Tag Archives: madhya pradesh

Viral Video: ఇన్ కంట్యాక్స్ అధికారుల దాడులు.. సంపులో దాచిన కరెన్సీ కట్టలు.. వీడియో వైరల్..!

Viral Video: అక్రమంగా సంపాదించే వారికి ఎవరికైనా భయపడకపోచ్చు కానీ.. ఇన్ కమ్ ట్యాక్స్ రైడింగ్ అంటే మాత్రం ఎక్కడ లేని టెన్షన్ వచ్చేస్తుంది. పన్నులను ఎగ్గొట్టి.. డబ్బులను అక్రమంగా ఇంట్లోనే దాచుకుంటారు. ఇలా వాళ్లు ఆ డబ్బులను సినిమాల్లో చూపించిన విధంగా.. మనం ఊహించని ప్రదేశంలో దాచుకుంటారు.

Viral Video: ఇన్ కంట్యాక్స్ అధికారుల దాడులు.. సంపులో కరెన్సీ కట్టలు.. వీడియో వైరల్..!

తాజాగా ఓ కుటుంబంపై రైడ్ నిర్వహించిన అధికారులు.. ఆ కుటుంబసభ్యులు ఆ డబ్బులను దాచిన ప్రదేశం కనుకున్న అధికారులు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామోహ్ జిల్లాలోని వ్యాపారవేత్త శంకర్ రాయ్, అతని కుటుంబంపై దాడులు నిర్వహించారు ఇన్ కంట్యాక్స్ అధికారులు.

Viral Video: ఇన్ కంట్యాక్స్ అధికారుల దాడులు.. సంపులో కరెన్సీ కట్టలు.. వీడియో వైరల్..!

వాళ్లు రూ.8కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. ఆ డబ్బులలో కోటి వరకు అండర్ గ్రౌండ్ వాటర్ (సంపు) లో దాచిన బ్యాగులో దొరికింది. ప్రస్తుతం ఆ డబ్బులను ఆరపెడుతున్నట్లు తెలిపారు. వాటిని ఇస్త్రీ కూడా చేస్తున్నట్లు పేర్కొన్నారు.


రూ. 10 వేల రివార్డును ప్రకటించిన అధికారులు..

నగదుతో పాటు సుమారు రూ.5 కోట్ల విలువైన నగలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతే కాదు మూడు కిలోల బంగారాన్ని కూడా జప్తు చేసినట్లు జాయింట్ కమిషనర్ మున్మున్ శర్మ తెలిపారు. ఈ విషయాన్ని సోదాలకు నేతృత్వం వహించిన జబల్ పూర్ ఐటీ జాయింట్ కమిషనర్ మున్మున్ శర్మ వెల్లడించారు. ఈ దాడి దాదాపు 39 గంటల పాటు కొనసాగింది. మిస్టర్ రాయ్ కుటుంబం ఉద్యోగుల పేరుతో 36 బస్సులను నడుపుతున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ రాయ్ కుటుంబానికి సంబంధించిన ఆస్తుల గురించి మరింత సమాచారం ఎవరైనా ఇస్తే వారికి రూ. 10 వేలు రివార్డును ఇస్తామని డిపార్ట్‌మెంట్ ప్రకటించింది . దీనిపై జాయింట్ కమిషనర్ మాట్లాడుతూ.. రాయ్ కుటుంబానికి సంబంధించి స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభిస్తున్నామని తెలిపాడు. ఈ విచారణ తర్వాత మరిన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు.

Sad News: ఐదేళ్ల బాలికపై అత్యాచారం..! గొంతు కోసి.. మరీ ఘోరంగా..!

Sad News: దేశంలో ప్రతీ రోజు ఎక్కడో ఓచోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వావీవరసలు మరిచి చిన్నాపెద్దా తారతమ్యాలు మరచి కామాంధులు ప్రవిర్తిస్తున్నారు. దేశంలో నిర్భయ, దిశ, పోక్సో వంటి చట్టాలను తీసుకువచ్చినా.. కామాంధుల్లో భయం నెలకొనడం లేదు.

Sad News: ఐదేళ్ల బాలికపై అత్యాచారం..! గొంతు కోసి.. మరీ ఘోరంగా..!

తాజాగా 5 ఏళ్ల చిన్నారిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. ఈ విషాదకర సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్య ప్రదేశ్ హోషంగాబాద్ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగులోకి  వచ్చింది. ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసి గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Sad News: ఐదేళ్ల బాలికపై అత్యాచారం..! గొంతు కోసి.. మరీ ఘోరంగా..!

కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోహగ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాధితురాలి ఇంటి పైకప్పుపై గుడ్డలో చుట్టి ఉన్న బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.  శనివారం మధ్యహ్నం నుంచి బాలిక కనిపించడం లేదంటూ.. ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించారు.

నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు..

బాలిక ఆచూకీ కనిపించకపోవడంతో శనివారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వెతకగా.. బాలిక మృతదేహం ఇంటి పైకప్పుపై కనిపించింది. ఆదివారం మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపగా.. బాలికపై అత్యాచారం చేసి గొంతుకోసి చంపినట్లుగా నివేదిక వచ్చింది. దీంతో సోమవారం పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు కేసును నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. స్థానికంగా ఉండే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు.

అమెజాన్ ద్వారా ఆన్ లైన్ లో గంజాయి కూడా దొరుకుతుంది..! వీళ్లు చేసేది తెలిసి షాక్..

ఈ కామర్స్ సంస్థల్లో ఎక్కువగా పాపులర్ అయినవి అమెజాన్, ప్లిఫ్ కార్టు. వీటి ద్వారా నిత్యావసర సరుకులతో పాటు, గాడ్జెస్, విద్యుత్ ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్స్ మరియు ఇంటి సామాగ్రిని కొనుగోలు చేయవచ్చు. ఇంట్లో కూర్చొని ఆ సంస్థల వెబ్ సైట్ కి వెళ్లి బుక్ చేసుకుంటే.. ఇంటికే డెలివరీ అయిపోతాయి. వీటికి ఒక ఆఫీస్ అంటూ ఏం ఉండదు.

అంతా ఆన్ లైన్ ద్వారానే జరుగుతుంది. అయితే ఇక్కడ అమెజాన్ లో ఇవన్నీ కాకుండా గంజాయి కూడా దొరుకుతుందట. కొంతమంది ఎవరికీ తెలియకుండా.. అనుమానం రాకుండా ఆన్‌లైన్‌లో సేవల ద్వారా గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. ఇటీవల పోలీసులు ఇలా అమెజాన్ ఆన్ లైన్ ద్వారా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అస్సలు ఎలా జరుగుతుంది.. ఎక్కడ నుంచి జరుగుతోంది అనే విషయాలను రాబట్టారు పోలీసులు.

విశాఖపట్టణం కేంద్రంగా మధ్యప్రదేశ్‌కు గంజాయిని సరఫరా చేసినట్లు నిర్ధారించారు. ఈ విషయాలను మధ్యప్రదేశ్ పోలీసులకు చేరవేయగా అక్కడ బెండీలో కేసు నమోదు చేశారు. అక్కడ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా నేడు విశాఖకు చేరుకున్నారు. విశాఖలోని ఓ ఆన్ లైన్ స్టోర్ లో.. కాఫీ పొడి, కరివేపాకు పొడి పేరుతో డబ్బాల్లో గంజాయి పెట్టి.. గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

అందులో కుమారస్వామి, కృష్ణంరాజు, వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. వాళ్లు పార్సల్ రూపంలో ఇస్తుంటే.. వాటిని శ్రీనివాస్‌ అనే వ్యక్తి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇంకా ఈ వ్యవహారంలో ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.

సిగరెట్ కోసం డబ్బులు అడిగినందుకు.. అతడిని దారుణంగా నలుగురు కలిసి?

మనం ఏదైనా దుకాణం దగ్గరకు వెళ్లి ఏదైనా కొన్నప్పుడు తిరిగి డబ్బులను అతడికి ఇస్తాం. దుకాణాదారుడు వాటిని విక్రియించుకుంటూ డబ్బులను సంపాదించుకుంటాడు. ఇలో ఓ వ్యక్తి సిగరెట్ తీసుకొని.. దుకాణాదారుడు డబ్బులు అడిగినందకు చితకబాదాడు. అంతేకాదు.. నలుగురు వ్యక్తులు వచ్చి విచక్షణారహితంగా కొట్టారు.అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగానే కొద్దిసేపటికి చనిపోయాడు.

ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సెహదోల్ లో చోటు చేసుకుంది. మృతుడ్ని అరుణ్​ సోనిగా గుర్తించిన అధికారులు.. ఈ దారుణానికి పాల్పడిన వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగింది పూర్తి వివరాల్లోకి వెళ్దాం.. సెహదోల్ జిల్లా కేంద్రానికి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో డియోలాండ్ లో రాత్రి ఘటన జరిగింది.

రాత్రి 9 గంటల ప్రాంతంలో నలగురు వ్యక్తులు మనుఖాన్, పంకజ్ సింగ్, విరాట్ సింగ్, సందీప్ సింగ్ లు వచ్చి.. అరుణ్ సోనీ అనే వ్యక్తి దుకాణం వద్దక సిగరెట్ అడిగి తీసుకున్నారు. ఆ నలుగురు కూడా సిగరెట్ తీసుకొని డబ్బులు కట్టకుండా వెళ్లిపోసాగారు. సోని గట్టిగా అడిగాడు.

సిగరెట్ కు డబ్బులు కట్టండి అని. ఇక వాళ్లకు కోపం కట్టలు తెంచుకుంది. అక్కడే నలుగురు కలిసి దుకాణాదారుడిని తీవ్రంగా గాయపరిచారు. పక్కన ఉన్న సోనీ కుమారులు అతడ్ని కాపాడేందుకు ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతున్న కొద్దిసేపటికే సోని మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఒకరు తప్పించుకోగా.. ముగ్గురుని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వీడెవడండి బాబూ.. భార్య ముక్కు కొరికి పారిపోయాడు.. ఎందుకో తెలుసా.

దేశంలో ఎటు చూసినా హత్యలు, అత్యాచారాలే కనపడున్నాయి. అన్యోన్యంగా ఉండాల్సిన దంపతులు మధ్య కూడా వివాహేతర సంబంధాల వల్ల వాళ్లను నమ్ముకున్న వారు రోడ్డున పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా ఓ ఘటన వింటే.. వేడెవడండి బాబు అంటూ ముక్కున వేలేసుకుంటారు. భార్య కాపురానికి రావడం లేదని కోపంతో భార్య ముక్కు కొరికాడు.

ఈ మధ్య మరో ఘటనలో భార్య స్నానం చేయలేదని విడాకులు అడిగాడట. ఇటువంటి చిన్న చిన్న కారణాలతో నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రత్లాం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌ రత్లాం జిల్లాలో ఓ గ్రామంలో దినేశ్, టీనాలకు 2008లో వివాహం అయింది.

అప్పటి నుంచి వారు ఎంతో అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ ఉన్నారు. వాళ్లకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని రోజుల నుంచి అతడు మద్యానికి అలవాటు పడ్డాడు. అప్పటి నుంచి అతడు భార్యను వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టాడు. ఇలా వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేక ఆమె తన పుట్టింటికి వెల్లిపోయింది. అక్కడ వంట పని చేసుకుంటూ ఉండగా.. 2019లో ఆమె తన భర్త నుంచి మెయింటెన్స్ కోరుతూ కోర్టులో కేసు దాఖలు చేసిది.

దినేశ్ ఇటీవల భార్య తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి భార్యాబిడ్డల నిర్వహణ విషయంపై చర్చించగా, భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపంతో, దినేశ్ తన కుమార్తెల ముందే.. టీనాపై దాడి చేసి ఆమె ముక్కును కొరికేసి అక్కడ నుంచి పారిపోయాడు. టీనాకు తీవ్ర రక్త స్రావం కావడంతో ఇరుగుపొరుగు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

ఎనిమిది నెలలుగా ఓ మైనర్ బాలికపై ఐదుగురు అత్యాచారం.. చివరకు ఆమె గర్భం దాల్చడంతో..

ఎనిమిది నెలలుగా ఓ మైనర్ బాలికపై కామాంధులు అత్యాచారం చేశారు. వారి కారణంగా బాలిక ఇటీవల గర్భం దాల్చి.. బిడ్డకు జన్మనిచ్చింది. ఆ అత్యాచారంలో తన బంధువుతో పాటు మరో నలుగురు ఉన్నారు. దీంతో ఆమె ఆ బిడ్డను బావిలో ఆ బాలిక బంధువు పడేశాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..కామాంధులు రెచ్చిపోతున్నారు.

వాయి వరసులు మరిచి అయిన వాళ్లపై కూడా ఏ మాత్రం కనికరంలేకుండా అత్యాచారాలకు పాల్పడతున్నారు. మధ్యప్రదేశ్ లోని గ్రామానికి చెందిన ఓ బాలిక(14) తల్లి మూడేళ్ల క్రితమే మరణించింది. ఉపాధి కోసం ఆ బాలిక తండ్రి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాడు. ఇంట్లో ఒంటరిగా ఆమె ఉంటున్న విషయాన్ని ఆమె సమీప బంధువు(21) గమనించాడు.

ఇది గమనించి ఆమెపై 8 నెలల క్రితం అత్యాచారం చేశాడు. అతడికి సంబంధించి మరో నలుగురు స్నేహితులు కూడా.. ఈ విషయాన్ని తాము మీ నాన్నకు చెబుతాం అంటూ బెదిరించి .. అత్యాచారం చేశారు. అప్పటి నుంచి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. ఇటీవల ఆమె గర్భం దాల్చిన విషయం వాళ్లకు తెలవడంతో టాబ్ లెట్స్ ఇచ్చి ఆ గర్భాన్ని పోగొట్టాలని చూశారు. తీవ్ర నొప్పితో ఆమె రక్తస్రావం అయి.. బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలికను తమ సమీప బంధువు బావిలో పడేశాడు.

బావిలో శిశువు మృతదేహంపై పోలీసులకు సమాచారం అందడంతో మొదట బాలికను అదుపులోకి తీసుకొని విచారంచగా.. ఆమె జరిగినది అంతా చెప్పింది. ఆమెను అత్యాచారం చేసిన వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. ప్రధాన నిందితుడిని..అతడి స్నేహితుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను, అందులో ఉన్న ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్ కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

వీడియో వైరల్: రోడ్డుపై చిందులు వేసిన యువతి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..

కొంతమంది ఈ సమాజంలో వారికంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో సాహసాలు చేస్తుంటారు. ఇలాంటి గుర్తింపు కోసమే ఓ మహిళ అతి పెద్ద సాహసం చేసి సాహసం చేసి… అందరి దృష్టిలో పడింది. కానీ ఆమెను గుర్తుంచిన వారికన్నా ఆగ్రహించుకున్న వారే ఎక్కువగా ఉన్నారు. ఇంతకు అంతలా నెటిజన్లు ఆమెను ఆగ్రహించుకోవడానికి గల కారణం ఏమంటే.. రోడ్డుపై వెళ్లే సమయంలో సిగ్నల్ పడితే అందరం ఆగి గ్రీన్ సిగ్నల్ వచ్చే దాకా వెయిటింగ్ చేస్తాం.

అయితే ఇక్కడ ఆ వెయిటింగ్ సమయంలో.. ఓ యువతి రోడ్డు మీదకు వచ్చి డ్యాన్స్ లు వేస్తూ.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇండోర్‌లోని రసోమా స్క్వేర్ సమీపంలో ఉన్న జీబ్రా క్రాసింగ్‌ వద్ద శ్రేయా కల్రా అనే మహిళ రెడ్ లైట్ పడిన సమయంలో డ్యాన్స్ చేసింది.

ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన సోషల్ మీడియా ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఈ పోస్టు తెగ వైరల్ కాగా.. దాని కింద నెటిజన్లు ఆమె చేసిన చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ ప్లేస్ లో అలాంటి పని ఏంటంటూ.. ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ పోస్టు చేయడమే కాకుండా ఆమె ఒక క్యాప్షన్ కూడా పెట్టారు. దయచేసి నియమాలను ఉల్లంఘించవద్దు.

రెడ్ గుర్తు ఉంటే మీరు సిగ్నల్ వద్ద ఆగిపోవాలి. నేను డ్యాన్స్ చేస్తున్నందుకు కాదు. అలాగే అందరూ మాస్క్‌లు ధరించండి అని పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా వాహనదారులు ఇబ్బందులకు గురవ్వడంతో పాటు.. వాళ్ల ఏకాగ్రత మొత్తం వేరే వైపు మళ్లడంతో ప్రమాదాలు సంభవించే ప్రమాదం కూడా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన పై అధికారులకు తెలవడంతో వాళ్లు ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు హోం మంత్రి ఆదేశాలను జారీ చేశారు.

అత్తా, కోడలి మధ్య మొబైల్ విషయంలో గొడవ.. మనస్థాపంతో కోడలు ఏం చేసిందంటే..!

కొన్ని ఘటనలు మనం ఊహించకుండానే జరిగిపోతాయి. మనం అలర్ట్ అయిపోయేసరికి జరిగే నష్టం కాస్త జరిగిపోతుంది. తాజాగా ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ ఛత్తర్‌పూర్‌ లోని సతాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వ గ్రామానికి చెందిన మహిళకు తన అత్తకు మొబైల్ విషయంలో గొడవ జరిగింది.

దీంతో ఆమె తీవ్ర మనస్థాపం చెందింది. ఇంట్లో పని లేని సమయంలో మొబైల్ చూడటం కూడా తప్పా.. అంటూ తనలో ఆమె మదనపడింది. ఆవేశంలో కఠిన నిర్ణయం తీసుకుంది. ఎప్పటిలాగా పశువులను తోలుకొని పొలానికి వెళ్లింది సదరు మహిళ. తనతో పాటు ఇద్దరు పిల్లలను కూడా తీసుకెళ్లింది. వెళ్తున్న దారి వెంట బావులను చూస్తూ ఉంది.

ఆమెతో పాటు పదేళ్ల కూతురుతో పాటు.. నాలుగేళ్ల చిన్నారి ఉంది. దగ్గర్లోనే ఆమెకు బావి కనిపించింది. ఇద్దరు పిల్లలను అందులో తోసేసి.. ఆమె కూడా అక్కడే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఘటనా స్థలంలోనే పెద్ద కూతురు, తల్లి అక్కడిక్కడే మరణించగా.. నాలుగేళ్ల చిన్నారి మాత్రం బావి ఇటుకల మధ్య చిక్కి.. ప్రాణాలతో బయటపడింది. అటుగా వెళ్తున్న స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు.

అత్తతో మొబైల్ విషయంలో గొడవ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఛతర్‌పూర్ సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ శశాంక్ జైన్ వెల్లడించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఇలా కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇంత నీచమా.. కట్టుకున్న భార్యపై అనుమానంతో.. అతడు ఎంత పనిచేశాడో తెలుసా..

వివాహేతర సంబంధాల కారణంగా పలువురు హత్యలకు గురవుతుంటే.. మరికొంత మంది హత్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడ జరిగిన ఘటనలో.. అనుమానం పెనుభూతమై ఆమె పాలిట శాపంగా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తలు మధ్య అనుమానం తాండవించింది.

భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానించి ఆమె ప్రైవేట్ భాగాలను సూది, దారంతో కుట్టేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ సింగ్రౌలి జిల్లాలోని ఓ గ్రామంలో 64 ఏళ్ల వృద్ధుడు, 55 ఏళ్ల వృద్దురాలు దంపతులు. కొన్నేళ్ల క్రిందట వీళ్లిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయ. తరచూ భార్యను వివాహేతర సంబంధం పెట్టుకున్నావని.. వేధించేవాడు.

ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. దీనిలో భాగంగానే ఓ రోజు కోపంతో ఆమె ప్రైవేట్ పార్ట్స్‌కు సూది, దారంతో కుట్లు వేశాడు. దీంతో ఆమె ఓ పోలీస్ అధికారికి సమాచారం అందించడంతో.. ఆమె భర్త చేసిన నీచమైన పని వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది ఆమె ప్రైవేట్ భాగాలకు వేసిన కుట్లను తొలగించారు.

భర్త పెట్టే ఇబ్బందులను తట్టుకోవడమే కాకుండా.. తన భర్తను అరెస్టు చేయవద్దని పోలీసులను వేడుకుంది సదరు మహిళ. పోలీసులు అతడిపై వివిధ రకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని.. పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కట్టుకున్న భార్యను ఇంతలా హింసించిన అతడు మనిషా.. లేదా పశువా.. అంటూ తెలిసిన వారు అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తుపాకీతో మహిళను బెదిరించిన దుండగుడు.. అందరూ చూస్తుండగానే అతడు ఏం చేశాడో తెలుసా..?

ఈ మధ్యకాలంలో దొంగల బీభత్సం తగ్గుముఖం పట్టిందని పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరాల కారణంగా ఆ కేసులను ఛేదించడంలో విజయవంతం అయ్యామని.. ఈ క్రైమ్ రేటు తగ్గిందని చెబుతున్నారు. కానీ మధ్యప్రదేశ్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తున్న మహిళను తుపాకీతో బెదిరించి మెడలో నుంచి బంగారు గొలుసును తెంపుకొని దర్జాగా వెళ్లిపోయాడు.

దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం గ్వాలియర్‌లో స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను మరో స్కూటీపై వచ్చిన ఇద్దరు దుండగులు వెంబడించారు. ఓ మూల మలుపు వద్ద కాపు కాసి.. ఆ స్కూటీపై వచ్చిన వారిని ఆపారు. తమ దగ్గర ఉన్న గన్నును పాయింట్‌ బ్లాక్‌లో పెట్టి బెదిరించారు. వెనుకాల కూర్చున్న వ్యక్తి వారించినా వాళ్లు వినలేదు.

ఇద్దరు భయంతో ఉండగా.. స్కూటీ నడుపుతున్న ఆ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును తీసుకొని తాపీగా వెళ్లాడు. కొద్దిగా ముందుకు వెళ్లి తనతో పాటు వచ్చిన వ్యక్తి బైక్ ఎక్కి ఎంచక్కా వెళ్లిపోయాడు. ఇదంతా జరుగుతున్న సమయంలో అక్కడ జనాలు ఉన్నా.. ఎవరూ ముందుకు రాలేదు.

కనీసం అతడిని ఆపే ప్రయత్నం కూడా చేయలేక పోయారు. ఇదంతా సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.