Featured

“అందుకే కమల్ హాసన్ నన్ను కొట్టాడు”..కల్యాణ వైభోగం సీరియల్ నటి భావన షాకింగ్ కామెంట్స్..!!

బుల్లితెర టీవీ చానెల్ జీ తెలుగులో ప్రసారమయ్యే కల్యాణ వైభగం అనే సీరియల్ ద్వారా ఆడియన్స్ కి మరింత దగ్గరైన నటి భావన.. అయితే దాదాపు తన కెరీర్ లో 160 కి పైగా సీరియల్స్ లో నటించిన ఈమె సినిమాల్లో కూడా కొన్ని పాత్రల్లో చేసినట్లు చాలామందికి తెలియదు.. తన చిన్ననాటి నుంచే భావన సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది..

ఆమె 4 వ తరగతి చదువుతున్నప్పుడు, ఆమె తన తండ్రి స్నేహితుడి ద్వారా నటనకు అవకాశం లభించింది. ఆమె తన నటనా జీవితాన్ని సినిమాల ద్వారా ప్రారంభించింది, మరియు ఆమె మొదటి చిత్రం బాల కళాకారిణిగా కుత్రా మరియు ఆ తరువాత, లాయర్ సుహాసిని, బరాతంలో బాలచంద్రుడు, రాజేశ్వరి కళ్యాణం, మరియు మొదలైన చిత్రాలకు పనిచేశారు. ఆమె దాదాపు 25 చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటించింది. ఆమె స్వయం క్రుషిలో సుహాసిని కోసం, రాజేశ్వరి కళ్యాణంలో మీనా కోసం చిన్ననాటి నటిగా నటించింది. భారతంలోలో బాలచంద్రుడు చిత్రంలో, ఆమె హీరో బాలకృష్ణ సోదరిగా నటించింది.

ఇదిలా ఉంటె తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న భావన.. పలు ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.. ఇందులో భాగంగా సీరియల్ నటీ, నటులు రోజుకి వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే మాట వాస్తవమే అని తెలిపింది..ఇక తన తాను గతంలో నటించిన సినిమాల ప్రస్తావిస్తూ.. ఆ మధ్య కమల్ హాసన్ హీరోగా నటించిన ఓ చిత్రంలో కూడా తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించానని.. ఆ సమయంలో ఓ సన్నివేశంలో నటిస్తున్నప్పుడు అనుకోకుండా ప్రముఖ హీరో కమల్ హాసన్ తన చెంపై కొట్టాడని.. కానీ ఆ తర్వాత తనని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని సినిమా పరిశ్రమ గురించి మరియు అవకాశాల గురించి వివరిస్తూ ఓదార్చడని తెలిపింది.. ఒక అగ్ర హీరో అయి ఉండి తనను అంత ఆప్యాయంగా పిలిచి మాట్లాడటం అనేది తన జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేనని ఆ ఇంటర్వ్యూలో తన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది భావన..ఇక ప్రస్తుతం ఈ నటి తెలుగులో స్వాతి చినుకులు, కల్యాణ వైభోగం అనే సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపుతో ముందుకు సాగుతోంది..!!

TD Admin

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago