మనం ఏదైనా దుకాణం దగ్గరకు వెళ్లి ఏదైనా కొన్నప్పుడు తిరిగి డబ్బులను అతడికి ఇస్తాం. దుకాణాదారుడు వాటిని విక్రియించుకుంటూ డబ్బులను సంపాదించుకుంటాడు. ఇలో ఓ వ్యక్తి సిగరెట్ తీసుకొని.. దుకాణాదారుడు డబ్బులు అడిగినందకు చితకబాదాడు. అంతేకాదు.. నలుగురు వ్యక్తులు వచ్చి విచక్షణారహితంగా కొట్టారు.అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగానే కొద్దిసేపటికి చనిపోయాడు.
ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సెహదోల్ లో చోటు చేసుకుంది. మృతుడ్ని అరుణ్ సోనిగా గుర్తించిన అధికారులు.. ఈ దారుణానికి పాల్పడిన వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగింది పూర్తి వివరాల్లోకి వెళ్దాం.. సెహదోల్ జిల్లా కేంద్రానికి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో డియోలాండ్ లో రాత్రి ఘటన జరిగింది.
రాత్రి 9 గంటల ప్రాంతంలో నలగురు వ్యక్తులు మనుఖాన్, పంకజ్ సింగ్, విరాట్ సింగ్, సందీప్ సింగ్ లు వచ్చి.. అరుణ్ సోనీ అనే వ్యక్తి దుకాణం వద్దక సిగరెట్ అడిగి తీసుకున్నారు. ఆ నలుగురు కూడా సిగరెట్ తీసుకొని డబ్బులు కట్టకుండా వెళ్లిపోసాగారు. సోని గట్టిగా అడిగాడు.
సిగరెట్ కు డబ్బులు కట్టండి అని. ఇక వాళ్లకు కోపం కట్టలు తెంచుకుంది. అక్కడే నలుగురు కలిసి దుకాణాదారుడిని తీవ్రంగా గాయపరిచారు. పక్కన ఉన్న సోనీ కుమారులు అతడ్ని కాపాడేందుకు ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతున్న కొద్దిసేపటికే సోని మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఒకరు తప్పించుకోగా.. ముగ్గురుని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…