చిన్న వయసులోనే సినీ అరంగేట్రం చేసి.. ఆనతికాలంలోనే అగ్రహీరోలందరీ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆర్తి అగర్వాల్. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ.. ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన ఆర్తి అగర్వాల్ ఆకస్మాత్తుగా అందరిని వదిలి వెళ్ళిపోయి షాక్ కు గురిచేసింది. దివికేగిన ఆ అందాల జాబల్లి 37వ పుట్టిన రోజు నేడు.
ఆర్తి అగర్వాల్ 1984 మార్చి 5న న్యూజెర్సీలో నివాసముండే గుజరాతీ కుటుంబంలో జన్మించింది. ఆర్తి తల్లిదుండ్రులు వీమా అగర్వాల్, కౌశిక్ అగర్వాల్. ఆర్తి అగర్వాల్ 14 ఏళ్ళ వయసులోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. ఫిలడెల్ఫియాలోని ఓ స్టేజ్ షోలో ఆర్తీ అగర్వాల్ డాన్స్ చూసి ముచ్చటపడిన అమితాబ్ బచ్చన్.. ఆమెను హిందీలో యాక్ట్ చేయడానికి ఎంకరేజ్ చేశాడు. అలా అర్తి అగర్వాల్ 2001వ సంవత్సరంలో హిందీలో పాగల్‌పన్ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత తాను 16 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ప్రముఖ దర్శకుడు కే విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ అనే చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో విక్టరీ వెంకటేష్ కు జోడీగా నటించి అందరి ప్రశంసలు పొందింది. ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ కెరీర్ ఒక్కసారిగా మారింది. వరుస ఆఫర్లను అందకుంటూ దాదాపుగా అగ్రహీరోలందరి సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ.
అలా దాదాపు తెలుగులో 50కి పైగా సినిమాల్లో నటించింది. ఇక ఆ తర్వాత తన వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన సమస్యలతో సినిమాలకు దూరమవుతూ వచ్చింది ఆర్తి. అదే సమయంలో ఆమె కాస్త బరువు పెరిగింది. బరువు తగ్గడం కోసం ఆర్తి అగర్వాల్ వర్క్ అవుట్స్ చేస్తూ.. సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అదే క్రమంలో జంక్షన్ జయమాలిని సినిమాలో నటిస్తూండగా… ఆకస్మాత్తుగా ఆమె కన్ను మూసింది. అందులో డ్యూయెల్ రోల్ ఉండగా, ఒక పాత్ర కోసం ఆర్తి కాస్తా బరువు తగ్గాల్సివచ్చింది. అయితే అప్పటికే 89 కేజీల బరువున్న ఆర్తి 63 కేజీలకు తగ్గింది. ఇక మరో మూడు కేజీల బరువు తగ్గడం కోసమని లైపో సక్షన్ చేయించుకుంది. అందులో భాగంగా బరువు తగ్గేందుకు చేయించుకునే లైపోసక్షన్ ఆపరేషన్ ని కూడా చేయించుకుంది. అయితే ఈ సర్జరి తర్వాత కొంత కాంప్లికేట్ అయ్యి ఆపరేషన్ వికటించి గుండెపోటుతో ఆర్తి అగర్వాల్ కన్ను మూసింది. చిన్న వయసులోనే సినీరంగ ప్రవేశం చేసిన ఆర్తి అగర్వాల్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నుంచి ఉదయ్ కిరణ్, రవితేజ, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోల సరసన నటించి మంచి విజయాలు అందుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…