Tag Archives: kgf

Kantara Actor Kishore: కేజిఎఫ్ ఒక చెత్త సినిమా… అందుకే చూడలేదు… కాంతార నటుడు షాకింగ్ కామెంట్స్!

Kantara Actor Kishore: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యి ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకున్నటువంటి వాటిలో కేజిఎఫ్ సిరీస్, కాంతార సినిమాలు ఒకటని చెప్పాలి.ఈ రెండు సినిమాల్లో కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. ఇకపోతే ఈ రెండు సినిమాలను కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ హోం బలే ఫిలింస్ నిర్మించిన విషయం మనకు తెలిసిందే.

ఇక కే జి ఎఫ్ 2 సినిమా భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక
కాంతార సినిమా కూడా కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి సుమారు 400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి చరిత్ర సృష్టించిందని చెప్పాలి.ఇక కే జి ఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా హీరో యశ్ కు విపరీతమైన అభిమానులు పెరిగిపోయారు.

ఇక ఈ సినిమాపై ఎంతోమంది ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా కాంతర సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన నటుడు కిషోర్ తాజాగా కాంతారావు సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా నటుడు కిషోర్ మాట్లాడుతూ తనకు కే జి ఎఫ్ అంటే సినిమాలు ఏమాత్రం నచ్చవని అందుకే ఆ సినిమాని తాను చూడకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు.

Kantara Actor Kishore: చిన్న సినిమాలకు మద్దతు తెలుపుతాను…


కే జి ఎఫ్ తో పాటు కాంతార సినిమాని కూడా నిర్మించినది హోంభలే నిర్మాణ సంస్థ అయిన తాను కేజిఎఫ్ బ్రాండ్ కథ కథనాలకు అభిమానిని కాదని తెలిపారు. కే జి ఎఫ్ సినిమా ఒక చెత్త సినిమా..ఇలాంటి ఒక మైండ్ లెస్ సినిమాల కన్నా తీవ్రమైన సమస్యలతో తెరకెక్కి చిన్న కంటెంట్ ఆధారిత సినిమాలకే తాను మద్దతు ఇస్తానని ఈయన కే జి ఎఫ్ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం నటుడు కిషోర్ కాంతార సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kantara: మరో రికార్డ్ సృష్టించిన కాంతార… కేజిఎఫ్ 2 రికార్డులను బద్దలు కొట్టిందిగా?

Kantara: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కాంతార సినిమా పేరు మారుమోగిపోతుంది.కన్నడ నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయన హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషలలో విడుదలై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇప్పటికే దేశవ్యాప్తంగా అధిక లాభాలను అందుకుంటున్న ఈ సినిమా తాజాగా మరొక రికార్డు సృష్టించింది.

కన్నడ చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కేజిఎఫ్ సినిమాని నిర్మించిన నిర్మాణ సంస్థ హోంభలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థలోఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషలలో విడుదలైంది. అయితే కన్నడ చిత్ర పరిశ్రమలో ఈ సినిమా మాత్రం ఏకంగా కేజిఎఫ్ 2 సినిమా రికార్డులను బద్దలు కొట్టి మరో రికార్డ్ సృష్టించింది.

అత్యంత తక్కువ బడ్జెట్ తో నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఊహించని స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుని.కేజిఎఫ్ 2 సినిమా రికార్డులను బద్దలు కొట్టిందంటే ఇక ముందు ముందు ఎలాంటి రికార్డులను అందుకుంటుందో తెలియాల్సి ఉంది.ఈ సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలో సెప్టెంబర్ 30వ తేదీ విడుదలైనప్పటికీ ఇంకా భారీ మొత్తంలో కలెక్షన్లను రాబడుతుంది.

Kantara : నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం..

ఇక తెలుగులో కూడా ఈ సినిమా కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు హక్కులను ఆలు అరవింద్ కేవలం రెండు కోట్లకు కొనుగోలు చేయగా దాదాపు 15 కోట్ల వరకు లాభాలను అందుకున్నట్టు సమాచారం. ఇలా నిజ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అరుదైన రికార్డులను సృష్టిస్తూ ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Karan Johar: సౌత్ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన కరణ్.. మాకు టైం వస్తుందంటూ కామెంట్?

Karan Johar: ఒకప్పుడు దేశంలో నార్త్ హీరోల హవా ఎక్కువ సాగింది. బాలీవుడ్ సినిమాలంటే చాలా గొప్పగా చూసేవారు. మన సౌత్ హీరో, హీరోయిన్లు కూడా నార్త్ సినిమాలలో అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేసేవారు. చాలామంది హీరోయిన్లు సౌత్ నుండి నార్త్ కి వెళ్లి సెటిల్ అయ్యారు. కానీ సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు అని ఇప్పుడు నిరూపణ అయ్యింది. కొన్ని సందర్భాలలో ఓడలు బళ్ళు కావచ్చు , బళ్ళు ఓడలు కావచ్చు.

ప్రస్తుతం నార్త్ ఇండస్ట్రీ పరిస్థితి కూడా అలాగే తయారయ్యింది. ఒకప్పుడు దేశంలో నార్త్ సినిమాల డామినేషన్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయి నార్త్ లో సౌత్ సినిమాల డామినేషన్ బాగా పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు, నిర్మాతలు ఇండస్ట్రీలో మేమే నంబర్ వన్. మాకు మేమే పోటీ అంటూ వారి గురించి గొప్పలు చెప్పుకున్నారు. చాలా కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు. హిట్లు లేక బాలీవుడ్ పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది.


ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ 2, పుష్ప వంటి సినిమాలు నార్త్ ఇండస్ట్రీలో తమ సత్తా చాటుకున్నాయి. హిట్స్ లేకపోవటంతో బాలీవుడ్ పరిస్థితి అయిపోయిందని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో బాలీవుడ్ స్టార్ డైరక్టర్,ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ సౌత్ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల ఒక ప్రముఖ వార్తా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ జోహార్..బాలీవుడ్ గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని, అల వ్యాఖ్యలు చేసేవారిది చెత్త వాగుడు అంటూ కొట్టి పారేశాడు.

Karan Johar: కంటెంట్ ఉంటే ఏ భాషలో అయిన హిట్ అవుతాయి…

బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన కతియావాడి, భూల్‌ భూలయ్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కంటెంట్ బాగుంటే సినిమాలు ఎక్కడైనా బాగా ఆడుతాయని ఆయన వెల్లడించారు. సౌత్ సినిమాలు వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్స్ అవటంతో వాటిముందు నార్త్ సినిమాలు ప్రేక్షకులకు కనిపించడం లేదని ఆయన తెలియజేశారు.బాలీవుడ్ కి మళ్లీ పూర్వ వైభవం వస్తుంది. మా వద్ద ఉన్న సినిమాలు బాలీవుడ్ కి పూర్వ వైభవం తీసుకువస్తాయని ఆయన వెల్లడించారు.

KGF Actor Avinash: తృటిలో ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కేజీఎఫ్ యాక్టర్ అవినాష్…!

KGF Actor Avinash: ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోజురోజుకి వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇలా ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. అదృష్టం కొద్దీ కొంతమంది ప్రాణాలతో బయటపడిన కూడా జీవితాంతం ఆ ప్రమాదాల తాలూకా గుర్తులు వెంటాడుతూ ఉంటాయి.

KGF Actor Avinash: తృటిలో ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కేజీఎఫ్ యాక్టర్ అవినాష్…!

తాజాగా ప్రముఖ సినీ నటుడు కేజిఎఫ్ నటుడు అవినాష్ కారుకి ప్రమాదం జరిగింది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలో నటించి బాగా పాపులర్ అయిన అవినాష్ ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు నిన్న ఉదయం జిమ్ నుండి తిరిగి వస్తుండగా ట్రక్కు ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ.. అవినాష్ చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఈ విషయాన్ని అవినాశ్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు.

KGF Actor Avinash: తృటిలో ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కేజీఎఫ్ యాక్టర్ అవినాష్…!

నిన్న నేను జీవిత కాలానికి సరిపడా భయం చూశాను.జిమ్ నుండి తిరిగి వస్తుండగా అనిల్ కుంబ్లే దగ్గర అనుకోకుండా క్షణాల్లో ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ట్రక్కు రెడ్ సిగ్నల్ క్రాస్ చేసి వచ్చి నా కారుని గుద్దాడు. అయితే ఈ ఘటనలో అదృష్టం కొద్దీ నేను ప్రాణాలతో బయటపడ్డాను. కానీ నా కారు బాగా డ్యామేజ్ అయ్యింది అంటూ అవినాశ్ చెప్పుకొచ్చాడు.

అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు…

ఈ ప్రమాదానికి కారణమైన ట్రక్కు మీద పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తృటిలో ప్రమాదం నుండి బయట పడిన అవినాష్ తనకి సహాయం చేసిన వారికి ధన్యవాదాలు తెలియచేశాడు. అంతే కాకుండా తనకి తోడుగా ఉన్న కుటుంబ సభ్యులకు, స్నేహితులకి కూడా కృతజ్ఞతలు తెలియజేశాడు. అవినాశ్ ప్రమాదం గురించి తెలుసుకున్న యశ్, ప్రశాంత్ నీల్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయన తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.

Chiranjeevi : కేజిఎఫ్ లాంటి షేడ్స్ ఉన్న కథను మెగా రాఖీ భాయ్ చిరంజీవి 36 ఏళ్ల క్రితమే దున్నాడు.?!

Chiranjeevi : ప్రస్తుత సినిమాలను లోతుగా గమనిస్తే..మనం ఎప్పుడో చూసిన పాత సినిమా గుర్తుకువస్తుంటుంది. సినిమా టేకింగ్, కెమెరా పనితనం అంతకుమించి సినిమాలో వచ్చిన వేగం ఇప్పటి సినిమాలలో గమనించవచ్చు. కే జి ఎఫ్ సినిమా ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన “రాక్షసుడు” చిత్రం ఒకేలా ఉంటుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన కే జి ఎఫ్ చిత్ర కథను ఒకసారి గమనిస్తే…

1981 లో కోలారు బంగారు గనులును ఆధారంగా చేసుకుని దర్శకుడు ప్రశాంత్ నీల్ కథను తయారు చేసుకున్నాడు. 2018లో ఓ సీనియర్ జర్నలిస్ట్ ఓ సాధారణ యువకుడు ఫీల్డ్స్‌ ఎలా అధినేత అయ్యాడనే క్రమంపై పుస్తకం రాస్తాడు దానిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేస్తుంది. దానిపై పరిశోధన చేసే ఓ ప్రతికాధినేతకు ఆ పుస్తకాన్ని రాసిన జర్నలిస్ట్ కథను వివరించడంతో కథ మొదలవుతుంది.కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ సూర్యవర్ధన్‌కి ఓ విలువైన రాయి దొరుకుతుంది. అది బంగారం ఉన్న ప్రాంతం అని తెలుసుకున్న సూర్య వర్దన్ స్థలం 99 ఏళ్లకు లీజుకు తీసుకుని పటిష్ఠమైన కాపలాను పెట్టుకుని బంగారం తవ్వే పని ప్రారంభిస్తాడు.

చుట్టు పక్కల గ్రామాల్లోని నివసించే ప్రజలను తీసుకొచ్చి వారిని బానిసలుగా మార్చి పనులు చేయిస్తుంటాడు. అనుకోకుండా సూర్యవర్ధన్‌కి పక్షవాతం వస్తుంది . దాంతో అందరూ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌పై అధిపత్యం సాధించాలని చూస్తుంటారు. అయితే సూర్యవర్ధన్ కొడుకు గరుడ అందరినీ తన కంట్రోల్‌లో ఉంచుకుని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అధిపతిగా ఉంటాడు. అయితే సూర్యవర్ధన్‌కు నమ్మకంగా ఉన్న ఐదు మంది గరుడను చంపి ఆ బంగారు గనులకు నాయకులుగా ఎదగాలని నిర్ణయించుకుంటారు.

ఇకపోతే 36 ఏళ్ల క్రితం ఇలాంటి కథతోనే చిరంజీవి “రాక్షసుడు” అనే చిత్రంలో నటించారు సంక్షిప్తంగా చిత్ర కథను పరిశీలిస్తే.. వితంతు మహిళ మగబిడ్డకు జన్మనివ్వడంతో సినిమా తెరకెక్కింది. భూస్వామి దీనిని ఆమోదించలేదు మరియు శిశువును పారవేసాడు.ఒక తాగుబోతు శిశువును కనుగొని, డబ్బుకు బదులుగా ఆ అబ్బాయిని లేబర్ క్యాంప్‌కు విక్రయించే వరకు కొన్ని సంవత్సరాల పాటు ఉంచాడు. 20 సంవత్సరాల తరువాత, పురుష ( చిరంజీవి ) మరియు అతని స్నేహితుడు సింహం ( నాగేంద్ర బాబు ) లేబర్ క్యాంపు నుండి పురుష తల్లిని ( అన్నపూర్ణ ) చూడటానికి పారిపోతారు.

అయితే పురుష ఇంటి యజమాని దగ్గరకు వెళ్లగా.. చాలా కాలం క్రితం పురుష తల్లి వెళ్లిపోయిందని, వివరాలు రాబట్టాలంటే యజమానికి లంచం ఇవ్వాల్సిందేనని యజమాని చెప్తాడు. పురుష తన ప్రతీకారం తీర్చుకోవడం మరియు అతని తల్లిని ఎలా కలుస్తాడు అనేది మిగిలిన కథ… సినిమా టేకింగ్ లో రాక్షసుడు, కే జి ఎఫ్ రెండు కూడా ఒకేలా ఉంటాయి. ఈ రెండు సినిమాలకు ఉన్న తేడా ఏమిటంటే ఫోటోగ్రఫీ. కే జి ఎఫ్ మొత్తం చీకటి ఛాయలతో కూడిన దృశ్యాలు అనేకం కనిపిస్తుంటాయి. అలాగే ఈ సినిమాలో హీరో ఎలివేషన్ సీన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తాయి.

KGF Chapter 3: కేజిఎఫ్ చాప్టర్ 3 గురించి క్లారిటీ ఇచ్చిన అయ్యప్ప శర్మ… అందుకేగా నేను బ్రతికున్నా!

KGF Chapter 3: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న కేజిఎఫ్ చాప్టర్ 2 విడుదలయ్యి దాదాపు 12రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఈ సినిమాకి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక ఈ సినిమా చూసిన వారు తప్పకుండా కే జి ఎఫ్ చాప్టర్ 3 ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు చిత్రబృందం ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.ఈ క్రమంలోనే కేజిఎఫ్ సినిమాలో వానరం పాత్రలో జీవించిన అయ్యప్ప శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన పాత్ర ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంది.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అయ్యప్ప శర్మ కేజిఎఫ్ చాప్టర్3 గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాప్టర్ 3 ఉంటుందా? అనే ప్రశ్న ఎదురుకావడంతో ఆయన సమాధానం చెబుతూ తప్పకుండా ఉంటుంది… అందుకే కదా నేను బ్రతికి ఉన్నాను అంటూ సమాధానం చెప్పారు.

కేజిఎఫ్ చాప్టర్ 3 ఉంటుంది..

కేజిఎఫ్ చాప్టర్ 2 లో యష్ చనిపోయినట్టు చూపిస్తారు కానీ ఆయన చనిపోయి ఉండరని, ఇదే పాయింట్ తో మరొక చాప్టర్ తెరకెక్కబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ చాప్టర్ త్రీ గురించి అందరికీ పూర్తి క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే అయ్యప్ప శర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కేజిఎఫ్ చాప్టర్ 3 వుంటుందని ప్రతి ఒక్కరూ తెలియచేస్తున్నప్పటికీ ఇంకా ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం అయ్యప్ప శర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

KGF: కేజీఎఫ్ లో చిన్నప్పటి యష్ గురించి మీకు తెలుసా..!

KGF : ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన పవర్ ఫుల్ చిత్రమ్ కేజీఎఫ్ రెండు భాగాలుగా విడుదలయి ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమాలో ప్రతి పాత్ర సినిమాకు జీవం పోశాయి. మరీ ముఖ్యంగా రాకీ భాయ్ మరియు అతని తల్లి పాత్ర. ఇక ఈ పాత్రలో ఒక సాధారణంగా మనిషి ఒక డాన్ గా ఎదిగిన తీరు ఎలివేషన్ చాలా చక్కగా ఉంటాయి. ఇక ఈ పాత్రలో యష్ బాగా నటించారు. ఇక అతని తల్లిగా అర్చన జోయిస్ కూడా అంతే బాగా నటించి మెప్పించారు.

ఇక తల్లితో రాకీ భాయ్ అనుబంధాన్ని చూపించినపుడు యష్ చిన్నప్పటి పాత్రలో చేసిన కుర్రాడి గురించి కూడా ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఈ పాత్ర చేసింది 18ఏళ్ల అన్మోల్. యష్ చిన్నప్పటి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. అన్మోల్ స్టంట్స్ డాన్స్ అంటే చాలా ఇష్టమట ఇక వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ఇక అన్మోల్ పడఖ అనే సినిమాలో నటించాడు.

ఇక ఈ సినిమాలో అన్మోల్ ని చూసి ప్రశాంత్ చిన్నప్పటి యష్ పాత్రకు సరిపోతాడని తీసుకున్నారట. సినిమాలో ఈ పాత్ర చిన్నదే అయినా కీలకమైనది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాకు ఆత్మ వంటి పాత్రలో అన్మోల్ చాలా చక్కగా నటించాడు. జూనియర్ రాకీ షాట్‌ల కోసం అన్మోల్‌కి 12 నెలలు పట్టింది. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కన్నడ చిత్రం పడకలో కూడా పనిచేశాడు, అందులో అతను యంగ్ సురేష్ విశ్వనాథ్ అయ్యాడు.

Raveena Tandon: స్టూడియోలో ఫ్లోర్ శుభ్రం చేసేదాన్ని… కేజిఎఫ్ నటి కామెంట్స్ వైరల్!

Raveena Tandon: కేజిఎఫ్ సినిమా ద్వారా స్టార్ నటిగా మారిపోయిన నటి రవీనా టాండన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.‘ఫత్తర్‌ కే ఫూల్‌’’అనే హిందీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. హిందీతో పాటు తెలుగులో కూడా రథసారధి, బంగారు బుల్లోడు, ఆకాశవీధిలో పాండవులు పాండవులు తుమ్మెద వంటి చిత్రాలలో నటించారు.

Raveena Tandon: స్టూడియోలో ఫ్లోర్ శుభ్రం చేసేదాన్ని… నాలో మోడల్ ను గుర్తించింది అతనే… కేజిఎఫ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!

ఈ విధంగా దక్షిణాది సినిమాల్లోనూ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన రవీనాటాండన్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ చిత్రం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమా విజయవంతం కావడంతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తను ఇండస్ట్రీలోకి రాకముందు ఎలాంటి పనులు చేసేది అనే విషయాల గురించి ముచ్చటించారు.

Raveena Tandon: స్టూడియోలో ఫ్లోర్ శుభ్రం చేసేదాన్ని… నాలో మోడల్ ను గుర్తించింది అతనే… కేజిఎఫ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రవీనాటాండన్ మాట్లాడుతూ 1990 ముందు వరకు తనకు సినిమాల్లోకి రావాలన్న ఆలోచన రాలేదని తెలిపారు. కాలేజీ చదువుతున్న రోజుల్లో జెనెసిస్‌ పీఆర్‌లో ఇంటర్న్‌షిప్‌కు వెళ్లాను. అక్కడ యాడ్‌ ప్రహ్లాద్‌ కక్కర్‌కు సహాయంగా ఉండటమే కాకుండా స్టూడియోలో పనిచేస్తూ ఫ్లోర్ శుభ్రం చేసే దాన్ని, అలాగే ఎవరైనా వాంతి చేసుకున్న దానిని కూడా శుభ్రం చేసేదాన్ని అని తెలిపారు.

నన్ను మోడల్ చేసింది అతనే…

అక్కడే తన స్నేహితులతో కలిసి పనిచేస్తున్న ఈమెను తన స్నేహితులు ఎన్నోసార్లు చాలా అందంగా ఉన్నావు సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అని చెప్పేవారు. అప్పుడే నాలో ఉన్న మోడల్ ను గుర్తించింది మాత్రం శాంతను షీరే అనే ఫోటోగ్రాఫర్, డైరెక్టర్. అతని నన్ను మోడల్ గా నిలబెట్టారు. ఇలా మోడల్ గా ఉన్న తనకు సినిమా అవకాశాలు వచ్చాయని అయితే తాను సినిమాలు చేయడానికి ఒప్పుకోకపోవడంతో ప్రహ్లాద్‌ కక్కర్‌కు సూచన మేరకు హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని ఈ సందర్భంగా రవీనాటాండన్ కి తన గతం గురించి తెలియజేశారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Archana Jois : కేజిఎఫ్ సినిమా లో యశ్ కి తల్లిగా నటించిన నటి గురించి మీకు తెలుసా…?

do you know about yash mother in KGF : పాన్ ఇండియా సినిమాల్లో సౌత్ సినిమాల హవా కొనసాగుతోంది. ఆర్ఆర్ఆర్ ప్రపంచం అయిపోగానే ఇప్పుడు కేజీఎఫ్ 2 మొదలైపోయింది. రాకింగ్ స్టార్ యష్ అద్భుతమైన నటన డైలాగులు ప్రశాంత్ నీల్ దర్శకత్వం ఈ సినిమాను ఘన విజయం సాధించడంలో ఉపయోగపడ్డాయి. బాహుబలి సినిమా క్రియేట్ చేసిన రికార్డులను ఈ కేజిఎఫ్ 2 బద్దలుకొట్టింది ఈ సినిమాను ప్రజలు ఆదరించారు. కేజిఎఫ్ 1 ఘన విజయం తర్వాత వచ్చిన ఈ సినిమా అంచనాలను మించి విజయం సాధించింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. వారు నటించడం అని చెప్పడం కన్నా పాత్రల్లో జీవించారు అని చెప్పడం బాగుంటుంది. రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ సంజయ్ దత్ ఇలా అందరూ పాత్రలకు న్యాయం చేశారు.

ఇక ఈ సినిమాలో గొప్పగా చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే యష్ కు తల్లి పాత్రలో నటించిన వ్యక్తి గురించి. నిజానికి ఈ సినిమాలో తల్లి కొడుకుల సెంటిమెంట్ చాలా బాగా కుదిరింది. అభిమానులను ఎమోషనల్ గా ఈ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అయితే సినిమా చూసిన తర్వాత ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న వ్యక్తి సినిమాలో యష్ కు తల్లిగా నటించిన అర్చనా జోయిస్.

ఎవరు ఈ అర్చనా జోయిస్…

కే జి ఎఫ్ వన్, కే జి ఎఫ్ 2 చిత్రాలలో హీరో యష్ కు తల్లి పాత్రలో నటించింది అర్చన జోయిస్. వయసులో అర్చనా జోయిస్ కంటే యష్ పెద్దవాడు అయిన అర్చన యష్ కు తల్లి పాత్రలో నటించడం విశేషం.అర్చనా జోయిస్ కు శాస్త్రీయ నృత్యం అంటే చాలా ఇష్టమట, అందుకే దాని మీద పట్టు సాధించి బోలెడన్ని నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చిందట. గతంలో కే జి ఎఫ్ హీరో అయినా యష్, అర్చన ఫోటోలను మదర్ అండ్ సన్ అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా బాగా వైరల్ అయ్యాయి.

సోషియల్ మీడియాలో అర్చన పోస్ట్ చేసే ఫోటోలను చూస్తే మాత్రం ఈవిడ ఏంటి సినిమా లో యష్ కు మదర్ పాత్ర చేయడం ఏంటి అని షాక్ అవుతారు.అర్చనా జోయిస్ కి సంస్కృతం మీద కూడా మంచి జ్ఞానం ఉందట. ఈ సినిమా తరువాత అర్చన కు హీరోయిన్ అవకాశలు ఎక్కువగా వడ్తున్నాయట.

గొప్ప మనసు చాటుకున్న కేజిఎఫ్ స్టార్.. మూడు వేల కుటుంబాల కోసం?

దేశంలో రెండవ దశ కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు కరోనాను కట్టడి చేయడం కోసం అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలోనే ఎంతో మంది ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రముఖులు ఈ కరోనా విపత్కర సమయంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. మరికొందరు భారీ మొత్తంలో విరాళాలను ప్రకటించి ఎందరికో చేయూతగా నిలిచారు.

లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్లు వాయిదా పడటంతో సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది కార్మికులు ఉపాధిని కోల్పోయి దీన స్థితిలో ఉన్నారు. అటువంటి వారికోసం కన్నడ స్టార్ హీరో యష్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.షూటింగ్ జరగకపోవడంతో వివిధ భాగాలలో పనిచేసే కార్మికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలోనే హీరో యష్ సినీ కార్మికుల కోసం భారీ విరాళం ప్రకటించారు.

కన్నడ సినీ ఇండస్ట్రీలో వివిధ భాగాలలో పనిచేసే మూడు వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి ఐదు వేలు చొప్పున మొత్తం ఒకటిన్నర కోటి రూపాయలను సినీ కార్మికుల ఖాతాలో జమ చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయాన్ని సృష్టించిందో మనకు తెలిసిందే.

బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న
కేజిఎఫ్ చిత్రానికి సీక్వెల్ గా కేజిఎఫ్2 చిత్రంలో హీరోగా నటించారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.