Krishna: ఐదు దశాబ్దాలకు సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నట శేఖర్ కృష్ణ ఇక లేరు అనే వార్త ఇప్పటికీ మింగుడు పడటం లేదు. ఎన్నో సాహస ప్రయోగాత్మక సినిమాలను పరిచయం చేసిన ఘనత కృష్ణ గారికి ఉందని చెప్పాలి. ఇలా తన సినీ కెరియర్లో 350కు పైగా సినిమాలలో నటించిన ఈయన తుది శ్వాస విడిచారు.
సినీ ప్రస్థానంలో ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోవాల్సిందే.సాధారణంగా ఎవరైనా తమ కూతురు కుమారుడు పెళ్లికి సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తారు. అయితే కృష్ణ మాత్రమే ఏకంగా దివంగత మాజీ సీఎంకు ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పారట. ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే..
కృష్ణ గారు పెద్ద కుమార్తె పద్మావతి వివాహాన్ని గల్లా జయదేవ్ తో నిశ్చయించారు. వీరి వివాహం చెన్నైలో జరగనుంది. ఈ క్రమంలోనే తన పెద్ద కుమార్తె వివాహానికి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జయలలితను కృష్ణ స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. జయలలిత కూడా తన కుమార్తె వివాహానికి రావడానికి ఆసక్తి చూపింది.ఇక వివాహ మూడు రోజులు ఉందనగా జయలలిత సెక్యూరిటీ వచ్చి సెక్యూరిటీ పరంగా ముందు మూడు వరుసలు ముఖ్యమంత్రి గారికి కేటాయించాలని సూచించారట.
ఈ విషయం తెలుసుకున్న కృష్ణ తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా తరలివస్తారు అలాంటిది 3 వరుసలు కేవలం జయలలిత గారి కోసం కేటాయించడం కుదరదు అంటూ ఆమెకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించి ఎంతో సున్నితంగా తన కూతురు పెళ్లికి రావద్దని మీ ఆశీర్వాదాలు ఉంటే చాలని చెప్పారట.పరిస్థితి అర్థం చేసుకున్నటువంటి జయలలిత సైతం పెళ్లి రోజు వధూవరులకు ఒక బోకే పంపించి వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…