Tag Archives: kcr

Dil Raju: ఎన్నికలవేళ కెసిఆర్ ని కలిసిన దిల్ రాజు.. రాజకీయంగా మొదలైన చర్చలు?

Dil Raju: తెలంగాణలో మరో రెండు నెలలలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో మరోసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే పార్లమెంట్ అభ్యర్థులను కూడా ప్రకటిస్తూ ఆయా పార్టీలు ఎంతో బిజీగా గడుపుతున్నాయి.

ఇలా ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఉన్నఫలంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసారు. దీంతో ఈ విషయం కాస్త రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చలకు కారణమైంది. కెసిఆర్ ని కలిసిన దిల్ రాజు రాజకీయాలలోకి ఏమైనా రాబోతున్నారా అని అందరూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

దిల్ రాజు కేసీఆర్ ని కలవడం వెనుక మరో కారణం ఉందని తెలుస్తుంది. ఫిబ్రవరి 14వ తేదీ తన సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి వివాహం ఉదయపూర్ లో ఎంతో ఘనంగా జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. క్రమంలోనే దిల్ రాజు ఈ పెళ్లి పనులలో బిజీగా ఉన్నారు. ఇలా పెళ్లి వేడుకలలో బిజీగా ఉన్నటువంటి ఈయన టాలీవుడ్ సెలబ్రిటీలు అందరిని కలిసి స్వయంగా పెళ్లికి ఆహ్వానిస్తున్నారు.

వివాహ ఆహ్వానం..

ఈ క్రమంలోనే కేసీఆర్ ని కలిసి వివాహానికి ఆహ్వానించారు. ఈ వివాహ మహోత్సవానికి టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. ఇక వీరి వివాహం ఉదయపూర్ లో ఎంతో ఘనంగా జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఆశిష్ హీరోగా ఇండస్ట్రీలోకి రౌడీ బాయ్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

KCR: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు గాయం… యశోద ఆసుపత్రిలో చికిత్స?

KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గాయాలు పాలైనట్లు తెలుస్తోంది. కెసిఆర్ గత రాత్రి తన ఇంటిలో కాలు జారి పడటంతో తుంటి ఎముక విరిగిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈయన జారి కింద పడటంతో వెంటనే కుటుంబ సభ్యులు తనని హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ కెసిఆర్ చికిత్స తీసుకుంటున్నారు.

గత రాత్రి అర్ధరాత్రి సమయంలో ఈయన బాత్రూంలో కాలుజారి పడ్డారని తద్వారా ఆయన ఎముక విరిగినట్లు కుటుంబ సభ్యులు భావించి వెంటనే తనని మెరుగైన చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం కేసీఆర్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

కాలు జారిపడ్డారు..

ఈయన కింద పడటంతో ఎముక విరిగిందని వైద్యులు వెల్లడించారు. అయితే ఇంకా హాస్పిటల్ నుంచి కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల కావాల్సి ఉంది. అయితే కేసీఆర్ ఇలా ఆసుపత్రి పాలయ్యారు అనే విషయం తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలాగ ఉంది ఏంటి అనే విషయాలను వైద్యులు మరికొద్ది సేపటిలో హెల్త్ బులిటెన్ విడుదల చేయబోతున్నారు.

Pruthvi Raj: పవన్ కు పోటీగా అలీ…. స్థాయి చూసుకోవాలి కదా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన పృథ్వీరాజ్!

Pruthvi Raj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగుతో ఎంతో ఫేమస్ అయినటువంటి కమెడియన్ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈయన సోమవారం ఉదయం వీఐపీ దర్శనంలో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన పృథ్విరాజ్ పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు కెసిఆర్ కోట్ల రూపాయల డబ్బులు పంపించారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఇదంతా కూడా అవాస్తవం అంటూ కొట్టి పారేశారు. పవన్ కళ్యాణ్ కు డబ్బులు పంపించడానికి కేసీఆర్ గారికి డబ్బులు ఊరికే రాలేదు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ ఆయన ఖండించారు.

ఒకప్పుడు నాకి కూడా 200 కోట్లు పంపించారని ప్రచారం చేశారు. అయితే ఆ డబ్బును లెక్క పెట్టుకొని ఇంత సమయానికి పూర్తి కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చానని నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది అంటూ ఈ సందర్భంగా తమ గురించి వస్తున్నటువంటి వార్తలను ఖండించారు. ఇక పవన్ కళ్యాణ్ ట్యాక్స్ కట్టుకోవడానికి అప్పు చేశారని ఈయన గుర్తు చేశారు.

Pruthvi Raj: స్థాయి చూసుకోవాలి కదా…

ఇక పవన్ కువ్యతిరేకంగా ఆలీ పోటీ చేయబోతున్నారంటూ వచ్చే వార్తలపై కూడా ఈయన స్పందించారు. గత కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగి పవన్ కళ్యాణ్ తనతో ఫోటో దిగినారని చెప్పుకుంటున్నట్లు ఉంది అలీ పవన్ తో పోటీ చేస్తానని చెప్పడం …. స్థాయి చూసుకోవాలి కదా మనం అంటూ ఈయన అలీ గురించి కామెంట్స్ చేశారు ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

https://telugudesk.net/wp-content/uploads/2023/02/prudhvi-raj.mp4

KCR: కెసిఆర్ మినహా అందరూ బీజేపీ వదిలిన బాణాలే: మంత్రి గంగుల కమలాకర్

KCR: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు సంచలనంగా మారాయి.అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సంవత్సరం పాటు గడువు ఉన్నప్పటికీ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సెగ తగులుతుంది. ఇక తెలంగాణలో అయితే బి ఎస్ ఆర్ పార్టీని టార్గెట్ చేస్తూ ఎంతో మంది నాయకులు వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలో తమ పార్టీ తప్పనిసరిగా పోటీ చేస్తుందని పేర్కొన్నారు. అలాగే జనసేన నేత పవన్ కళ్యాణ్ సైతం తెలంగాణలో పోటీకి సిద్ధమయ్యారు. మరోవైపు వైయస్సార్ కుమార్తె షర్మిల వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తూ తన పార్టీని బలోపేతం చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

KCR: తెలంగాణ సంపదను దోచుకోవడమే ధ్యేయం…


ఇలా వచ్చే ఎన్నికలలో తెలంగాణను టార్గెట్ చేస్తూ చాలా పార్టీలు పోటీకి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే బిఎస్ఆర్ పార్టీనేత మంత్రి గంగుల కమలాకర్ ఈ విషయం గురించి మాట్లాడుతూ తెలంగాణ సంపదను దోచుకోవడానికి బిజెపి వదిలిన బాణాలే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, షర్మిల అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక కేసీఆర్ మినహా వీళ్లంతా కూడా బిజెపి వదిలిన బాణాలే అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Actress pratyusha: ప్రత్యూష మరణం తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో సహా అందరినీ కలిసా.. న్యాయం చేసింది ఆయన మాత్రమే : ప్రత్యూష తల్లి సరోజనీ దేవి

Actress pratyusha: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి ప్రత్యూష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె 2002లో మరణించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె పై అత్యాచారం చేసిన కారణంగానే మరణించిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రత్యూష మరణం తర్వాత ఆమె తల్లి సరోజినీ దేవి తన కూతురికి న్యాయం జరగాలంటూ ఎంతో మందిని ఆశ్రయించారు.

ఈ క్రమంలోనే తన కూతురుకు న్యాయం జరగాలని ఎంతో మంది పొలిటీషియన్లను ఈమె సంప్రదించినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2002లో తన కూతురు చనిపోతే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలిసానని అలాగే వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు, కెసిఆర్ గారిని కూడా తాను కలిసానని ప్రత్యూష తల్లి వెల్లడించారు.

ఇలా తనకు న్యాయం జరగాలని ఎంతో మంది రాజకీయ నాయకులను కలిసినప్పటికీ తనకు మాత్రం కెసిఆర్ గారి సహాయం చేశారని ఈ సందర్భంగా సరోజినీ దేవి పేర్కొన్నారు.అప్పట్లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం జరుగుతోంది కేసీఆర్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ పలు జిల్లాలలో పర్యటిస్తున్నారని అయితే తనకు ఫోన్ చేసి తనని కలవగా కేసీఆర్ గారు ఏకంగా తనని అసెంబ్లీకి తీసుకెళ్లి తనకు న్యాయం జరగాలంటూ వాదించారు.

Actress pratyusha: కెసిఆర్ సాయం చేశారు…


ఇక అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు ప్రశ్నిస్తూ ఈ కేసులో మీ ప్రమేయం లేకపోతే వెంటనే ఈ కేసును సీబీఐకు అప్పగించాలని కేసీఆర్ డిమాండ్ చేసినట్లు ప్రత్యూష తల్లి ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు. ఇలా కేసీఆర్ గారు కేసును సిబిఐ కి అప్పగించాలంటూ తన తరపున నిలబడ్డారని అలాగే వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం ప్రమేయం లేకపోతే ఈ కేసు సిబిఐ కి అప్పగించి విచారణ జరిపించాలనీ రాజశేఖర్ రెడ్డి గారు కూడా తనకు న్యాయం జరగడానికి ప్రయత్నం చేశారని ఈమె వెల్లడించారు. ఇలా కూతురు మరణం తర్వాత తాను డిప్రెషన్ లో ఉండగా కేసీఆర్ తనని పాప పేరుతో ఒక ఫౌండేషన్ పెట్టుకుని ఆ ఫౌండేషన్ రన్ చేస్తూ పదిమందిలో తన కూతురిని చూసుకుని తన కూతురికి జరిగిన అన్యాయంపై పోరాటం చేయమని చెప్పారంటూ ఈ సందర్భంగా ఫౌండేషన్ వెనుక ఉన్న కారణం కూడా వెల్లడించారు.

CM KCR-Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త..! నెలకు రూ.2016 పింఛన్ ఇచ్చేందుకు కేసీఆర్ ఆదేశం..!

CM KCR-Farmers: తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతులకు రైతుబంధు, రైతుభీమా వంటి పథకాలతో ముందుకు సాగుతోంది. రైతుబీమాతో ఒకవేళ రైతు మరణిస్తే అతడి కుటుంబసభ్యుల్లోని నామినీకి రూ.5లక్షలు ఇవ్వనున్నారు. దీనికి ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం ప్రతీ సంవత్సరం దానికి సంబంధించిన ప్రీమియాన్ని చెల్లిస్తుంది.

CM KCR-Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త..! నెలకు రూ.2016 పింఛన్ ఇచ్చేందుకు కేసీఆర్ ఆదేశం..!

ఇక రైతు బంధు విషయానికి వస్తే భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం కింద సాయం చేస్తోంది.
ఎకరం పొలం ఉన్న రైతులకు రెండు దఫాలకు ఐదు వేల చొప్పున రూ.10 వేలు రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారు. తాజాగా మరో శుభవార్తను అందించింది కేసీఆర్ ప్రభుత్వం.

CM KCR-Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త..! నెలకు రూ.2016 పింఛన్ ఇచ్చేందుకు కేసీఆర్ ఆదేశం..!

రైతులకు పింఛన్‌‌ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే బడ్జెట్‌‌లో ఈ స్కీమ్ ప్రకటించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఫైనాన్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఎక్సర్‌‌సైజ్‌‌ మొదలు పెట్టింది. దీనికి సంబంధించి పథకాన్ని సీఎం కేసీఆర్ కొండపోచమ్మసాగర్‌‌ ప్రారంభోత్సవం సందర్భంగా రైతులకు గుడ్‌‌ న్యూస్‌‌ చెప్తానని వెల్లడించారు.

పలు కారణాలతో ఆ హామీ అలాగే మిగిలిపోయిందని.. రైతుబంధు, రైతుబీమాలకు తోడుగా అన్నదాతల కోసం ఈ స్కీం తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు ప్రభుత్వవర్గాలు పలు సందర్భాల్లో వెల్లడించాయి.
రైతులకు నెలకు రూ.2016 ఫిచన్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రైతు పింఛన్‌‌ విధివిధానాలు ఖరారు చేసే పనిలో ఫైనాన్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ నిమగ్నమైంది.


చిన్న, సన్న కారు రైతులకు..

చిన్న, సన్న కారు రైతులకు రూ.2016 పింఛన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారని.. రైతుకు 47 ఏల్లు నిండాలని పేర్కొన్నారు. 50 ఏళ్లు నిండిన గీత కార్మికులకు పింఛన్ ఇప్తున్న ప్రభుత్వం.. ఆ కార్మికుల కంటే వయోపరిమితి రెండేళ్లు తగ్గించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే 47 ఏళ్లు వయస్సు పరిమితి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట ఎందుకంటే.. రాష్ట్రంలో రైతుబంధు పొందుతున్న రైతులు 67 లక్షల పైచిలుకు ఉన్నారు. వీరిలో 47 ఏళ్లు నిండిన వాళ్లు ఎంత మంది ఉన్నారు..? 49 ఏళ్లు నిండిన వాళ్లు ఎంతమంది ఉన్నారనే లెక్కలు తీస్తున్నారు. ఫైనల్ గా 47 ఏళ్లు నిండి ప్రతీ రైతుకు పింఛన్ ఇచ్చే ఆలోచన ఉన్నట్లు సమాచారం. మూడెకరాల నుంచి ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు పింఛన్‌‌ ఇచ్చే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి సమగ్ర సమాచారం.. బడ్జెట్ లో ప్రవేశపెట్టేందుకు అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం.

రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బులు జమ అయ్యేందుకు కేవలం ఐదు రోజులే..

వివిధ దశల్లో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ సర్కార్ 2018 వానాకాలం సీజన్‌ నుంచి ‘రైతుబంధు’ పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ యాసంగి సీజన్‌లోనూ రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. ఇందుకు సంబంధించిన నగదును ఈ నెల 15వ తేదీ నుంచి రైతుల అకౌంట్లలో జమ కానుంది. అంటే ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలిఉంది.

ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు ఏకంగా 7,500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖ ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి జూన్‌‌‌‌‌‌‌‌ నెలలో 60.84 లక్షల మంది రైతులకు రైతు బంధు సాయం కింద రూ.7,360.41 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్తగా పట్టాదారు పాస్‌‌‌‌‌‌‌‌ పుస్తకాలు పొందిన రైతుల సంఖ్య, అందుకు అనుగుణంగా భూవిస్తీర్ణం పెరిగితే బడ్జెట్‌‌‌‌‌‌‌‌ కూడా పెరగనుంది.

ఏమైనా సమస్యలు ఉంటే.. స్థానిక వ్యవసాయాధికారిని సంప్రదించాలని అధికారులు కోరారు. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలుపెట్టి, ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల వరకు అందరికీ పది రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గత ఏడాది కూడా ఇదే మాదిరిగా పంపిణీ చేశారు. ఈ సారి కూడా ఇదే పద్ధతిని ఫాలో కానున్నారు.

ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన కెసిఆర్ భార్య శోభ.. కుటుంబం మొత్తం ఢిల్లీలోనే..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. గతంలో ఈమె కరోనా బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈమెకు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని పలు ఆసుపత్రిలో ఈమెకి చికిత్స చేయించినప్పటికీ కొందరు డాక్టర్ల సూచన ప్రకారం ఢిల్లీ
ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియాను కలవమని సలహా ఇచ్చారు.

ఈ క్రమంలోనే తన కొడుకు కేటీఆర్ కూతురు కవితతో కలిసి కేసీఆర్ సతీమణి శోభ శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు.పరీక్షల నిమిత్తం వీరు శనివారం తిరిగే హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండగా పరీక్ష ఫలితాలను చూసిన అనంతరం డాక్టర్ ఇన్ పేషెంట్ గా ఆస్పత్రిలో చేరాల్సిందిగా సూచించారు. ఈ క్రమంలోనే డాక్టర్ల సూచన మేరకు ఈమె ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.

ఇక విషయం తెలిసిన కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఇలా కుటుంబం మొత్తం ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఇకపోతే ఈమెను కేవలం అబ్జర్వేషన్ లో ఉంచడం కోసమే అడ్మిట్ చేశారని శోభమ్మ ఆరోగ్య విషయంలో ఏ మాత్రం కంగారు పడాల్సిన పని లేదని వైద్యులు వెల్లడించారు.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడిన వెంటనే ఆయన సతీమణి శోభమ్మ, కొడుకు కేటీఆర్, కూతురు కవిత కూడా కరోనా బారినపడ్డారు. అయితే వీరందరూ కోలుకున్నప్పటికీ కేసీఆర్ సతీమణి మాత్రం ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడటం వల్ల ఈమెకు ఢిల్లీలోని వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఈటల-కేసీఆర్ వెన్నపోటు ఎపిసోడ్.. త్వరలో సినిమా: వర్మ

సంచలనాల దర్శకుడు వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటుంది. అతడు ట్విట్టర్ లో పెట్టే ట్వీట్లు కూడా అలాగే ఉంటాయి. అతడిని ఎంత మంది విమర్శిస్తురో.. అంత కంటే ఎక్కువగా అతడిని ఫాలో అవుతుంటారు. అయితే ఈ వివాదాల దర్శకుడు హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి అతడు తన సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు.

అది పెద్ద వైరల్ గా మారింది. అతడు ఏమని పోస్టు చేశాడంటే.. ‘‘గతంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి పదవి ఎలా సొంతం చేసుకున్నారో… ఈటల కూడా అలాంటి ప్రయత్నమే చేశారనిపిస్తుంది. అందుకే కేసీఆర్- ఈటల వెన్నుపోటు ఎపిసోడ్ పై తెలంగాణా రాజకీయ మేధావులతో చర్చించి… మూవీ చేస్తానంటూ ప్రకటించారు.

అలాగే ఈటల, కేసీఆర్ మార్ఫింగ్ ఫొటోలతో వెన్నుపోటు టైటిల్ తో ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈటల అభిమానులు ఆర్బీవీపై మండిపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈటల ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా అతడు ప్రయత్నిస్తున్నాడని ఇది కరెక్ట్ కాదంటూ విమర్శిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. అతడు ఇటీవల కొండా సురేఖ, మురళి దంపతులకు సంబంధించి బయోపిక్ కు తీస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించి షెడ్యూల్ కూడా మొదలైంది. ఆ సినిమాను ‘కొండా’ పేరుతో తెరకెక్కిస్తున్నాడు. అయితే తాజాగా ఈటల వెన్నుపోటు చిత్రంలో వర్మ ఎలాంటి విషయాలు ప్రస్తావిస్తాడో చూడాలి మరి.

నేడు హుజూరాబాద్‌‌కు కేసీఆర్.. 15 మందికి దళిత బంధు

నేడు హుజూరాబాద్ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. . హుజూరాబాద్‌ మండలంలోని శాలపల్లిలో బహిరంగా సభలో పాల్గోననున్నారు. ఇందుకోసం సభా ప్రాంగణం ముస్తాబైంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి శాలపల్లికి చేరుకుంటారు. అక్కడి రోడ్డు మార్గంలో సభాస్థలికి వస్తారు. ఈ వేదికపై నుంచే దళిత బంధు పథకాన్ని అధికారికంగా శ్రీకారం చూట్టనున్నారు.

దళితబంధు సభకు లక్షా 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఈ వేదికపై నుంచి ఎంపికైన 15 మంది దళిత కుటుంబాలకు దళిత బంధు అందించనున్నారు. అధికారులు వీరి వివరాలు వెల్లడించలేదు. జర్మన్‌ హంగర్‌ టెక్నాలజీతో సభ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. గాలులు, భారీవర్షం పడినప్పటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.