సీఎం అవుతాడు.. వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు..

సమంత విడాకుల వ్యవహారంతో హాట్ టాపిక్ గా మారిన సినీ జ్యోతిష్యుడు వేణు స్వామి. సమంత-నాగ చైతన్యలు విడిపోకముందే జోస్యం చెప్పాడు. అతడు చెప్పిన విధంగానే జరిగింది. ఇతగాడు.. అఖిల్ కు నిశ్చితార్థం జరిగినా పెళ్లి జరగదని తేల్చిచెప్పాడు. అది కూడా అక్షరాల అదే జరిగింది. వేణు స్వామి చాలా మంది సినీ ప్రముఖులకు జ్యోతిష్యుడు.

రాజకీయ పార్టీల భవిష్యత్తుపై కూడా జ్యోతిష్యం చెబుతాడు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ 17 ఏళ్లపాటు సీఎంగా కొనసాగనున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం ఆయన నిజానికి రాజకీయాల్లోకి వచ్చారు. 2024 నాటికి పార్టీ ఉండదు అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ కూడా భవిష్యత్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేసింది. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి..? దానికి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే సమాధానం అన్నారు.

“ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తు చాలా బాగుంది. టీడీపీ గెలుపుకు ఏకైక మార్గం జూనియర్ ఎన్టీఆర్ అని అన్నాడు. ఈ విషయం ఇప్పుడే కాదు.. రెండేళ్ల క్రితం కూడా చెప్పానన్నాడు. చంద్రబాబు వల్ల గానీ.. లోకేష్ వల్లగానీ టీడీపీని గట్టెక్కించడం కష్టం అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వల్లనే టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పాడు. 2024లో చంద్రబాబు, లోకేష్ లతో కలిసి టీడీపీ ఎన్నికలకు వెళితే అసలు పోటీ కూడా లేకుండా పోతుందని.. బాలకృష్ణ జాతకాన్ని బట్టి చూస్తే.. ఆయనకు సీఎం అయ్యే యోగం లేదన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కు వందశాతం అదృష్టం ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ మెయిన్ స్టార్.. జయలలిత కూడా అదే స్టార్. ఈ నక్షత్రంలో పుట్టిన వారు రాజకీయాల్లో రాణిస్తారు. ఎన్టీఆర్ చాలా పవర్ ఫుల్ జాతకం. రాజకీయాల్లోకి వస్తే ఇక తిరుగుండదు’ అన్నాడు వేణుస్వామి.

మలయాళ డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్న జయలలిత.. కానీ చివరికిలా విడిపోయారు..?

ఒకప్పుడు క్లాసికల్ డాన్సర్ లుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న చల్లా సిస్టర్స్ గురించి ఈ తరం వారికి తెలియనప్పటికీ అప్పట్లో వీరు ఎంతో ఫేమస్ అయ్యారు. ఇలా చల్లా సిస్టర్ గా పేరు సంపాదించుకున్న వారిలో జయలలిత ఒకరు. చూడగానే ఆకట్టుకునే అందం ఉన్న జయలలితకి కాలం కలిసి రాక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేక కేవలం వ్యాంప్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయారు.

ఇలా ఎన్నో సినిమాల్లో వ్యాంప్ ఆర్టిస్టుగా చేసిన ఈమె ఆ తరువాత బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా సందడి చేశారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తన వ్యక్తిగత జీవితంలో ఒక మలయాళ డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్న విషయం చాలా మందికి తెలియదు. ఈమె డైరెక్టర్ వినోద్ అనే వ్యక్తిని ఏడు సంవత్సరాల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పలు కారణాల చేత వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు.

జయలలిత సినిమాలలో నటించే సమయంలో ఆమెకు తెలియకుండా తన తండ్రి జయదేవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి, డైరెక్టర్ క్రాస్ బెల్ట్ మనీ చిత్రానికి ఓకే డేట్స్ ఇచ్చారు. అయితే ఈ విషయం తెలియక జయలలిత వినోద్ తండ్రి జయదేవన్ సినిమా షూటింగ్లో పాల్గొనడం అదే సమయంలో డైరెక్టర్ క్రాస్ బెల్ట్ మనీ మనుషులు వచ్చి ఆమెతో గొడవకు దిగారు. మా సినిమాకు డేట్స్ ఇచ్చి ఇక్కడ ఎలా చేస్తున్నావ్ అంటూ ఆమెతో గొడవ పెట్టుకున్నారు. అయితే ఆ సమయంలో ఏం చేయాలో తెలియని జయలలిత కన్నీళ్లు పెట్టుకుంది.

ఈ సమయంలో వినోద ఒక హీరోగా ఎంట్రీ ఇచ్చి వారి నుంచి ఆమెను కాపాడారు. ఇలా తనని కాపాడటంతో జయలలిత అతనితో ప్రేమలో పడింది. అయితే అతడితో చాల జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచించినప్పటికీ ఈమె వారి విషయాలను పట్టించుకోకుండా తన ప్రేమలో మునిగిపోయి ఎన్నో అద్భుతమైన సినిమా అవకాశాలను కూడా వదులుకొని ఏడేళ్ల ప్రేమ తర్వాత వివాహం చేసుకుంది. వివాహం తర్వాత వినోద్ అని ఎన్నో చిత్రహింసలకు గురి చేయడంతో విడాకులు తీసుకుంది.

జయలలిత, జమున మధ్య ఆ కారణం వల్ల గొడవ జరిగిందనే సంగతి మీకు తెలుసా?

అలనాటి అందాల తారలు, నటీమణులు అయిన జయలలిత, జమున అందచందాలు, నటనా నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందిన ఈ నటీమణులు ఇద్దరూ ఎక్కువ ఆత్మాభిమానం కలవారు. ఆత్మాభిమాన విషయంలో ఈ ఇద్దరు తొందరగా రాజీపడరని చెప్పవచ్చు.ఈ ఆత్మ అభిమానం కారణంగానే జయలలిత హీరోయిన్ గా గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు స్టార్ హీరోలైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాలలో నటించే అవకాశాలను కొంతకాలం పాటు వదులుకున్నారని చెప్పవచ్చు.

ఈ విధంగా ఎంతో ఆత్మాభిమానం ఉన్న ఈ స్టార్ హీరోయిన్లు ఇద్దరి మధ్య ఓసారి పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగా కొన్ని సంవత్సరాల పాటు దూరమయ్యారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో కౌముది ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై మల్లెమాల సుందరరామిరెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం “శ్రీకృష్ణ విజయం”. ఈ సినిమాలో నందమూరి తారక రామారావు కృష్ణుడి పాత్రను పోషించారు.

ఈ సినిమాలో వసుంధర పాత్రలో జయలలిత, సత్యభామ పాత్రలో జమున నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా డైరెక్టర్ కామేశ్వరరావు వీరిద్దరికీ డైలాగ్ ఇచ్చి రిహార్సల్స్ చేయమన్నారు. ఇందులో మొదటగా జయలలిత చెప్పిన డైలాగ్ జమున తిరిగి సమాధానం చెప్పాలి. ఈ క్రమంలోనే జమున డైలాగ్ చెప్పండి అంటూ జయలలితను అడగగా అందుకు జయలలిత నేనెందుకు చెబుతాను.. మీరే చెప్పుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో జమున ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే దర్శకుడితో జమున ఏంటండీ ఇది… ఆ అమ్మాయి డైలాగ్ చెప్పకపోతే నేనెలా రిహార్సల్స్ చేయాలి అంటూ అనగా అందుకు డైరెక్టర్ ఏ సమాధానం చెప్పలేదు. అదేవిధంగా దర్శకనిర్మాతలు జమునకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆరోజు వారిద్దరు సర్ది చెప్పడం వల్ల షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కొంతకాలం వరకు వీరిద్దరి మధ్య మాటలు లేవని, ఆ తర్వాత వారిద్దరి మధ్య స్నేహం కొనసాగిందని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా జమున తెలియజేశారు.

Jayalalitha : నన్ను 4 కోట్లకు మోసం చేసారు..కన్నీటి పర్యంతం అయిన జయలలిత

Jayalalitha : టాలీవుడ్‌లో వ్యాంప్ పాత్రలకు పెట్టింది పేరు జయలలిత అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ‘ఇంద్రుడు చంద్రుడు’ చిత్రంలో కమల్ హాసన్‌ సరసన వ్యాంప్ పాత్రలో కనిపించిన జయలలిత.. వరుసగా అలాంటి పాత్రల్నే చేస్తూ వచ్చింది. ఆమె తన సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం  జయలలిత  సీరియల్స్‌ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.జీ తెలుగులో ప్రసారమయ్యే ప్రేమ ఎంత మధురం అనే సీరియల్ తో పాటు జెమిని టీవీలో ప్రసారమయ్యే దీపారాధన సీరియల్ లో కూడా నటిస్తున్నారు.

Actress Jayalalitha

అలాగే జయలలిత ఇండస్ట్రీకి చాలా కాలం క్రితమే వచ్చారు. డబ్బు పరంగా కూడా బాగానే సంపాదించిందట. కాని ఒక నిర్మాణ సంస్థ తనను పూర్తిగా మోసం చేసిందని విచారణ వ్యక్తం చేసింది. జయలలిత దగ్గర నుండి ఆ నిర్మాణ సంస్థ రూ.4 కోట్ల రూపాయలు తీసుకుని చివరాఖరికి చేతులు ఎత్తేసింది అంటూ జయలలిత ఆవేదన వ్యక్తం చేసింది. వాళ్ళని ఇలా గుడ్డిగా నమ్మడం వెనుక ఒక కారణం ఉంది అంట. ఆ నిర్మాణ సంస్థ వారు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వడం మళ్లీ వాళ్ళు జయలలితకు డబ్బులు తిరిగి ఇవ్వడంతో వాళ్లపై మరింత నమ్మకం కలిగింది అని చెప్పారు. అలా వాళ్ళు నమ్మించి నాలుగు కోట్ల దోచేసుకుని నన్ను నిలువునా ముంచేశారు అని ఆవేదన వ్యక్తం చేసింది జయ లలిత.

ఒకప్పుడు లగ్జరీ కార్లలో తిరిగిన జయలలిత ఇప్పుడు సొంత కారు లేక క్యాబ్‌ ల్లో తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని అలీతో సరదాగా కార్యక్రమంలో కన్నీరు పెట్టుకుంది.ఇప్పటికి జయలలిత ఇంకా సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.వచ్చేవారం ప్రసారం కాబోయే అలీతో సరదాగా కార్యక్రమంలో భాగంగా జయలలిత పాల్గొంది. వరలక్ష్మి తో కలిసి జయలలిత ఆలీ షో కి వచ్చి తన జీవితంలో జరిగిన ఈ విషాద సంఘటనను గుర్తు చేసుకుని కంట తడి పెట్టింది. ఈ ఎపిసోడ్‌ వచ్చే వారం ఈ టీవీలో ప్రసారం కాబోతుంది.