Jayalalitha : టాలీవుడ్‌లో వ్యాంప్ పాత్రలకు పెట్టింది పేరు జయలలిత అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ‘ఇంద్రుడు చంద్రుడు’ చిత్రంలో కమల్ హాసన్ సరసన వ్యాంప్ పాత్రలో కనిపించిన జయలలిత.. వరుసగా అలాంటి పాత్రల్నే చేస్తూ వచ్చింది. ఆమె తన సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం జయలలిత సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.జీ తెలుగులో ప్రసారమయ్యే ప్రేమ ఎంత మధురం అనే సీరియల్ తో పాటు జెమిని టీవీలో ప్రసారమయ్యే దీపారాధన సీరియల్ లో కూడా నటిస్తున్నారు.
అలాగే జయలలిత ఇండస్ట్రీకి చాలా కాలం క్రితమే వచ్చారు. డబ్బు పరంగా కూడా బాగానే సంపాదించిందట. కాని ఒక నిర్మాణ సంస్థ తనను పూర్తిగా మోసం చేసిందని విచారణ వ్యక్తం చేసింది. జయలలిత దగ్గర నుండి ఆ నిర్మాణ సంస్థ రూ.4 కోట్ల రూపాయలు తీసుకుని చివరాఖరికి చేతులు ఎత్తేసింది అంటూ జయలలిత ఆవేదన వ్యక్తం చేసింది. వాళ్ళని ఇలా గుడ్డిగా నమ్మడం వెనుక ఒక కారణం ఉంది అంట. ఆ నిర్మాణ సంస్థ వారు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వడం మళ్లీ వాళ్ళు జయలలితకు డబ్బులు తిరిగి ఇవ్వడంతో వాళ్లపై మరింత నమ్మకం కలిగింది అని చెప్పారు. అలా వాళ్ళు నమ్మించి నాలుగు కోట్ల దోచేసుకుని నన్ను నిలువునా ముంచేశారు అని ఆవేదన వ్యక్తం చేసింది జయ లలిత.
ఒకప్పుడు లగ్జరీ కార్లలో తిరిగిన జయలలిత ఇప్పుడు సొంత కారు లేక క్యాబ్ ల్లో తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని అలీతో సరదాగా కార్యక్రమంలో కన్నీరు పెట్టుకుంది.ఇప్పటికి జయలలిత ఇంకా సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.వచ్చేవారం ప్రసారం కాబోయే అలీతో సరదాగా కార్యక్రమంలో భాగంగా జయలలిత పాల్గొంది. వరలక్ష్మి తో కలిసి జయలలిత ఆలీ షో కి వచ్చి తన జీవితంలో జరిగిన ఈ విషాద సంఘటనను గుర్తు చేసుకుని కంట తడి పెట్టింది. ఈ ఎపిసోడ్ వచ్చే వారం ఈ టీవీలో ప్రసారం కాబోతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…